Prawns Fry: రొయ్యల పాప్‌కార్న్ రెసిపీ... ఇంట్లోనే ఇలా రుచిగా చేసేయండి-prawns fry recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prawns Fry: రొయ్యల పాప్‌కార్న్ రెసిపీ... ఇంట్లోనే ఇలా రుచిగా చేసేయండి

Prawns Fry: రొయ్యల పాప్‌కార్న్ రెసిపీ... ఇంట్లోనే ఇలా రుచిగా చేసేయండి

Haritha Chappa HT Telugu
Apr 15, 2024 03:30 PM IST

Prawns Popcorn: రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో కూరలు, బిర్యానీలే కాదు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ రొయ్యల ఫ్రై చేసి చూడండి.

రొయ్యల డీప్ ఫ్రై
రొయ్యల డీప్ ఫ్రై

Prawns Fry: రొయ్యలు అంటే మీకు ఇష్టమా? ఎప్పుడూ బిర్యానీలు, కూరలే కాదు ఓసారి రొయ్యల డీప్ ఫ్రై చేసి చూడండి. ఇవి కరకరలాడుతూ ఇవి భలే టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకి ఇవి బాగా నచ్చుతాయి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినాలంటే ఇలా రొయ్యల డీప్ ఫ్రై చేయండి. వీటిని చేయడం చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

రొయ్యల డీప్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు

రొయ్యలు - ఒక కిలో

మిరియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

కారం - అర స్పూను

గుడ్లు - రెండు

కార్న్ ఫ్లోర్ - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

ఆమ్చూర్ పొడి - అర స్పూను

రొయ్యల డీప్ ఫ్రై రెసిపీ

1. రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

2. ఆ గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలిపి పావుగంట సేపు మ్యారినేట్ చేయాలి.

3. అందులోనే రెండు గుడ్లను కొట్టి బాగా కలుపుకోవాలి.

4. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి.

5. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.

6. నూనె వేడెక్కాక రొయ్యలు ఒక్కొక్క దాన్ని తీసి కార్న్ ఫ్లోర్లో ఇటు అటు రోల్ చేసి నూనెలో వేయించాలి.

7. రెండు మూడు నిమిషాలు వేయిస్తే త్వరగా వేగిపోతాయి. అంతే రొయ్యల డీప్ ఫ్రై రెడీ అయినట్టే. వీటిని కరకర నమిలి తినేయడమే.

రొయ్యలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి12 లోపిస్తే మన శరీరంలో ఎన్నో లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విటమిన్ బి12 లోపం ఉన్నవారు రొయ్యలను తింటే మంచిది. విటమిన్ బి12 లోపం వల్ల అలసటగా, డిప్రెషన్, బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి.

అలాంటివారు రొయ్యలను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. రొయ్యల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించుకోవడానికి రొయ్యలు మంచి ఆహారం. రొయ్యల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. రొయ్యలు తినే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి వారానికి కనీసం ఒక్కసారి రొయ్యలు తినేందుకు ప్రయత్నించాలి.

WhatsApp channel

టాపిక్