Phool Makhana: పూల్ మఖానా చాట్... పిల్లలకు, పెద్దలకు బెస్ట్ స్నాక్స్ రెసిపీ-phool makhana chaat recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Phool Makhana: పూల్ మఖానా చాట్... పిల్లలకు, పెద్దలకు బెస్ట్ స్నాక్స్ రెసిపీ

Phool Makhana: పూల్ మఖానా చాట్... పిల్లలకు, పెద్దలకు బెస్ట్ స్నాక్స్ రెసిపీ

Haritha Chappa HT Telugu
Apr 14, 2024 06:30 PM IST

Phool Makhana: పూల్ మఖానా ఆరోగ్యానికీ ఎంతో మంచిది. కాస్త స్పైసీగా చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము పూల్ మఖాన చాట్ రెసిపీ ఇచ్చాము.

పూల్ మఖానా చాట్ రెసిపీ
పూల్ మఖానా చాట్ రెసిపీ

Phool Makhana: స్నాక్స్ లో ఆరోగ్యంగా ఉండేవే తినడం అవసరం. బాగా నూనెలో వేయించిన స్నాక్స్‌ను ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇక్కడ మేము పూల్ మఖాన చాట్ ఎలా తయారు చేయాలో చెప్పాము. ఇది సాత్వికమైన డైట్ లోకి వస్తుంది. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు దీన్ని తింటే బలం అందుతుంది. దీనిలో ఫైబర్. ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది హెల్తీ స్నాక్ అని చెప్పుకోవచ్చు. పిల్లలకు కూడా ఇది నచ్చడం ఖాయం. కాస్త స్పైసీగా చేస్తే పెద్ద వాళ్లకు ఇది నచ్చుతుంది. ఈ పూల్ మఖానా చాట్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

పూల్ మఖానా చాట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పూల్ మఖానా - రెండు కప్పులు

టమోటాలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

ఉడికించిన బంగాళదుంపలు - రెండు

జీలకర్ర పొడి - ఒక స్పూను

నిమ్మరసం - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూను

సేవ్ - రెండు స్పూన్లు

నెయ్యి - రెండు స్పూన్లు

వేయించిన వేరుశనగలు - ఒక గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

పూల్ మఖానా చాట్ రెసిపీ

1. పూల్ మఖానా రెసిపీలను త్వరగా వండేయచ్చు.

2. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట పెట్టాలి.

3. అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక పూల్ మఖానాను వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టాలి.

4. ఇప్పుడు టమోటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంపలను సన్నగా తరగాలి.

5. ఒక గిన్నెలో ఈ పదార్థాలను వేయాలి.

6. తర్వాత అదే గిన్నెలో నిమ్మరసం, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.

7. ముందుగా వేయించుకున్న ఫూల్ మఖానాను వేసి స్పూన్ తో కలుపుకోవాలి.

8. సేవ్‌ను పైన చల్లుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగును కూడా చల్లుకోవాలి. అంతే పూల్ మఖాన చాట్ రెడీ అయినట్టే. వేయించుకున్న గుప్పెడు వేరుశనగలను కూడా చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఉపవాసం చేసినప్పుడు లేదా సాయంత్రం పూట స్నాక్ గా తింటే చాలా హెల్ది.

ఫూల్ మఖానాతో చేసే రెసిపీలన్ని ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఇక్కడ మేము హెల్తీ రెసిపీ చెప్పాము. ఆరోగ్యానికి మేలు చేసే రెసిపీ. దీనిలో మనం నెయ్యి, ఫూల్ మఖానా, కొత్తిమీర, నిమ్మరసం, వేరుశెనగలు, టమాటా వంటివి వాడాము. నూనె వాడలేదు. ఉప్పును కూడా పరిమితంగానే వేసుకుంటాము. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన రెసిపీ అనే చెప్పాలి. ముఖ్యంగా దీనిలో ఎక్కువగా వంట చేసే ప్రాసెస్ లేదు. అన్నింటినీ మిక్స్ చేసుకునే ప్రాసెస్ మాత్రమే ఉంది. కాబట్టి ఇది సాత్వికమైన ఆహారాల్లోకి వస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి రెసిపీ. అలాగే అప్పుడప్పుడు ఉపవాసం చేసేవారు దీన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శక్తి వెంటనే అందుతుంది.

WhatsApp channel

టాపిక్