Potato Stciks Recipe: కరకరలాడే పొటాటో స్టిక్స్‌ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎలాగో చూసేయండి!-potato snacks try crunchy potato sticks can be easily made at home here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Stciks Recipe: కరకరలాడే పొటాటో స్టిక్స్‌ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎలాగో చూసేయండి!

Potato Stciks Recipe: కరకరలాడే పొటాటో స్టిక్స్‌ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎలాగో చూసేయండి!

Ramya Sri Marka HT Telugu

Potato Stciks Recipe: క్రిస్పీ క్రంచీగా ఉండే పొటాటో స్టిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అంతా ఇష్టంగా తినే వీటిని ప్రతిసారి బయట నుంచి తెచ్చుకుంటే ఏం బాగుంటుంది. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

బంగాళాదుంపలతో తయారు చేసిన కరకరలాడే పొటాటో స్టిక్స్

ఈజీగా తయారయ్యే రుచికరమైన స్నాక్స్ చేయాలంటే టక్కున గుర్తొచ్చేది బంగాళదుంప. దీంట్లో స్వీట్ నుంచి హాట్ వరకూ ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. రుచిలో కూడా వీటిని తిరుగుండదు. అందుకే చాలా మంది పొటాటో స్నాక్స్ అంటే ఇష్టంగా తింటారు. అయితే మీరు ఇప్పటి వరకూ బంగాళాదుంపలతో బజ్జీలు, పునుగులు వేసుకుని తిని ఉంటారు. ఆలూ పరోటాలు, పకోడీలను కూడా రుచి చూసే ఉంటారు. ఈసారి కొత్తగా పొటాటో స్టిక్స్ తయారు చేసి చూడండి. కరకరలాడు, క్రంచీగా ఉండే పొటాటో స్టిక్స్ ఇంట్లో పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరినీ నచ్చుతాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. సింపుల్ అండ్ ఈజీ పొటాటో స్టిక్స్ రెసిపీ ఏంటో చూసేద్దా రండి..

పొటాటో స్టిక్స్ తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు

  1. బంగాళాదుంపలు - 400 గ్రాములు
  2. నీరు - అర లీటర్
  3. మిరియాల పొడి - పావు టీ స్పూన్
  4. ఉప్పు - రుచికి తగినంత
  5. కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
  6. బియ్యం పిండి- రెండు స్పూన్లు
  7. చీజ్ - రెండు స్పూన్లు
  8. నూనె - ఒక స్సూన్ + డీప్ ఫ్రైకి సరిపడా

పొటాటో స్టిక్స్ తయారీ విధనాం..

  1. కరకరలాడే బంగాళదుంప స్టిక్స్ తయారు చేయడం కోసం ముందుగా బంగాళాదుంపలను తీసుకుని వాటి తొక్కంతా తీసేయండి.
  2. తరువాత వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేయండి.
  3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో నీరు పోసి వేడి చేయండి. నీరు వేడెక్కిన తర్వాత దాంట్లో ఆలూ ముక్కలు వేసి బాగా ఉడికించండి.
  4. బంగాళాదుంపలన్నీ ఉడికిన తర్వాత వాటిలోని నీరంత పోయే వరకూ పక్కకు పెట్టుకోండి.
  5. తరువాత స్మాషర్ లేదా గరిటే సహాయంతో ఉడికిన బంగాళాదుపంలను స్మాష్ చేసి మెత్తటి పేస్టులా తయారు చేయండి.
  6. ఇపుడీ పేస్టును ఒక బౌల్‌లోకి తీసుకుని దాంట్లో మిరియాల పోడి, ఉప్పు, కార్న్ ఫ్లోర్, బియ్యం పండి, సన్నగా తురిమిని చీజ్‌తో పాటు ఒక స్పూన్ నూనె వేసి అన్నింటినీ బాగా కలుపుకోండి.
  7. అన్నీ బాగా కలిసిపోయి పిండి మెత్తగా, మృదువుగా మారేంత వరకూ బాగా కలపండి.
  8. తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ పొడవాటి స్టిక్స్ ను తయారు చేసుకోండి.
  9. మొత్తం మిశ్రమాన్ని ఇలా స్టిక్స్ లా తయారు చేసుకోండి.
  10. ఈలోపు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పొటాటో స్టిక్స్ ను నూనెలో వేసి వేయించండి.
  11. స్టిక్స్ రెండు వైపులా వేగి బంగారు రంగులోకి మారేంత వరకూ గరిటతో తిప్పుతూ వేయించండి.

అంతే కరకరలాడే రుచికరమైన పొటాటో స్టిక్స్ రెడీ అయినట్టే. వీటిని టామాటో సాస్, పెరుగు లేదా మీకు నచ్చిన గ్రీన్ చట్నీ వంటి వాటితో కలిపి తిన్నారంటే వేరే స్నాక్స్ వద్దంటారు. పిల్లలైతే వీటిని చేసి పెడతానంటే ఏ పని చేసినా చేసేస్తారు. కావాలంటే ట్రై చేసి చూడండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం