Lakshadweep Tour Cost: బీచుల కోసం మాల్దీవులకే కాదు, లక్షద్వీప్ వెళితే చాలు, ఈ టూర్‌కు ఎంత ఖర్చువుతుందో తెలుసా?
Lakshadweep Tour Cost: అందం పరంగా లక్షద్వీప్ మాల్దీవులకే పోలీ ఇచ్చేలా ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని పచ్చదనం, బీచులు, సముద్రం కోసం బాలి, మాల్దీవులకే వెళ్లాల్సిన అవసరం లేదు. లక్షద్వీప్ వెళితే చాలు. ఈ టూర్ వెళ్లేందుకు ఎంత ఖర్చువుతుందో తెలుసుకోండి.
లక్షద్వీప్ ఇప్పుడు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఎంతో మంది వెళ్లాలనుకునే గమ్యస్థానంగా లక్షద్వీప్ మారింది. లక్షద్వీప్ అందం విషయంలో మాల్దీవులు, బాలి వంటి ప్రాంతాలతో పోటీ పడేలా ఉంటుంది. మాల్దీవులు, బాలి వంటి ప్రాంతాలు వెళ్లేందుకు ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది. అదే లక్షద్వీప్ కు వెళితే తక్కువ ఖర్చులోనే టూర్ పూర్తవుతుంది. ఇక్కడ ఉంటే అందమైన బీచులు మీ స్నేహితులు లేదా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు అనుగుణమైనవి. హనీమూన్ కోసం కూడా ఈ ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. మీరు లక్షద్వీప్ అందాలను చూడాలనుకుంటే, ట్రిప్ ప్లాన్ చేయండి. నాలుగు రోజుల పాటూ లక్షద్వీప్ లో గడిపేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి.
లక్షద్వీప్ పర్యటన కోసం ముందుగా కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. కొచ్చి నుంచి లక్షద్వీప్ లోని అగట్టికి విమానం ఉంది. విమానంలో గంటా ముప్పై నిమిషాల పాటూ ప్రయాణించాల్సి ఉంటుంది. లక్షద్వీప్ వెళ్లాలంటే కచ్చితంగా ముందు కొచ్చికి చేరాల్సిందే.
ఎంత ఖర్చు?
ముందు కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. విమానంలో చేరుకుంటే టిక్కెట్ పదివేల రూపాయల వరకు ఉంటుంది. కొచ్చి నుంచి లక్షద్వీప్ లోని అగట్టికి ఒకరికి విమాన టిక్కెట్ ఆరువేల రూపాయలు ఉంటుంది.
బస్సు ద్వారా
విమాన ఖర్చులు భరించలేం అనుకున్నవారు బస్సులో కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి బస్సులో చేరవచ్చు. అక్కడ్నించి టాక్సీ ద్వారా విల్లింగ్డన్ ద్వీపం దగ్గర ఉన్న జెట్టీకి చేరుకోవాలి. ఆ జెట్టీ నుంచి ఓడలో లక్షద్వీప్ లోని కవరెట్టికి చేరవచ్చు. లక్షద్వీప్ లో ఉన్న ఎంతో ద్వీపాలు ఉంటాయి.
లక్షద్వీప్ లో ఎక్కవ నివసించాలనుకుంటారో ముందుగానే బుక్ చేసుకుని వెళితే ఉత్తమం. లక్షద్వీప్ టూరిజం అధికారిక వెబ్ సైట్ ద్వారా హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. గోల్డ్ ఐలాండ్, కద్మత్, కవరత్తి, తిన్నక్కర దీవులన్నింటిలోని హోటల్స్ ను ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు.
గోల్డ్ ఐలాండ్ రిసార్జ్
ఏసీ గది ఇక్కడ ఒక్కరాత్రికి పదివేల రూపాయల నుంచి మొదలవుతుంది.
కద్మత్ ఐలాండ్ రిసార్ట్
నాన్-ఏసీ గది కోసం, మీరు ఒక రాత్రికి రూ. 5,000 వరకు ఖర్చు చేయాలి. మీరు సూపర్ డీలక్స్ AC గదిని ఎంచుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 11,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 8,000 వరకు ఖర్చుచేయాలి.
కవరత్తి ఐలాండ్ రిసార్ట్
ఇక్కడ అందుబాటులో ఉన్న ఏకైక ఎంపిక ఎయిర్ కండిషన్డ్ సూట్. సింగిల్, డబుల్ ఆక్యుపెన్సీపై ఒక రాత్రికి దీని ధర రూ. 11,000.
తిన్నక్కర ఐలాండ్ రిసార్ట్
మీరు ఇక్కడ నాన్-ఏసీ టెంట్‌లో బస చేయవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 10,000, ఒక రాత్రికి ఒక్క ఆక్యుపెన్సీకి రూ. 8,000 ఖర్చు అవుతుంది.
మొత్తంమ్మీద లక్షద్వీప్ కు ఒక జంట వెళ్లాలంటే వారు కనీసం లక్షరూపాయలు ఖర్చుపెట్టాలి. అక్కడ ఆహారం ధరలు కూడా ఖరీదుగానే ఉంటాయి. నలుగురున్న కుటుంబం వెళ్లాలంటే చేతిలో కనీసం రెండున్నర లక్షలు ఉంటేనే ఎంజాయ్ చేయగలరు.