Potato Fry: పొటాటోఫ్రై ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు
Potato Fry: పొటాటో రోస్ట్ చూస్తేనే నోరూరిపోతుంది. ఈ వంటకం పిల్లలకు ఎంతో నచ్చుతుంది. దీన్ని మసాలా ఆలూ అని కూడా పిలుస్తారు. దీని రెసిపీ తెలుసుకోండి.

Potato Fry: బంగాళదుంపలతో చేసిన ఏ వంటకాన్ని అయినా పిల్లలు ఇష్టంగానే తింటారు. ఇక్కడ వారి కోసం పొటాటో రోస్ట్ రెసిపీ ఇచ్చాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది పొడిపొడిగా ముక్కలుగా వస్తుంది, కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ పొటాటో రోస్ట్ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోండి. సాంబారు లేదా పెరుగన్నంతో పిల్లలకు ఈ పొటాటో రోస్ట్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.
పొటాటో రోస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - మూడు
బియ్యప్పిండి - ఒకటిన్నర స్పూను
నూనె - ఒక స్పూన్
ఇంగువ - పావు స్పూను
జీలకర్ర - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
ధనియాల పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
సోంపు పొడి - పావు స్పూను
పొటాటో రోస్ట్ రెసిపీ
1. బంగాళదుంపలను ఒక గిన్నెలో వేసి నీళ్లు వేయాలి. వాటిని ఉడకబెట్టుకోవాలి. అవి 80 శాతం ఉడికే దాకా ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
2. ఇప్పుడు పైన పొట్టును తీసి వాటిని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గిన్నెలో ఆ బంగాళదుంప ముక్కలను వేసి బియ్యప్పిండిని వేసి కలపాలి.
4. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు పౌడర్, జీలకర్ర పొడి వేసి అందులో బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో జీలకర్ర వేసి వేయించుకోవాలి.
7. ఇప్పుడు మ్యారినేట్ చేసిన బంగాళాదుంప ముక్కలను వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
8. నీళ్లు వేయకుండా నూనెలోనే వీటిని వేయించాలి.
9. అవి ఎర్రగా మారేవరకు వేయించుకొని పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
10. అంతే టేస్టీ పొటాటో రోస్ట్ రెడీ అయినట్టే. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
11. పిల్లల కోసం చేసేటప్పుడు వారు ఎంత కారాన్ని తట్టుకోగలరో అంత కారం మాత్రమే వేయండి.
ఇందులో మనం సోంపు పౌడర్ వేసాము. ఈ పొటాటో రోస్ట్ లో సోంపు పౌడర్ ఇష్టం లేకపోతే పక్కన పెట్టేయొచ్చు. లేదా ఇంగువ పొడిని కసూరి మేథి కూడా చల్లుకోవచ్చు. గరం మసాలా కూడా జోడించుకోవచ్చు. ఇది మీ రుచిని బట్టి ఉంటుంది. దీన్ని ఒక్కసారి చేశారంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలు ఎనభైశాతం ఉడికించాము, కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మేలే. వీటిలో ఉండే పిండి పదార్థాలు కూడా ఉడికించడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి.
టాపిక్