Paschima Namaskarasana: పశ్చిమ నమస్కారాసనం... ప్రతిరోజూ ఐదు నిమిషాలు చేస్తే ఆ నొప్పులు తగ్గడం ఖాయం
Paschima Namaskarasana: యోగాలో పశ్చిమ నమస్కారాసనం ముఖ్యమైనది. దీని చేయడం చాలా సులువు. ఈ ఆసనం వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Paschima Namaskarasana: పశ్చిమ నమస్కారాసనాన్ని రివర్స్ ప్రార్థన యోగా భంగిమ అని పిలుస్తారు. సాధారణంగా ముందు నుంచి నమస్కారం పెడతాము. అదే వెనుక నుంచి పెడితే పశ్చిమ నమస్కారాసనం అని అంటారు. దీన్ని పార్స్వ నమస్కారాసనా అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలోని పైభాగం బలంగా మారుతుంది. ఈ ఆసనం భుజాలు, మణికట్టుపై ప్రభావాన్ని చూపిస్తుంది. కండరాలను టోన్ చేస్తుంది. చేతుల్లోని కొవ్వును బర్న్ చేస్తుంది.
ఈ ఆసనం ఎందుకు?
లాప్‌టాప్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని గడిపే వ్యక్తులకు ఇది ఉపయోగపడే యోగా భంగిమ. ఈ భంగిమలో వెన్ను, భుజాలు బలోపేతం అవుతాయి. అలాగే ఒత్తిడి, టెన్షన్ వంటివి వదులుతాయి. కాబట్టి రోజులో ఐదు నిమిషాల పాటు ఈ పశ్చిమ నమస్కారాసనాన్ని వేయాల్సిన అవసరం ఉంది.
ప్రతిరోజూ పశ్చిమ నమస్కారాసనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భుజం కదలికలు ఛాతీని కూడా కదులుస్తాయి. దీనివల్ల శ్వాస మెరుగవుతుంది.
ఈ ఆసరాన్ని తరచూ వేస్తే మణికట్టు నొప్పి తగ్గుతుంది. అలాగే మణికట్టులో ఉన్న స్నాయువులకు బలం లభిస్తుంది. ఇది మీ టైపింగ్ స్పీడును కూడా పెంచుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల మణికట్టు మీద ఉండే అనేక ఆక్యుపంచర్ పాయింట్లు చురుకుగా మారుతాయి అని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఈ నొప్పులు తగ్గుతాయి
మెడ నొప్పి, భుజం నొప్పితో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయడం వల్ల ఫలితం ఉంటుంది. భుజం కండరాలలో ఒత్తిడి తగ్గుతుంది. మెడలో ఉన్న నొప్పులు కూడా తగ్గిపోతాయి. అలాగే టెన్షన్, ఒత్తిడితో బాధపడుతున్న వారు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం, మనసు, ఆత్మ మధ్య సామరస్యత కుదురుతుంది.
ఎలా చేయాలి?
ఈ ఆసనాన్ని వేసేందుకు మొదటగా పద్మాసనంలో కూర్చోవాలి. చేతులను వెనక్కి పెట్టి నమస్కారం చేసేందుకు ప్రయత్నించాలి. వెనుకనుంచి చూస్తే చేతులు రెండు ముడుచుకొని ప్రార్థన చేస్తున్నట్టు ఉంటాయి. అలా ఐదు నిమిషాలు ఉండేందుకు ప్రయత్నించండి.
ఎవరు చేయకూడదు?
పశ్చిమ నమస్కారాసనం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చేయకపోవడమే మంచిది. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వారు, చేయి లేదా భుజం గాయాలు ఉన్నవారు ఈ రివర్స్ ప్రార్థన ఆసనాన్ని మానుకోవాలి. ఎందుకంటే ఈ యోగా భంగిమల్లో చేతులను వెనుకకు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల వారి రక్తపోటు పడిపోవడం, భుజం గాయాలు పెరగడం జరగవచ్చు.
టాపిక్