Pregnancy Diet: గర్భధారణ సమయంలో ఈ 20 ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి: ఇవి బిడ్డ ఆరోగ్యానికి హానికరం!
Pregnancy Diet: గర్భధారణ సమయంలో తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా అనేక సమస్యలకు దారితీయవచ్చు. కొన్ని ఆహారాలు బిడ్డ ఆరోగ్యానికి హాని చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన 20 ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
గర్భధారణ సమయంలో తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధారణంగా ఆరోగ్యానికి మంచివి అనిపించే కొన్ని ఆహారాలు కూడా గర్భధారణ సమయంలో హానికరం కావచ్చు. అందువల్ల, గర్భిణీ స్త్రీలు తమ జీవనశైలికి సంబంధించిన ప్రతి విషయం, ముఖ్యంగా ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు మీరు తినే ఆహారం కడుపులోకి బిడ్డకు హాని చేయచ్చు. గర్భధారణ సమయంలో తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన 20 ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో తినకూడనివి:
1) అనాస(పైన్ ఆపిల్) - గర్భధారణ ప్రారంభ దశలో అనాస తినడం వల్ల గర్భాశయ సంకోచాలు (contractions) రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తినకండి. ప్రారంభ దశలో మాత్రమే కాకుండా బిడ్డకు జన్మనిచ్చే వరకూ బొప్పాయికి దూరంగా ఉండటమే కాదు.
2) మెంతులు - ఎక్కువ మెంతులు తినడం వల్ల కూడా గర్భాశయ సంకోచాలు ప్రేరేపించబడవచ్చు. కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకూ మెంతులకు దూరంగా ఉండటమే మంచిది.
3) అలోవెరా రసం - ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కలబంద ప్రెగ్నెస్సీ సమయంలో నిషేధించాల్సిన ఆహారమే. ఎందుకంటే ఇది కూడా గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది.
4) బొప్పాయి - పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు కలిగించేదే అయినప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో ఇది విషయంతో సమానమని పెద్దలు, నిపుణులు చెబుతారు. ఇది గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు, కాబట్టి గర్భధారణ సమయంలో దీనికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రారంభ దశలో.
5) పచ్చి పుట్టగొడుగులు - పూర్తిగా ఉడకని పుట్టగొడుగులలో బ్యాక్టీరియా ఉండవచ్చు, కాబట్టి వీటిని బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. వీలైనంత వరకూ గర్భధారణ సమయంలో తినకపోవడమే మంచిది.
7) వాము - మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలకు వాము చక్కటి పరిష్కారమే అయినప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో వామును ఎక్కువగా తినడం వల్ల గర్భాశయ ఉద్దీపన కలుగుతుంది.
8) ప్యాక్ చేసిన జ్యూస్‌లు - ఈ రకమైన జ్యూస్‌లలో బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం ఉంటుంది.
9) చీజ్ - బ్రీ, ఫెటా వంటి చీజ్‌లలో లిస్టీరియా ఉండవచ్చు. ఇది బిడ్డ ఆరోగ్యానికి హాని చేయచ్చు. కనుక మెత్తటి చీజ్ లకు గర్భధారణ సమయంలో దూరంగా ఉండటమే మంచిది.
10) మొలకలు - పచ్చి మొలకలలో E. coli, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది తల్లీ బిడ్డా ఆరోగ్యానికి హాని చేస్తుంది.
ఎక్కువగా తీసుకుంటే హాని చేసేవి:
11) గ్రీన్ టీ - ఇందులో కెఫిన్ ఉంటుంది, కాబట్టి గర్భధారణ సమయంలో దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
12) హెర్బల్ టీలు - కొన్ని మూలికలు గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు. కనుక హెర్బల్ టీలు తాగేటప్పుడు ఆచీతూచీ ఎంచుకోండి.
13) కృత్రిమ తీపి పానీయాలు - కృత్రిమ తీపి పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర, సంకలనాలు ఉంటాయి. ఇవి తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదముందు.
14) గ్లూటెన్ - మీకు గ్లూటెన్ అసహనం ఉంటే, సమస్యలను నివారించడానికి దీనికి దూరంగా ఉండండి.
15) జంక్ ఫుడ్ - జంక్ ఫుడ్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, సంకలనాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వీటికి వీలైనంత దూరంగా ఉండమే మంచిది. స్పైసీగా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకుని మితంగా తినండి.
16) నిమ్మకాయ - గర్భధారణ సమయంలో యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తుంది. కనుక నిమ్మకాయను, నిమ్మరసాన్ని ఈ సమయంలో ఎక్కువగా తీసుకోకండి.
17) వెల్లుల్లి - జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఇది తల్లితో పాటు లోపల ఉన్న బిడ్డకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని మితంగా మాత్రమే తీసుకోండి.
18) చింతపండు - ఎక్కువగా చింతపండు తినడం వల్ల గర్భాశయ సంకోచాలు రావచ్చు. కనుక అతిగా కాకుండా మితంగా తినేలా ప్లాన్ చేసుకొండి.
19) మిగిలిన ఆహారం - మిగిలిపోయిన అన్నం, కూర, తీపి పదార్థం వంటి వాటిని గర్భధారణ సమయంలో తినకపోవడమే మంచిది. వీటిని సరిగ్గా సరిగ్గా నిల్వ చేయకపోతే అందులో బ్యాక్టీరియా పెరుగుతాయి, ఇది ఇద్దరి ఆరోగ్యానికి మంచిది కాదు.
20) వేపుళ్ళు - ఎక్కువగా వేపుళ్ళు తినడం ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే వీటిలో ట్రాన్స్ కొవ్వులు ఉంటాయి. ఇవి తల్లినీ, బిడ్డను ఇబ్బంది పెట్టే ప్రమాదముంది కనుక ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని మితంగా మాత్రమే తినండి.