Prawns Ghee Roast: మంగుళూరు స్టైల్‌లో రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీ, ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోలేరు-prawns ghee roast recipe in telugu know how to make this tasty recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prawns Ghee Roast: మంగుళూరు స్టైల్‌లో రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీ, ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోలేరు

Prawns Ghee Roast: మంగుళూరు స్టైల్‌లో రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీ, ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోలేరు

Haritha Chappa HT Telugu
Dec 09, 2024 11:30 AM IST

Prawns Ghee Roast: మీరు నాన్ వెజ్ ప్రియులైతే ఓసారి రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీని తిని చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రెసిపీ కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో పుట్టిందని చెప్పుకుంటారు. దీనిని అన్నం, చపాతీ, రోటీతో తింటే రుచి సూపర్ గా ఉంటుంది.

రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీ
రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీ

మాంసాహార ప్రియులకు రొయ్యలంటే ఎంతో ఇష్టం. రొయ్యలతో ఎన్నో ఆరోగ్యకరమైన రెసిపీలు చేసుకోవచ్చు. ఎప్పుడూ చికెన్ లేదా మటన్ వంటకాలనే కాదు అప్పుడప్పుడు రొయ్యలు కూడా తినేందుకు ప్రయత్నించండి. దీనితో చేసే రొయ్యల ఘీ రోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కేవలం నెయ్యినే వేస్తాము. నూనెను వాడాల్సిన అవసరం లేదు. ఈ వంటకం కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో పుట్టినట్టు చెబుతున్నారు. ఈ రెసిపీని అన్నంతో, చపాతీ, రోటీలతో తింటే రుచి అదిరిపోతుంది. అవేవీ లేకుండా కేవలం స్నాక్స్ లా కూడా దీన్ని తినవచ్చు. రొయ్యల ఘీ రోస్ట్ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.. ఈ రెసిపీని ఫాలో అయిపోండి.

yearly horoscope entry point

రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

రొయ్యలు - ఒక కిలో

నెయ్యి - ఆరు స్పూన్లు

వెల్లుల్లి - నాలుగు

అల్లం - ఒక స్పూన్ తరుగు

కరివేపాకు - గుప్పెడు

పసుపు - పావు స్పూన్

కారం - అర టీస్పూన్

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర తరుగు - రెండు టీస్పూన్లు

జీలకర్ర - రెండు టీస్పూన్లు

ఉప్పు - రుచికి తగినంత

చింతపండు గుజ్జు - రెండు స్పూన్లు

ఎండు మిర్చి - నాలుగు

ధనియాలు - ఒక స్పూను

సోంపు - అర స్పూను

మిరియాలు - అరస్పూను

మెంతులు - పావు స్పూను

రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీ

  1. ముందుగా ఎండుమిర్చిని గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి.
  2. ఒక గిన్నెలో రొయ్యలను వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  3. అందులో ఉప్పు, పసుపు, కారం వేసి అరగంట పాటూ పక్కన పెట్టాలి.
  4. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, మెంతులు వేసి వేయించండి.
  5. ఇప్పుడు మిక్సీలో వేయించిన మసాలా దినుసులు, నానబెట్టిన ఎండు మిర్చి, చింత పండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  6. ఇప్పుడు స్టవ్ మద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. మీడియం మంట మీదే ఉంచి వండాలి.
  7. నెయ్యి వేడెక్కాక కరివేపాకులు వేసి వేయించాలి. అందులో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి.
  8. అందులో మ్యారినేట్ చేసిన రొయ్యలు వేసి వేయించాలి.
  9. అయిదు నిమిషాలు ఉడికించాక రొయ్యల్లోని నీరంతా ఇంకిపోతుంది. అలా ఇంకిపోయాక మెత్తగా రుబ్బిన మసాలా మిశ్రమం వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
  10. బాగా వేగే దాకా ఉంచే వరకు ఉంచాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
  11. అంతే టేస్టీ రొయ్యల ఘీ రోస్ట్ రెసిపీ రెడీ అయినట్టే. దీన్ని అన్నం, రోటీతో, చపాతీతో చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. ఎందుకంటే దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉండదు. ఇది మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Whats_app_banner