Chanakya Niti Telugu : పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని 3 పనులు ఇవే-parents should not do these 3 things in front of children according to chanakya niti happy childrens day ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Parents Should Not Do These 3 Things In Front Of Children According To Chanakya Niti Happy Children's Day

Chanakya Niti Telugu : పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని 3 పనులు ఇవే

Anand Sai HT Telugu
Nov 14, 2023 08:00 AM IST

Chanakya Niti Telugu : నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. చాణక్యుడు కూడా పిల్లల గురించి చాలా విషయాలు చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని విషయాలను చాణక్య నీతిలో పేర్కొన్నాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి

పిల్లల జీవితంలో జరిగే ప్రతి సంఘటనను లేదా వారి ప్రవర్తనను ప్రభావితం చేసేది తల్లిదండ్రులు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారు, పిల్లలతో ఎలా వ్యవహరిస్తారు అనేది చాలా ముఖ్యం. ఆచార్య చాణక్య ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లల గురించి 3 విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. చాణక్యుడు పిల్లలకు ఏయే విషయాలు దూరంగా ఉంచాలో చెప్పాడు. చాణక్య నీతి కఠినంగా ఉండవచ్చు, కానీ జీవితంలో విజయానికి రహస్యం అందులోనే ఉంది. నేటికీ ఆయన మాటలు, సూత్రాలు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పెద్దలు తమ పిల్లలకు ఏమి నేర్పించాలో పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ప్రతి వ్యక్తి పిల్లల ముందు చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. ఎందుకంటే పిల్లలు చిన్న మొక్క వలె సున్నితంగా ఉంటారు. మీరు పెంచినప్పుడు, దానికి అనుగుణంగా మారతారు. ఆచార్య చాణక్యుడు తల్లిదండ్రులు తమ పిల్లల ముందు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలను ప్రస్తావించాడు.

చాణక్య నీతి ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఒకరి పట్ల మరొకరు తమ భావాలను బహిరంగంగా చెబుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు పరువు, గౌరవం గురించి ఆలోచించరు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఈ తప్పు చేయకూడదు. పిల్లల ముందు అసభ్యకరమైన మాటలు పిల్లల మనస్సులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి.

తల్లిదండ్రులు తమ పిల్లల ముందు అబద్ధాలు ఆడకూడదు. మీరు వారి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే లేదా మీ అబద్ధాలలో వారిని చేర్చినట్లయితే, వారి దృష్టిలో గౌరవాన్ని కోల్పోతారు. అప్పుడు వారు మీకు అబద్ధం చెప్పడం ప్రారంభించవచ్చు. వీలయినంత వరకు వారిని దీనికి దూరంగా ఉంచండి.

చాలా సందర్భాలలో, తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఒకరితో ఒకరు గొడవపడతారు. ఇతరుల లోపాల గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల దృష్టిలో గౌరవాన్ని కోల్పోతారు. దీని వల్ల చాలాసార్లు పిల్లలు మిమ్మల్ని అవమానించడానికి, చెడుగా చూడడానికి వెనుకాడరు.

చాణక్య నీతి ప్రకారం సమాజానికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలి అంటే.. చిన్నతనంలోనే మంచి కథలు చెప్పే గుణాన్ని పిల్లలకు నేర్పించాలి. ఇది పిల్లలకు స్ఫూర్తినిస్తుంది. ఈ కథలు పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. పిల్లలకు వీలైనంత వరకు స్ఫూర్తిదాయకమైన కథలు చెప్పండి. పెరిగి పెద్దయ్యాక సమాజానికి ఉపయోగపడతారు. ఎందుకంటే.. నేటి బాలలే.. రేపటి పౌరులు.

WhatsApp channel