Yellow Milk: ఈ సమస్యలు ఉన్న వ్యక్తులు పాలల్లో పసుపు వేసుకుని తాగకూడదు-people with these problems should not drink turmeric in milk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yellow Milk: ఈ సమస్యలు ఉన్న వ్యక్తులు పాలల్లో పసుపు వేసుకుని తాగకూడదు

Yellow Milk: ఈ సమస్యలు ఉన్న వ్యక్తులు పాలల్లో పసుపు వేసుకుని తాగకూడదు

Haritha Chappa HT Telugu
Nov 07, 2024 07:00 PM IST

Yellow Milk: పసుపు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అందరూ వీటిని తాగడం మంచిది కాదు. కొన్ని సమస్యలు ఉన్న వారు పసుపు పాలు తాగడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి.

పసుపు పాలు
పసుపు పాలు

ఆయుర్వేదం చెప్పిన ప్రకారం పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి వరంలా చెప్పుకుంటారు. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడం ద్వారా అనేక వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. పాలల్లో పసుపు కలుపుకుని తాగడం వల్ల అందరికీ ప్రయోజనాలు కలగవు. కొందరికి ఇతర సమస్యలు కూడా వస్తాయి.

పసుపు పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ, కొంతమంది మాత్రం ఈ పాలు తాగడం నిషిద్ధం. పసుపు పాలు తాగడం వల్ల కొంతమంది ఆరోగ్యానికి ప్రయోజనం కంటే హానే ఎక్కువ జరుగుతుంది. ఏ వ్యక్తులు పసుపు పాలు తాగకూడదో తెలుసుకోండి.

రక్తపోటు తక్కువగా ఉంటే

అధిక రక్తపోటు మాత్రమే కాదు, రక్తపోటు తక్కువగా ఉండడం కూడా సమస్యే. ఇలా తక్కువ రక్తపోటు ఉన్నవారు పసుపు పాలను తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే పసుపు పాలు రక్తపోటును మరింత తగ్గిస్తాయి. ఇది లో బీపీ పేషెంట్ల సమస్యలను పెంచుతుంది. కాబట్టి ఎవరికైన బీపీ తక్కువగా ఉంటుందో వారు పాలల్లో పసుపు కలుపుకుని తాగే అలవాటును మానుకోవాలి.

అలెర్జీలుంటే…

పసుపు పాలు తాగిన తర్వాత కొంతమందికి అలెర్జీ ప్రతిచర్య ఉండవచ్చు. పసుపు పాలు తాగిన తర్వాత మీకు దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే మీకుఆ పాలు పడడం లేదని అర్థం. అవి మీకు అలెర్జీని కలిగిస్తాయి. మీకు అలెర్జీ సమస్య ఉంటే పసుపు పాలు తాగే ముందకు వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. లేదా వాటిని తాగడం పూర్తిగా తాగడం మానేయాలి.

పిత్తాశయ సమస్యలు ఉంటే పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే పసుపు పిత్త ఉత్పత్తిని సక్రియం చేయడం ద్వారా పిత్తాశయ సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, మీకు పిత్తానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, పసుపు పాలు అస్సలు తాగవద్దు.

ఐరన్ లోపం

చాలా మందిలో అనీమియా సమస్య ఉంటుంది. అంటే రక్తహీనత సమస్య. ఇనుము లోపించడం వల్ల మీకు రక్తహీనత సమస్య వస్తే… మీరు పసుపు పాలను తాగడం మానేయాలి. ఎందుకంటే రోజూ పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు పసుపు పాలలో ఉండే ఇనుము శోషణకు ఆటంకం కలిగించడం ద్వారా శరీరంలో రక్త నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఇప్పటికే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు, పసుపు పాలు తాగడం మానుకోవాలి.

మధుమేహం ఉన్న వారు

రక్తంలో చక్కె అధికంగా ఉంటే మధుమేహం సమస్య వస్తుంది. కొందరికి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. అలాంటి వారు కూడా ఈ పాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు పసుపు పాలను తాగకూడదు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే రసాయనం డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఇప్పటికే తక్కువ చక్కెర ఉన్నవారు, వారు పసుపు పాలకు దూరంగా ఉండాలి.

Whats_app_banner