Indian Railway Rules : రైలులో ప్రయాణిస్తుంటారా? మీరు తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే
IRCTC Rules : ప్రయాణికులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, రైల్వే కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గాలలో భారతీయ రైల్వే(Indian Railway) ఒకటి. భారతదేశంలోని చాలా నగరాలు రైల్వేల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. 177 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. నివేదికల ప్రకారం భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వేశాఖ(Railway Department) కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నియమాలు పాటించాలి. అవేంటో కింద చదవండి..
మీరు ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత కూడా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు అదే రైలులో మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దీని కోసం, మీరు TTEని సంప్రదించవచ్చు. లేదా IRCTC నుండి టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీకు మరో సీటు ఇస్తారు.
ప్రయాణంలో మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. మిడిల్ బెర్త్ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు తమ సీట్లను తిరస్కరించవచ్చు.
మీరు రైలు ఎక్కకపోయినా, ఆ రైలును వేరే స్టేషన్ లో ఎక్కాలనుకుంటే.. మీ సీటు మరొకరికి కేటాయించరు. కానీ 2 స్టేషన్లు దాటేవరకూ.. లేదా 1 గంట మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత టీటీఈ సీటు మరొకరికి ఇవ్వవచ్చు.
రైల్వే నిబంధనల ప్రకారం, TTE రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులను డిస్టర్బ్ చేయకూడదు. దీంతో పాటు 10 గంటలకు రైలు లైట్లు కూడా ఆపివేయాలి.
ఏసీ బోగీలో 70 కేజీలు, స్లీపర్ కోచ్‌లో 40 కేజీలు, సెకండ్ క్లాస్ బోగీలో 35 కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చు. మీరు అదనపు ఛార్జీలు చెల్లిస్తే పరిమితి పెరుగుతుంది. ఛార్జీలు ఇస్తే.. ఏసీలో 150 కిలోలు, స్లీపర్‌లో 80 కిలోలు, సెకండ్ క్లాస్ బోగీలో 70 కిలోల బరువును తీసుకెళ్లగలుగుతారు.
రైల్వే బోగీకి తగిలించి చైన్ లాగితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. అత్యవసర సమయంలో మాత్రమే చైన్ లాగాలి.
స్నాక్స్, ఆహారం, ఇతర ఆహార ఉత్పత్తులపై నియమాలను రూపొందించింది రైల్వే. ఏ విక్రేత కూడా మీ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయలేరు. వీటితోపాటు ఆహారంలో నాణ్యత కూడా ఉండాలి.