Personality test: మనుషులు బేసిగ్గా నాల్గు రకాలు.. లక్షణాలు చెబితే మీ కేటగిరీ చెప్పేస్తాం
Personality test: మనుషుల్ని వ్యక్తిత్వం ప్రకారం నాలుగు రకాలుగా విభజించొచ్చు. మీరే రకమో తెల్సుకోవాలంటే ఇది చదివేయండి.
మనుషుల వ్యక్తిత్వం బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. అబ్బో నాలుగు రకాలేం సరిపోతాయి నలబై రకాల మనుషులుంటారు అనుకోకండి. వంద రకాలుగా విభజించలేం కాబట్టి కొన్ని విషయాల ఆధారంగా నాలుగు రకాలుంటారని విభజించేశారు. సో.. బేసిగ్గా టైప్ ఎ, టైప్ బి, టైప్ సి, టైప్ డి రకాలుంటారన్నమాట. ఇక్కడ నాలుగు రకాల పర్సనాలిటీలకుండే లక్షణాలని 4 సెట్లుగా ఇస్తున్నాం. వాటిలో మీకే లక్షణాలున్నాయో చూడండి. చివర్లో మీరే కేటగిరీ పర్సనాలిటీయో చెప్పేస్తాం.
సెట్ 1 లక్షణాలు:
1. ఏదైనా తేలిగ్గా తీసుకుంటారు.
2. ప్రతిదీ వాయిదా వేస్తారు. ఆ.. మళ్లీ చేసుకోవచ్చులే అన్నట్లుంటారు.
3. సరదాలు, జోకులంటే ఇష్టపడతారు.
4. ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చుని ఉంటారు.
5. దేనికీ అనవసరంగా ఆందోళన పడరు. మానసికంగా చాలా సమతుల్యతతో ఉంటారు.
6. ప్రతిదీ సానుకూలంగా ఆలోచిస్తారు.
7. ఎవరితోనూ పోటీ పెట్టుకోరు. మీ జీవితం మీరు సరిగ్గా జీవించాలనుకుంటారు.
సెట్ 2 లక్షణాలు:
1. ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు.
2. పని చేస్తూనే ఉంటారు.
3. నిరాశ ఎక్కువ
4. జోకుల్లాంటివి ఉండవు. ఎప్పుడూ సీరియస్ గా ఉండటమే.
5. టెన్షన్లు ఎక్కువ. ఏ పని మొదలెట్టినా అయ్యేదాకా నిద్రపట్టదు.
6. ప్లాన్ పకారం పనులవ్వాల్సిందేననే పట్టుదల ఉంటుంది. తు.చ తప్పకుండా చేసేస్తారు.
7. నిరాశావాది. ప్రతి విషయాన్ని ముందు లోపాలు వెతికి, నెగటివ్ గా ఆలోచిస్తారు.
8. ప్రతి విషయంలో చిన్న లోపం కూడా ఉండకూడదు అనుకుంటారు.
సెట్ 3 లక్షణాలు:
1. ఎప్పుడూ ఒత్తిడిగా ఫీలవుతారు.
2. పనిమీద ధ్యాస ఎక్కువ.
3. తొందరగా కోపం వస్తుంది.
4. ఏ పని చేసినా చాలా ఉత్సాహంగా ఉంటారు.
5. లక్ష్యం దిశగా ప్రయత్నిస్తారు.
6. కాస్త నెగటివ్ గానే వీళ్ల ఆలోచన ఉంటుంది.
7. పోటీ పడే తత్వం ఎక్కువ.
సెట్ 4 లక్షణాలు:
1. కాస్త ఆందోళన, టెన్షన్లు ఎక్కువే
2. బాగా కష్టపడి పనిచేస్తారు.
3. ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.
4. అన్ని విషయాల్లో ముందు జాగ్రత్త పడతారు.
5. ప్రతి దానికి లాజిక్ వెతుకుతారు. లాజిక్ లేకపోతే పని మొదలెట్టరు వీళ్లు. ఓ పట్టాన దేన్నీ ఒప్పుకోరు.
6. దీర్ఘంగా ఆలోచిస్తారు.
7. పర్ఫెక్షనిస్టులు
పైన నాలుగు సెట్లలో ఉన్న లక్షణాలు చదివాక మీరు ఏదో ఒక దానికి ఫిక్సయ్యే ఉంటారు. అందులో కొన్ని, ఇందులో కొన్ని మ్యాచ్ అవుతున్నాయంటే ఏం చేయలేం కానీ.. ఎందులో ఎక్కువ మ్యాచ్ అవుతున్నాయో చూడండి.
మీ పర్సనాలిటీ ఏంటి?
సెట్ 1 లక్షణాలు ఎక్కువుంటే మీరు టైప్ బి పర్సనాలిటీ, సెట్ 2 లక్షణాలుంటే టైప్ డి పర్సనాలిటీ, సెట్ 3 లక్షణాలుంటే టైప్ ఎ పర్సనాలిటీ, సెట్ 4 లక్షణాలుంటే సి పర్సనాలిటీ అన్నమాట.
వీళ్లలో బిందాస్ గా ఉండేది టైప్ బి మనుషులు అయితే ఎక్కువగా హడావుడి, టెన్షన్ పడేది టైప్ డి మనుషులు. టైప్ ఎ మనుషులు అనుకున్న పనులు పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటారు. దానికోసం కాస్త హడావుడి పడతారనే చెప్పాలి. ఇక టైప్ సి మనుషులు అటు ఎక్కువా కాదు, దేనికీ తక్కువ కాదన్నట్లుంటారు.
టాపిక్