Forehead Reveals Personality : మీ నుదుటి ఆకారాన్ని చూసి మీరేంటో చెప్పేయెుచ్చు.. ట్రై చేయండి-personality test shape of the forehead reveals your secrets check it out once ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Forehead Reveals Personality : మీ నుదుటి ఆకారాన్ని చూసి మీరేంటో చెప్పేయెుచ్చు.. ట్రై చేయండి

Forehead Reveals Personality : మీ నుదుటి ఆకారాన్ని చూసి మీరేంటో చెప్పేయెుచ్చు.. ట్రై చేయండి

Anand Sai HT Telugu
May 25, 2024 10:40 AM IST

Face Reading In Telugu : మన ముఖాన్ని చూసి మనమేంటో చెప్పేయెుచ్చు. ముఖ్యంగా నుదుటిని చూసి కొందరు ఎలాంటివారో అంచనా వేస్తారు.

నుదిటి ఆకారంతో మీ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు
నుదిటి ఆకారంతో మీ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు

వెడల్పాటి నుదురు లేదా పొడవాటి నుదురు మీదా? మీ నుదిటి ఆకారాన్ని బట్టి కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నుదిటి ఆకారం రహస్య వ్యక్తిత్వాన్ని చెబుతుంది. మీరు ఇన్ సైడ్ ఎలాంటివారో చెప్పేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలోని వారికి ఎలాంటి నుదుటి ఆకారం ఉందో చూడండి. వారి వ్యక్తిత్వం ఎలాంటితో వారితోనే మాట్లాడండి.

నిజానికి ముఖం గురించి అనేక విషయాలు ఎప్పుడూ చర్చలో ఉంటాయి. ఇప్పుడేకాదు.. ఎప్పటి నుంచో ఫేస్ రీడింగ్ ఉంది. భారతీయ వేద జ్యోతిషశాస్త్రంలో ఫేస్ రీడింగ్ కళ ఇప్పటికీ అమలులో ఉంది. వాళ్ల మొహం చూసి అన్నీ చెప్పగలను అనేవారూ ఉన్నారు. మీరు ప్రకాశవంతమైన నుదురు కలిగి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇది కీర్తి, శక్తి, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మీ నుదిటి ఆకారం మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కచ్చితంగా ఆలోచించి ఉండరు కదా. నుదుటి ఆకారం ఆధారంగా మీరు ఎలాంటివారో చెప్పేందుకు ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి.

విశాలమైన నుదుటి ఆకారం

ఫోటోలో నంబర్ 1 నుదిటి చాలా వెడల్పుగా ఉంది. ఈ రకమైన నుదురు ఉన్నవారు అందరికంటే ఒక అడుగు ముందుండాలని కోరుకుంటారు. ప్రశాంతత కావాలని అనుకుంటారు. ఈ రకమైన నుదురు ఉన్నవారు ముందు నడవడానికి ఇష్టపడతారు. తెలివితేటలు, సహజమైన స్వభావం ప్రజలు వారిని విశ్వసించేలా చేస్తాయి. వారు తెలివితేటలు, భావోద్వేగ అంశాల సమతుల్యతను కలిగి ఉంటారు.

చిన్న నుదురు

ఈ రకమైన నుదురు ఉన్న వ్యక్తులు వివిధ లక్షణాలను కలిగి ఉంటారు. మనుషుల మధ్య కంటే ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతికూల భావోద్వేగాలను సానుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. మరింత కరుణ కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం ఇష్టం వారికి. బాలీవుడ్ నటి అలియా భట్‌ది ఇలాంటి చిన్న నుదురే. కావాలంటే పరిశీలించండి.

వంపు తిరిగిన నుదుటి ఆకారం

వంపు తిరిగిన నుదిటి ఆకారం ఉన్న వ్యక్తులు వ్యక్తిత్వం విషయానికి వస్తే స్నేహపూర్వకంగా ఉంటారు. మాట్లాడటం సులభం. అత్యంత తెలివైన వారిగా ఉంటారు. ప్రేరణాత్మక పదాలు మాట్లాడే కళ వారి దగ్గర ఉంటుంది. అయస్కాంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది, ఇతరులను ఇట్టే ఆకర్శిస్తారు.

ఎం ఆకారపు నుదురు

M- ఆకారపు నుదిటి వ్యక్తిత్వం చాలా కళాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంటుంది. అత్యుత్తమైన వ్యక్తులుగా అభివర్ణించవచ్చు. ఎప్పుడూ సమూహాలను అనుసరించరు. స్వీయ-వ్యక్తీకరణకు అనుమతించే విషయాలను ఆస్వాదిస్తారు. వారు అందరిలో భిన్నంగా ఉండాలని అనుకుంటారు.

ఇవన్నీ ఫేస్ రీడింగ్‌లో భాగమే. చాలా మంది ఈ కాలంలోని ముఖం చూసి అనేక విషయాలు చెబుతారు. వారి వ్యక్తిత్వం ఏంటో అంచనా వేస్తారు. అందులో నుదిటి ఆకారం కూడా ఒక భాగమే. దాని ఆకారం ప్రకారం మీ గురించి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు.

గమనిక : పైన చెప్పిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చాం. HT Telugu ఈ కంటెంట్‌కు ఎలాంటి బాధ్యత వహించదు.

WhatsApp channel

టాపిక్