ఈ అలవాట్లు ఉన్నవారు మనిషి రూపంలో ఉన్న పాములతో సమానం, అలాంటి వారికి దూరంగా ఉండాలి-people with these habits are like snakes in human form one should stay away from such people ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ అలవాట్లు ఉన్నవారు మనిషి రూపంలో ఉన్న పాములతో సమానం, అలాంటి వారికి దూరంగా ఉండాలి

ఈ అలవాట్లు ఉన్నవారు మనిషి రూపంలో ఉన్న పాములతో సమానం, అలాంటి వారికి దూరంగా ఉండాలి

Haritha Chappa HT Telugu

ఒక మంచి స్నేహితుడు జీవితానికి సహాయపడతాడు. ఒక మంచి బంధువు కష్టాల్లో ఆదుకుంటాడు. కానీ కొంతమంది మనిషి రూపంలో ఉండే పాముల్లా ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి? (Pexels)

జీవితంలో మంచి స్నేహితుడు దొరికితే ఎన్నో ఒడిదొడుకలను తేలికగా దాటవచ్చు. మీ సంతోషాన్ని రెట్టింపు చేసేది స్నేహితులే. మీ విచారాన్ని పోగొట్టేది, మీకు భుజం తట్టేది కూడా నిజమైన స్నేహితులే. అలాగే బంధువులు కూడా కష్టసుఖాల్లో తోడుంటారు. అయితే కొంత మంది మాత్రం రెండు ముఖాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. వారు మీతో ఒక పక్క స్నేహం చేస్తూనే మరోపక్క మీ పట్ల అసూయను పగను పెట్టుకుంటారు. ఆచార్య చాణక్యుడు జీవితంలో కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండమని చెప్పాడు. కొందరితో స్నేహం చేయడం విషం తాగడంతో సమానమని వివరించాడు. మీ చుట్టూ కొన్ని రకాల అలవాట్లు ఉన్న వ్యక్తులు ఉంటే వారికి మైళ్ళ దూరంలో ఉండాల్సిన అవసరం ఉంది.

మనసులో అసూయ ఉంటే

కొంతమంది వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే వారు మీ ముందు మిమ్మల్ని పొగుడుతారు. మీకంటే ఎవరూ బాగా ఆలోచించలేరని అంటారు. మీ వెనుక మాత్రం ద్వేషాన్ని కక్కుతారు. వారి మనసులోని మీ పట్ల ఎప్పుడూ అసూయ భావనే ఉంటుంది. మీరు జీవితంలో ముందుకు వెళ్లడం చూసి వారు లోపల కుళ్ళిపోతారు. అలాంటి వ్యక్తులను తెలివిగా కనిపెట్టి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. వారితో స్నేహం చేయడం ఎంతో ప్రమాదకరం.

చెడుగా ఆలోచించే వ్యక్తులు

మీరు ఎవరితో నివసిస్తారో, ఎవరితో స్నేహం చేస్తారో వారిలాగే అవుతారని అంటారు. ముఖ్యంగా మీ స్నేహితులు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని, లక్ష్యాలను కలిగి ఉండాలి. ఇవన్నీ మీపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మీరు స్నేహితులు నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి దాని గురించి నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది. అలాంటి వారితో సహవాసం ఏమాత్రం మంచి పద్ధతి కాదు.

అందరితో స్నేహంగా ఉండేవాడు

కొంతమంది అందరితోనూ స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి వారు ఎవరికీ మంచి స్నేహితులుగా ఉండలేరు. అపర చాణక్యుడకు ఇది పూర్తిగా నిజమని చెబుతున్నాడు. అందరిని ఒకేలా చూసే వ్యక్తి, అందరితో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఎప్పటికైనా ప్రమాదకారి. కేవలం స్నేహితుడే కాదు. బంధువుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వారు తమ సౌలభ్యాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు మీ గురించి చెడుగా చెప్పేందుకు, మీ రహస్యాలను బయటకు పెట్టేందుకు కూడా వెనుకాడరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం