జిమ్‌కు వెళ్లేవారి శరీరానికి ప్రొటీన్ అందించే హెల్తీ బంగాళదుంప సలాడ్, ఇదిగోండి రెసిపీ!-post gym fuel alert this super healthy potato salad gives your muscles a whopping 50g of protein ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జిమ్‌కు వెళ్లేవారి శరీరానికి ప్రొటీన్ అందించే హెల్తీ బంగాళదుంప సలాడ్, ఇదిగోండి రెసిపీ!

జిమ్‌కు వెళ్లేవారి శరీరానికి ప్రొటీన్ అందించే హెల్తీ బంగాళదుంప సలాడ్, ఇదిగోండి రెసిపీ!

Ramya Sri Marka HT Telugu

జిమ్‌కు వెళ్లి కండరాలు పెంచే వాళ్లకు బాగా తెలుస్తుంది ప్రొటీన్ విలువ. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎంచుకుని మరీ, తినేవారు ఈ రెసిపీ తప్పక ఫాలో అవ్వాలి. అందరికీ నచ్చే బంగాళదుంపలతో సులువుగా తయారు చేసుకునే రెసిపీ ఇది.

ఆలూతో ప్రొటీన్ రెసిపీ

ప్రొటీన్ కోసం కేవలం చికెన్‌ని మాత్రమే ఎన్ని రోజుల వరకూ తింటారు. అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇలా అయితే ప్రొటీన్ కావలసిన ప్రొటీన్ తినట్టు ఉంటుంది అలాగే నోటికి కాస్త కొత్త టేస్ట్ ఆస్వాదించినట్టు కూడా ఉంటుంది. చికెన్, మిల్ మేకర్, బంగాళదుంప లాంటి ప్రొటీన్ కాంబోలతో సలాడ్ తయారు చేసుకుని ఉదయాన్నే తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి.

కావల్సిన పదార్థాలు:

  • 500 గ్రాములు - బంగాళదుంపలు
  • మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు
  • కాశ్మీరీ కారం - రెండు టీ స్పూన్లు
  • కొత్తిమీర, పుదీనా - ఆకుల మిశ్రమం రెండు స్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత
  • చికెన్ - 120 గ్రాములు
  • పెరుగు - 30 గ్రాములు
  • పాప్రికా - రెండు టీ స్పూన్లు
  • ఎండు మిరప గింజలు - రెండు టీ స్పూన్లు
  • మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు
  • నిమ్మరసం - ఒక కాయ రసం
  • చీజ్ - 20 గ్రాములు
  • కీరదోస ముక్కలు - అర కప్పు
  • క్యారెట్ - రెండు

ప్రొటీన్ ప్యాక్‌డ్ బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం:

  1. ముందుగా అరకిలో బంగాళదుంపలు తీసుకుని వాటిని బాగా కడిగి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి.
  2. కట్ చేసిన బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, మసాలా పొడి, కశ్మీరీ కారపు పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
  3. ఈ ముక్కలను ఎయిర్ ఫ్రైయర్‌లో 20 నిమిషాల పాటు ఉంచండి.
  4. తర్వాత, కొద్దిగా చికెన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేయండి.
  5. చికెన్ ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పాప్రికా, 1 టీ స్పూన్ ఎండు మిరప గింజలు, 1 టీ స్పూన్ ఒరిజానో పొడి వేసి బాగా కలపండి.
  6. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని అందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, రుచికి తగినంత నిమ్మరసం వేసి బాగా కలపండి.
  7. తర్వాత అందులో 20 గ్రాముల చీజ్ లేదా వెన్న వేసి కలపండి.
  8. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో చిన్నగా తరిగిన కీరదోస ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన లేదా ఎయిర్ ఫ్రై చేసిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలపండి.
  9. చివరగా, ఈ సలాడ్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకుని దాని పైన కొద్దిగా పెరుగు వేసి మీకు నచ్చిన ఆకారంలో అలంకరించండి.
  10. పైన ఉడికించిన బంగాళదుంప ముక్కలను కూడా అలంకరణ కోసం ఉపయోగించుకోవచ్చు.

ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో కలిగే లాభాలు:

బంగాళదుంపలు: శక్తినివ్వడంతో పాటు పోషకాలు, ఫైబర్ అందిస్తాయి. సలాడ్‌కు నిండుదనాన్నిస్తాయి.

చికెన్: ప్రోటీన్ అందించి కండరాలకు బలం చేకూరుస్తుంది..

పెరుగు: ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ కలిగి ఉంటుంది. సలాడ్‌కు క్రీమీనెస్ ఇస్తుంది.

నిమ్మరసం: విటమిన్ సి అందిస్తుంది. ఎల్లప్పుడూ తాజాదనాన్ని పెంచుతుంది.

చీజ్/వెన్న: కొవ్వు, కాల్షియం ఇస్తాయి. రుచిని పెంచుతాయి.

కీరదోస, క్యారెట్: తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు అందిస్తాయి. సలాడ్‌కు తాజాదనాన్నిస్తాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.