Personality Test: మీ కనుబొమ్మలు ఒత్తుగా ఉన్నాయా? లేక పల్చగా ఉన్నాయా? వాటిని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పవచ్చు
Personality Test: వ్యక్తిత్వ పరీక్షలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి కనుబొమ్మల ఆకృతి. కనుబొమ్మలు దట్టంగా ఉంటే ఒక వ్యక్తిత్వం పలుచగా ఉంటే మరొక వ్యక్తిత్వం ఉండే అవకాశం ఉంది.
Personality Test: కనుబొమ్మలు అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి సన్నని గీత గీసినట్టు పలుచగా ఉంటాయి. మరికొందరికి అడవిలాగా దట్టంగా ఉంటాయి. కనుబొమ్మల తీరును బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు. వారి ప్రవర్తన, ఆలోచనలు, భావోద్వేగాలు వంటి వాటి గురించి కనుబొమ్మల తీరును బట్టి వివరిస్తున్నారు. దట్టంగా ఉంటే ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయో పలుచగా ఉంటే ఇలాంటి ప్రవర్తనను కలిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
దట్టంగా కనుబొమ్మలు ఉంటే...
మీకు దట్టంగా, మందపాటి కనుబొమ్మలు ఉన్నాయా? అయితే మీరు మీ జీవితాన్ని ఒక నిబంధనల ప్రకారం గడుపుతారు. మీరు, మీ భావాలకు, నిర్ణయాలకు విలువ ఇస్తారు. వాటిని బట్టే జీవించడానికి ఒప్పుకుంటారు. వాస్తవానికి దగ్గరగా జీవిస్తారు. నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. మీ విలువ మీకు తెలుసు. దాన్ని ఇతరులకు చూపించేందుకు ఏమాత్రం వెనకబడరు. మీరు ఆకర్షణీయంగా ఉంటారు. మిమ్మల్ని మీరు నమ్ముతారు. పారదర్శకంగా ఉండేందుకు, ఓపెన్ కమ్యూనికేషన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల మాటలను మీరు చులకనగా చూడరు. తేనె పూసి మాట్లాడే స్వభావం మీది కాదు. మిమ్మల్ని ఎవరైనా నమ్మవచ్చు. మీరు మంచి స్నేహితుడిగా ఉంటారు. మీకు బాధ కలిగించినా కూడా ఎప్పుడైనా మీ స్నేహితుడికి నిజం చెప్పేందుకే సిద్ధంగా ఉంటారు. మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. కాస్త దూకుడుగా ఉంటారు. నిర్ణయాత్మకంగా జీవిస్తారు మీ హృదయానికి స్వేచ్ఛ ఎక్కువ.
సన్నని కనుబొమ్మలు కలిగి ఉన్నవారైతే...
మీ కనుబొమ్మలు లాగే మీరు కూడా సున్నితంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువసేపు నిశ్శబ్దంగా ఉండేందుకు ఇష్టపడతారు. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఆ నలుగురిలో మీరు మాత్రం నిశ్శబ్దంగా పరిశీలిస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలనగా చూస్తారు. మీరు ఇంట్రావర్టు అని చెప్పుకోవచ్చు. మీలో కాస్త నిర్లక్ష్యం ఉంది. మీకు స్వీయ అవగాహన తక్కువగా ఉంటుంది. కలలు కంటూ ఉంటారు. మీరు మంచి ఆలోచన పరులు. ఏదైనా లోతుగా ఆలోచిస్తారు. మృదుస్వభావి. అలాగే సిగ్గు కూడా ఎక్కువే. మీకు ఇతరులు మిమ్మల్ని పొగిడితే చాలా ఇష్టం. ఎవరైనా పొగడకపోతే ఇట్టే ఫీల్ అయిపోతారు. మీకు ధైర్యం లేకపోయినా ధైర్యంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే అప్పుడప్పుడు మీరు కాస్త ఆర్టిఫిషియల్ అనిపించవచ్చు. మీ మనసు చాలా బిజీగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మీ ఆలోచనలే కాదు కోరికలు చాలా పెద్దవిగా ఉంటాయి. అలా అని మీరు అసమర్థులు మాత్రం కాదు, మీరు ఎవరిని నమ్ముతారో వారి నుంచే సలహాలను తీసుకుంటారు. మీరు మంచి కళాత్మక హృదయాన్ని కలిగి ఉంటారు. ఇతరులను సులభంగా నమ్మేస్తారు. మీకు ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటిని మీరు అధిగమిస్తే జీవితంలో అంతా మంచి జరుగుతుంది.
టాపిక్