Perfume day 2025: ఇతరులను కాదు ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెబుతున్న పెర్య్ఫూమ్ డే-perfume day says love yourself first and not others ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Perfume Day 2025: ఇతరులను కాదు ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెబుతున్న పెర్య్ఫూమ్ డే

Perfume day 2025: ఇతరులను కాదు ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెబుతున్న పెర్య్ఫూమ్ డే

Haritha Chappa HT Telugu
Published Feb 17, 2025 05:30 AM IST

Perfume day 2025: యాంటీ వాలెంటైన్స్ వీక్ లో మూడో రోజు పెర్య్ఫూమ్ డే. దీని ఉద్దేశం ఇతరులను కాదు మిమ్మల్ని మీరు ముందుగా ప్రేమించుకోండి అని చెప్పడమే. స్వీయ ఆనందంలో భాగంగా మీకు నచ్చిన సువాసన వేసే సెంట్ ను మీ శరీరానికి అప్లై చేసుకోండి.

పెర్ఫ్యూమ్ డే ఎందుకు నిర్వహించుకుంటారు?
పెర్ఫ్యూమ్ డే ఎందుకు నిర్వహించుకుంటారు? (Pexels)

యాంటీ వాలెంటైన్స్ వీక్ లో మూడో రోజు వచ్చేసింది. ఈరోజు పెర్ఫ్యూమ్ డే. ఈ పత్యేక దినోత్సవం వెనుక ఒక ఉద్దేశం ఉంది. ప్రేమలో మోసపోయిన వారు, ప్రేమికులు లేకుండా సింగిల్ గా జీవిస్తున్న వారి కోసమే ఈ దినోత్సవం ఎన్నో అంశాలను చెబుతోంది. పెర్య్ఫూమ్ వాసన శరీరానికి తాకగానే మనలో కొన్ని ఫీలింగ్స్ కలుగుతాయి. ఇది ఆనందకరమైన జ్ఞాపకాలను ప్రేరేపించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది.

మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవడానికి అప్పుడప్పుడు మీకోసం కొన్ని పనులు చేయాలి. మీకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందించే పెర్ఫ్యూమ్ ను ఎంపిక చేసుకోండి. ఏ అత్తరు వాసన మీలో ఉల్లాసాన్ని నింపుతుందో దాన్ని ఎంపిక చేసుకుని అప్పుడప్పుడు దుస్తులపై చల్లుకోండి. మీకోసం మీరు ఇలా చేసే చిన్న చిన్న పనులు మీలో ఎంతో ఆనందాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతాయి.

ఒక వ్యక్తి జ్ఞాపకశక్తికి సువాసనలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. కొన్ని రకాల వాసనలు మీ ప్రేమను గుర్తుకు తెస్తాయి. మీ ప్రేమికులతో గడిపిన క్షణాలను గుర్తు చేస్తాయి. ఇది మీరు గడిపిన సమయంతో మళ్లీ కనెక్ట్ చేస్తుంది.

ఈ సంవత్సరం మనం పెర్ఫ్యూమ్ డేను జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో, ఈ ప్రత్యేకమైన రోజు గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

పెర్ఫ్యూమ్ డేను యాంటీ వాలెంటైన్స్ వీక్ లో మూడవ రోజున నిర్వహించుకుంటారు. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటారు. ఇది ఫిబ్రవరి 15 న స్లాప్ డేతో ప్రారంభమవుతుంది. యాంటీ వాలెంటైన్స్ వీక్ విషపూరిత సంబంధాలను వదిలించుకోవడానికి , స్వీయ ప్రేమ పెంచుకోమని చెప్పడానికి ఉద్దేశించినది. ఫిబ్రవరి 17వ తేదీన పెర్ఫ్యూమ్ డే నిర్వహించుకుంటారు.

పెర్ఫ్యూమ్ డే చరిత్ర

యాంటీ వాలెంటైన్స్ డే మొదలైనప్పటి నుంచి పెర్ఫ్యూమ్ డే నిర్వహించుకోవడం ప్రారంభించారు. పరిమళ ద్రవ్యాలు ఒక వ్యక్తి గుర్తింపులో ఒక భాగం. కొన్ని రకాల అత్తరులను మూలికలు, సహజ సువాసనలు, కృత్రిమ పరిమళాలను మిక్స్ చేసి సుగంధ సెంటును తయారు చేస్తారు. మీరు అప్లై చేసుకునే అత్తరు మీకు ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. పరిమళ ద్రవ్యాలు వేర్వేరు చర్మంపై వేర్వేరు వాసన కలిగి ఉంటాయి.

పెర్య్ఫూమ్ డే ప్రాముఖ్యత
పెర్య్ఫూమ్ డే ప్రాముఖ్యత (Pexels)

పెర్ఫ్యూమ్ డేను మీకోసం మీరు నిర్వహించుకోండి. మీకు ఎలాంటి ప్రేమికులు లేకపోతే మీ కోసం మీరు జీవించాలి. సింగిల్స్ కోసమే ఈ ప్రత్యేక దినోత్సవం. సంతోషంగా జీవించడానికి మీకు మీరే  ఒప్పందం చేసుకోవాలి. మీ భావోద్వేగాలను ఆనందంగా మార్చే అత్తరును ఎంపిక చేసుకుని అప్లై చేసుకోండి. ఇది మీలో ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేస్తుంది. మీ కోసం మీరు ఖరీదైన పెర్ఫ్యూమ్ను కొనుగోలు చేయండి. దాని సువాసనలు మిమ్మల్ని సున్నితంగా తాకాలి. 

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner