సమ్మర్లో రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 5 బెస్ట్ రోడ్ ట్రిప్స్ మిస్ అవకండి!-planning a road trip this summer dont miss these 5 best road trips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సమ్మర్లో రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 5 బెస్ట్ రోడ్ ట్రిప్స్ మిస్ అవకండి!

సమ్మర్లో రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 5 బెస్ట్ రోడ్ ట్రిప్స్ మిస్ అవకండి!

Ramya Sri Marka HT Telugu

సమ్మర్‌ను మరిచిపోలేని మెమొరీగా మార్చుకోవాలనుకుంటున్నారా? అందుకోసం రోడ్ ట్రిప్ చేయాలనుకుని గంటల కొద్దీ వెదకాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పీరియెన్స్‌డ్ పర్సన్స్ నుంచి సలహాలు తీసుకోవాల్సిన పని అంతకంటే లేదు. ఇదిగోండి మీ కోసం 5 బెస్ట్ రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేసి ఉంచాం.

సమ్మర్లో బెస్ట్ రోడ్ ట్రిప్స్

ప్రయాణాలతో పరిధిని పెంచుకోవాలనుకుంటే రోడ్ ట్రిప్ కరెక్ట్ ఆప్షన్. మరి అసలే సమ్మర్, ఈ టైంలో ఏ వైపుకు రోడ్ ట్రిప్ వెళ్లాలంటే ఏ రూట్ కరెక్ట్? ఏది ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎటువైపు వెళ్లాల అని ఆలోచిస్తుంటే, ఇది మీ కోసమే. చక్కగా తీర ప్రాంతాల మధ్య ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా తిరిగేయండి. మన ఇండియన్ రోడ్ల మీద రయ్ మని దూసుకుపోండి. ఇంకెందుకు లేటూ.. ట్యాంక్ ఫుల్ చేసుకుని, జర్నీ స్టార్ట్ చేసేయండి. మీ కోసం సెలక్ట్ చేసిన 5 బెస్ట్ రూట్లలో ప్రయాణానికి రెడీ అయిపోండి.

మనాలి నుంచి లేహ్ వరకూ

మనాలి నుంచి లేహ్ వరకూ బెస్ట్ అండ్ మోస్ట్ ఫ్యామస్ రోడ్ ట్రిప్ మీరు చూడొచ్చు. ఈ రోడ్ మొత్తం మంచుతో కప్పి ఉన్న పర్వతాలు సరస్సులు, మీకు కొత్త అనుభూతిని కలిగించడం ఖాయం. కొన్ని దశాబ్దాల పాటు జ్ఞాపకాలు నిలిచిపోతాయి.

ముంబై నుంచి గోవా వరకూ

టూరిస్టులకు ఫేవరేట్ రూట్ ముంబై టూ గోవా. కొంకణ్ తీర ప్రాంతం మీదుగా NH66 మీకు కొత్త అనుభూతులను పంచిస్తుంది. సముద్రాన్ని చూస్తూ చేసే ప్రయాణం అద్భుతమైన వీక్షణను కలగజేస్తుంది. ఇక్కడ మీకు రత్నగిరి, గణ్పతిపూలె పట్టణాలకు వెళ్లాలనుకుంటే కొంచెం డీవియేషన్ తీసుకుంటే సరిపోతుంది.

బెంగళూరు నుంచి కూర్గ్ వరకూ

ప్రశాంతమైన ప్రదేశంలో సూర్యాస్తమయాన్ని చూస్తూ చేయగల ప్రయాణమిది. డుబారె ఎలిఫెంట్ క్యాంప్, ఏనుగులను చూస్తూ సరదా సమయం గడిపేందుకు ఈ ట్రిప్ అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కూర్గ్ లోని కొన్ని యాక్టివిటీలు కూడా మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి. రిలాక్సేషన్, అడ్వెంచేరియస్ ట్రిప్ ఎగ్జైట్ చేస్తుంది.

ఢిల్లీ టూ స్పితీ లోయ

చూడచక్కని ప్రదేశం ఈ రూట్. సిమ్లా లోయలను, కిన్నౌర్ అందాలను, ఆపిల్ తోటలను ప్రత్యేక సౌందర్యాలను చూసి మిమ్మల్ని మీరు మైమరిచిపోతారు. అక్కడికి వెళితే మరో లోకానికి వెళ్లిన ఫీలింగ్ కలగడం ఖాయం. పురాతన ప్రదేశాలు, ఆధ్యాత్మిక భావనను కలిగించడంతో పాటు చక్కటి అనుభూతిని కలుగజేస్తాయి. తప్పక చూడాల్సిన చంద్రాతల్ లేక్ లో స్వచ్ఛమైన నీరు మీకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌గా మారుతుంది.

చెన్నై టూ పాండిచ్చేరి

ఈస్ట్ కోస్ట్ రోడ్ (చెన్నై నుంచి పాండిచ్చేరి) లో ప్రయాణించడం మీకు తీర ప్రాంత అనుభూతులను కొత్త ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఒకవైపు బీచ్ ఏరియా, మరోవైపు పచ్చని ప్రదేశం అద్భుత అనుభూతులను కలుగజేస్తాయి. ఇది చాలా చిన్న ప్రయాణమే అయినా అందమైన ప్రయాణంగా నిలుస్తుంది. అదే దారిలో మహాబలిపురంలో కూడా చక్కటి ప్రదేశాలు చూడొచ్చు.

రోడ్ ట్రిప్ (Road Trip) అనేది కేవలం ఒక ప్రయాణమే కాదు. అది అనుభవం, రిలాక్సేషన్, ఆవిష్కరణకు ఓ అవకాశమవుతుంది. రోడ్ ట్రిప్ వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఓ సారి చూద్దాం.

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది: సాధారణ జీవన విధానం నుంచి బయట పడటానికి మంచి అవకాశం. ప్రకృతి అందాలు చూస్తూ స్ట్రెస్ మరిచిపోతారు.

స్వేచ్ఛగా ప్రయాణం చేయడం: కొత్త ప్రదేశాలను అన్వేషించవచ్చు. అనుకోకుండా జరిగే పరిణామాలను ఆస్వాదించవచ్చు.

బంధాలు బలపడతాయి: కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. కలిసి ఆటలు ఆడుకునేందుకు, ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేయగలడంతో బంధాలు బలపడతాయి.

గుర్తుండిపోయే అనుభవాలు: అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. అనుకోని సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

ధైర్యాన్ని పెంచుతుంది: మార్గాలు తప్పడం, కొత్త రూట్లు ఎంచుకోవడం వంటివి మనలో ధైర్యాన్ని పెంచుతాయి. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది.

కొత్త సంస్కృతులు, ఆహారం, భాషలు వంటివి కూడా తెలుసుకోవచ్చు.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం