Potluck Dinner Ideas: 31కి పాట్‌లక్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ఐడియాతో పండగ చేసుకోండి
Potluck Dinner Ideas: పాట్ లక్ డిన్నర్ అంటే ఆహారం, వంట నైపుణ్యాలపై ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడమే కాకుండా, కుటుంబాలు, స్నేహితుల మధ్య ఆత్మీయతలు, ఆప్యాయతలను పెంచుతుంది. డిసెంబరు 31న రాత్రి ఇలాంటి పాట్‌లక్ ప్లాన్ చేసే వారి కోసం కొన్ని ఐడియాలు ఇక్కడ చూడొచ్చు.
పాట్‌లక్ పార్టీ అంటే కొన్ని కుటుంబాలు లేదా కొందరు స్నేహితులు తమ ఇళ్లల్లో వండుకుని ఒకచోట సమూహంగా చేరి భోజనం చేయడం. డిసెంబరు 31, న్యూ ఇయర్ వంటి వేడుకల్లో ఇలాంటివి బాగా జరుగుతాయి. మరి ఈ పార్టీ హాయిగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మీకోసం.
పాట్‌లక్ ప్లాన్ కు సిద్దం అవడం ఇలా
- పాట్ లక్‌లో మొత్తం పాల్గొనే కుటుంబాలు లేదా స్నేహితుల సంఖ్య తెలుసుకోవాలి. చిన్న పిల్లలను కూడా కౌంట్ చేసుకోవాలి. వారికి ఆహార పరిమాణం తగ్గినా, ప్లేట్లు, స్పూన్లు వంటివైతే కౌంట్ చేయాల్సిందే.
- ప్లాట్‌లక్ లో పాల్గొనే వారి అభిరుచులు, నైపుణ్యాలను బట్టి వారికి వంటకాలను కేటాయించాలి. ఏది బాగా వండగలరో అది కేటాయిస్తే పార్టీ రుచులతో అదిరిపోతుంది. ఒక 10 కుటుంబాలు పాల్గొంటున్నట్టయితే మూడు కుటుంబాలకు స్టార్టర్స్, మరో మూడు కుటుంబాలకు మెయిన్ కోర్స్, ఇలా బాధ్యతలు కేటాయించాలి.
- రెస్టారెంట్లలో ఎప్పుడూ అందుబాటులో ఉండేవి కాకుండా అరుదైన వంటకాలను ఎంచుకోవాలి. అంటే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతీయ ప్రత్యేకతలు ఎంచుకోవడం మంచిది.
- ఎంత పరిమాణంలో వండాలి? స్టార్టర్స్ అయితే ఎంత అవసరం? మెయిన్ కోర్సు, డెజర్ట్స్ ఎంత అవసరం వంటి స్పష్టమైన సూచనలను లిస్ట్ చేసుకోవాాలి.
- అన్నింటికీ ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటే పార్టీ సమయానికి గందరగోళం తప్పుతుంది.
- వీలైతే పాట్ లక్ పార్టీకి అనువైన అలంకరణలు, వినేందుకు మ్యూజిక్ , కూర్చునేందుకు తగిన వేదిక రెడీ చేసుకోవాలి.
- వీలైతే డంబ్ షరాడ్జ్ (dumb charades), మ్యూజికల్ చైర్స్, తంబోలా వంటి గేమ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. వీటిని ఆడించే బాధ్యతలు ఒకరికి అప్పజెప్పాలి.
- వంటలు కాకుండా కొన్ని ఇతర అవసరాలు కూడా ఉంటాయి. తాగునీరు, ప్లేట్లు, స్పూన్లు, వాష్ బేసిన్, ఇతర కనీస అవసరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వీటన్నింటి బాధ్యత ఒకరికి అప్పజెప్పొచ్చు.
వంటకాల కోసం ఐడియాలు
నాన్ వెజ్ స్టార్టర్స్:
చికెన్ 65, చికెన్ మేజిస్టక్, చిల్లీ చికెన్, చికెన్ పకోడా, చికెన్ నగెట్స్, చికెన్ వింగ్స్, షీక్ కబాబ్, పత్తర్ కా గోష్ట్, రేష్మీ కబాబ్, తంగ్డీ కబాబ్, ఫిష్ ఫ్రై, ఫిష్ ఫింగర్స్, ప్రాన్స్ ఫ్రై, మటన్ ఫ్రై, ఎగ్ రోల్స్, చిల్లీ ఎగ్, మటన్ లివర్, పాయ
వెజ్ స్టార్టర్స్:
సర్వ పిండి, పనీర్ టిక్కా, ఆలూ టిక్కీ, గోబీ మంచూరియా, పనీర్ పకోడా, కార్న్ సమోసా, భేల్ పూరి, మొక్కజొన్న చీజ్ బాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడి, క్రాస్పీ కార్న్
మెయిన్ కోర్స్
బిర్యానీ: హైదరాబాదీ బిర్యానీ, ఆంధ్రా మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ.
పులావ్: వెజిటబుల్ పులావ్, చికెన్ పులావ్, మటన్ పులావ్.
రోటి: చపాతీ, నాన్, బటర్ నాన్, పుల్కా
కూరలు: గోంగూర చికెన్ కర్రీ, గోంగూర మటన్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు, రొయ్యల ఇగురు, తలకాయ మాంసం, వెజ్ ప్రియులకు బీరకాయ బొబ్బెర్లు, పాలక్ పనీర్, పప్పు, పచ్చిపులుసు వంటివి ఎంచుకోవచ్చు.
సైడ్ డిష్
రైతా: దోసకాయ రైతా, ఉల్లిపాయ రైతా, బూందీ రైతా.
పాపడ్: సాదా పాపడ్, మసాలా పాపడ్,
పచ్చడి: గోంగూర పచ్చడి, టొమాటో పచ్చడి, లేదా దొండకాయ పచ్చడి
డెజర్ట్: డబల్ కా మీటా, గులాబ్ జామూన్, క్యారెట్ హల్వా
ఫ్రూట్ సలాడ్: సీజనల్ ఫ్రూట్స్.
సలాడ్లు: కీరా క్యారట్ గ్రీన్ సలాడ్, టొమాటో సలాడ్
డ్రింక్స్: కూల్ డ్రింక్స్ లేదా బదులు పండ్ల రసాలు, నిమ్మ రసం వంటివి ట్రై చేయొచ్చు.