సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తోందా? ఒకసారి బంగాళదుంప పకోడీ ప్రయత్నించి చూడండి. ఉల్లిపాయ పకోడీలాగే బంగాళదుంప పకోడీ కూడా రుచిగా ఉంటుంది. పైగా ఇది ఉల్లిపాయలు, బంగాళదుంప కలిపి చేసేది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. పిల్లలకి బంగాళదుంపలతో చేసే వంటకాలు కూడా బాగా నచ్చుతాయి. కాబట్టి ఈ బంగాళదుంప పకోడీ కూడా కచ్చితంగా నచ్చుతుంది.
బంగాళదుంపలు - మూడు
ఉల్లిపాయలు - రెండు
శెనగపప్పు - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకులు - గుప్పెడు
బియ్యప్పిండి - పావు కప్పు
శెనగపిండి - అరకప్పు
ధనియాల పొడి - ఒక స్పూను
వంటసోడా - పావు స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
కారం - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
1. పకోడీ చేసేందుకు ముందుగా బంగాళాదుంపలను పొట్టు తీసి సన్నగా నిలువుగా ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేయాలి.
2. అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
3. ఇప్పుడు ఆ గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, వంటసోడా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు బియ్యప్పిండి, శెనగపిండి కూడా వేసే దీన్ని బాగా కలపాలి. కాస్త నీళ్లు చిలకరించాలి.
5. ఈ మిశ్రమం గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
7. ఆ నూనెలో ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పకోడీ ఇలా వేసుకొని అన్నివైపులా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయించుకోవాలి.
8. ఇప్పుడు దీన్ని పుదీనా చట్నీతో తింటే అదిరిపోతుంది.
9. ఒక్కసారి తిని చూడండి... మీరు దీని రుచి మర్చిపోలేరు. మై మరిచిపోతారు.
నూనెలో వేయించిన బంగాళదుంప పకోడీని ఒకసారి టిష్యూ పేపర్ తో నొక్కి తినడం మంచిది. ఇలా చేయడం వల్ల అదనపు టిష్యూ పేపర్ పిల్చుకుంటుంది. డయాబెటిస్ రోగులు మాత్రం ఈ ఆహారాన్ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో బంగాళదుంపను వేసాము. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ కాబట్టి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.
సంబంధిత కథనం