Pesarapappu Chikkudu Kura: పప్పు అనగానే అందరూ కందిపప్పును ఉడకబెట్టి తాళింపు వేసుకొని తినేస్తారు. అప్పుడప్పుడు పప్పుని కొత్తగా వండుకోవచ్చు. చిక్కుడుకాయలు, పెసరపప్పు కలిపి ఇక్కడ ఇచ్చిన రెసిపీని ప్రయత్నించండి. ఇది మీకు నచ్చడం ఖాయం. అంతే కాదు ఎన్నో రకాల పోషకాలను ఈ కూరలో నిండి ఉంటాయి. రుచిలో కూడా ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వండడం చాలా సులువు. పిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన పప్పుల్లో ఇది ఒకటి. దీన్ని కూరగా అనుకోవచ్చు లేదా పప్పుగా భావించవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు.
పెసరపప్పు - అరకప్పు
చిక్కుడు కాయలు - పావు కిలో
పసుపు - పావు స్పూను
ఎండుమిర్చి - మూడు
జీలకర్ర - ఒక స్పూన్
ఆవాలు - అర స్పూను
నూనె - తగినంత
మినప్పప్పు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పచ్చికొబ్బరి తురుము - అరకప్పు
1. పెసరపప్పును రెండు గంటల పాటు నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి.
2. చిక్కుడుకాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. వీటిని కుక్కర్లో వేసి తగినంత నీళ్లు పోసి ఉప్పు వేసి రెండు విజిల్స్ వరకు ఉడికించాలి.
4. ఇప్పుడు మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి, కరివేపాకులు, జీలకర్ర వేసి మెత్తగా పొడి చేయాలి.
5. తర్వాత నీళ్లు పోసి పేస్టులా చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చిక్కుడు ముక్కలను బాగా కలుపుకోవాలి.
7. అందులోనే నానబెట్టిన పెసరపప్పును వేయాలి. వేసి అరగంట పాటు ఉడికించుకోవాలి.
8. అలాగే ముందుగా మిక్సీజార్లో చేసుకున్న పేస్టును వేసి బాగా కలపాలి.
9. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
10. పెసరపప్పు మెత్తగా ఉడికాక తాళింపు వేసుకోవాలి.
11. ఇందుకోసం చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టాలి.
12. కాస్త నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
13. చివరలో కరివేపాకులు వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పప్పులో వేసుకోవాలి.
14. అంతే టేస్టీ పెసరపప్పు చిక్కుడుకాయ కూర రెడీ అయినట్టే.
15. ఇది కేవలం అన్నంలోకే కాదు, చపాతీ రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది.
16. ఇది సాంబార్ లాగా, నీళ్లలాగా కాకుండా గట్టిగా, ముద్దగా వండుకుంటే రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేసుకున్నారంటే అందరికీ నచ్చడం ఖాయం.
పెసరపప్పును ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరానికి ఎంతో పోషణ లభిస్తుంది. పెసరపప్పును మన శరీరానికి అవసరమైన ఫోలేట్, విటమిన్ బి6, ఐరన్, పొటాషియం, ప్రోటీన్ నిండుగా ఉంటాయి. కాబట్టి పెసరపప్పును తినడం చాలా అవసరం. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు పెసరపప్పును ఆహారంలో ప్రతిరోజూ భాగం చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. పెసరపప్పులాగే చిక్కుడుకాయల్లో కూడా మనకి పోషకాలు అందించే శక్తి ఎక్కువ. చిక్కుడుకాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి రాకుండా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గడంలో ఇవి ముందు తగ్గించడంలో ఇవి ముందుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు చిక్కుడుకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది.
టాపిక్