Relationship: పవర్ వల్ల ప్రేమ తగ్గుతుందా? వారు మోసం చేసే రిస్క్ ఎక్కువట: షాకింగ్ విషయాలు వెల్లడించిన అధ్యయనం
Relationship: పవర్‌ఫుల్ వ్యక్తులు రిలేషన్లలో ఎలా ఉంటారనే అంశంపై అంశంపై తాజాగా ఓ అధ్యయనం వెల్లడైంది. ఎక్కువ శాతం శక్తివంతమైన వారు గొప్ప ప్రేమికులుగా ఉండలేరని ఆ స్టడీ పేర్కొంది. మరిన్ని షాకింగ్ విషయాలు రివీల్ చేసింది.
సినిమాలు, వ్యాపారాలు, క్రీడలు.. ఇలా ఏ రంగంలో అయిన వ్యక్తులు పవర్‌ఫుల్ అయ్యే కొద్ది వారికి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇది వారి రిలేషన్‍షిప్ పరిస్థితుల్లోనూ మార్పులు తెస్తుంది. సినిమాల్లో, రచనల్లో పపర్‌ఫుల్ వ్యక్తుల జీవితాల్లో పెళ్లి, ప్రేమ లాంటి రిలేషన్ ఎక్కువ శాతం బాగుంటుంది. ఆ క్యారెక్టర్లకు ఫ్యాన్‍బేస్ గట్టిగా ఉంటుంది. అయితే, నిజజీవితంలో ఎక్కువ మంది పపర్‌ఫుల్ వ్యక్తుల రిలేషన్ అలా ఉండదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
నిజజీవితంలోని పపర్‌ఫుల్ వ్యక్తుల రిలేషన్ అంత రొమాంటింక్‍గా ఉండదని ఓ అధ్యయనం వెల్లడించింది. పవర్ రావడం వల్ల ఆధిపత్యం చెలాయించే గుణం పెరుగుతుందని, దీనివల్ల వారు జీవిత భాగస్వామిని మోసం చేసే రిస్క్ కూడా అధికంగా ఉంటుందని ఆ స్టడీ పేర్కొంది. శక్తివంతమైన వ్యక్తులు తమ రిలేషన్‍షిప్‍లో ఎలా ఉంటారనే విషయంపై ఆర్కివ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్‌లో ఓ స్టడీ ప్రచురితమైంది.
ప్రేమ తగ్గిపోతుంది
ఇద్దరిలో ఒకరు శక్తివంతులు కావడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ తగ్గుతుందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రేమ, గౌరవాన్ని పవర్ అనేది అధిగమించేస్తుందని పేర్కొంది. ఇజ్రాయెల్‍లోని హెర్జిలియాలోని రీచ్‍మన్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన రోచెస్టర్ యూనివర్సిటీకి చెందిన సైలజిస్టులు ఈ అధ్యయనం చేశారు. పవర్ అనేది రిలేషన్‍షిప్‍లో ఎలాంటి మార్పులు తెస్తుందో.. నమ్మకాలు ఎలా మారతాయో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
ఇతర ఆప్షన్ల కోసం చూడడం
రిలేషన్‍షిప్‍లో పవర్‌ఫుల్ అని భావించే వారు జీవిత భాగస్వామిని మోసం చేసే రిస్క్ కూడా ఎక్కువేనని ఈ అధ్యయనం పేర్కొంది. చాలా మంది రిలేషన్ కోసం బయటికి ఆప్షన్ల కోసం కూడా చూస్తారని వెల్లడించింది. ఇతరులతో బంధం కోసం ప్రయత్నిస్తారని పేర్కొంది.
“రిలేషన్‍షిప్‍లో పవర్ అనేది చాలా మార్పులను తెస్తుంది. శక్తివంతంగా ఉండే భాగస్వామి.. తమ వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని.. తక్కువ పవర్ ఉన్న భాగస్వామి గురించి అనుకుంటారు. రిలేషన్‍షిప్‍ల కోసం తమకు బయట చాలా ఆప్షన్లు ఉన్నాయని ఎక్కువ పవర్ ఉన్న భాగస్వామి అనుకుంటారు” అని అధ్యయనవేత్త, రీచ్‍మన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురిట్ బ్రిండవుమ్ ఈ స్టడీలో పేర్గొన్నారు.
పవర్ అనేది రిలేషన్‍షిప్‍ల్లో ఎలాంటి కల్లోలం సృష్టిస్తుందో నాలుగు పరీక్షలను అధ్యయన వేత్తలు నిర్వహించారు. పవర్ రావడం వల్ల జీవిత భాగస్వామిని చూసే విధానం, లైంగిక ఊహలు, కోరికలు, నిజజీవిత చర్యలు మారతాయని వారు నిర్వహించిన సర్వే ద్వారా తేల్చారు. తమను తాము శక్తివంతంగా అనుకునే వ్యక్తులు చాలా మంది.. ప్రస్తుతం వారి రిలేషన్‍కు మించి ఇతరులపై కూడా ఆసక్తిగా ఉన్నారని తేలిందని పేర్కొన్నారు. పవర్ వల్ల రిలేషన్‍లో నిజాయితీ విస్మరించేందుకు ప్రేరణ దక్కుతోందని అభిప్రాయపడ్డారు.
భాగస్వామి కంటే తాను విలువైన వ్యక్తి అని అనుకుంటే రిలేషన్‍పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలాంటి భావన.. నిబద్ధతను దెబ్బతీస్తుంది. ఎక్కువ శక్తివంతులమని అనుకునే భాగస్వామి.. అవకాశం వస్తే ఇతురులతో స్వల్ప కాలిక బంధాన్ని పెట్టుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని రోచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హ్యారీ రీస్ వివరించారు.
టాపిక్