Divorce and Kids: పిల్లలు ఈ వయసులో ఉంటే తల్లిదండ్రులు విడాకులు తీసుకోకూడదు, వాళ్ల జీవితమే నాశనం అయిపోతుంది-parents should not divorce if the children are at this age their lives will be ruined ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Divorce And Kids: పిల్లలు ఈ వయసులో ఉంటే తల్లిదండ్రులు విడాకులు తీసుకోకూడదు, వాళ్ల జీవితమే నాశనం అయిపోతుంది

Divorce and Kids: పిల్లలు ఈ వయసులో ఉంటే తల్లిదండ్రులు విడాకులు తీసుకోకూడదు, వాళ్ల జీవితమే నాశనం అయిపోతుంది

Haritha Chappa HT Telugu

Divorce and Kids: విడాకుల వల్ల పిల్లలు ఎంతో ప్రభావితమవుతారు. విడిపోతున్న భార్యాభర్తల వల్ల పిల్లల జీవితం కూడా ఎంతో మారిపోతుంది. ముఖ్యంగా పిల్లలు ఏ వయసులో ఉన్నప్పుడు విడాకులు తీసుకోకూడదో తెలుసుకోండి.

విడాకులు తీసుకునే ముందు మీ బిడ్డ గురించి ఆలోచిచండి (Pixabay)

చిన్నచిన్న అభిప్రాయ భేదాలకే విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారు. వారిద్దరూ తమ తమ గౌరవాలకు. అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటారు. తమవల్ల ఈ భూమి మీదకు వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటారు. ఏ బిడ్డ అయినా తల్లిదండ్రులు కలిసే తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లి తండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాలన్న ప్రశ్న అతని ముందుకు వస్తుందని ఊహించడు. కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి.

ఆరేళ్ల దాటిన పిల్లలు ఉంటే

ముఖ్యంగా పిల్లలు ఆరు నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటే ఆ భార్యాభర్తలు విడాకులు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాలం పిల్లలు ఏ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు. కానీ సందేహాలు మాత్రం అతడిని వేధిస్తూనే ఉంటాయి. బయటకి గంభీరంగానే కనిపిస్తాడు, నవ్వుతాడు, తింటాడు... అన్నీ పనులు సాధారణంగానే చేస్తాడు. కానీ మానసికంగా మాత్రం లోలోపల కుంగిపోతూనే ఉంటాడు. జీవితాంతం ఆ వయసులో జరిగిన సంఘటనలు అతనికి గుర్తుంటాయి. ఆ వయసులో తల్లిదండ్రులు పిల్లలను కలిసే పెంచాలి. దీని వల్ల అతడు మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు.

తల్లిదండ్రులు విడిపోతున్నారని బిడ్డకు తెలిసినప్పుడు వారిలో గందరగోళం, విచారం, దుఃఖం, భయం వంటి భావోద్వేగాలు మిళితమై వస్తాయి. తమ చుట్టూ ఏం జరుగుతుందో వారికి అర్థం కాదు. అందుకే ఆ సమయంలో వారు ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటారు. వారి నిశ్శబ్దాన్ని తల్లిదండ్రులు చాలా తేలిగ్గా తీసుకుంటారు. తమ పిల్లలు బాగానే ఉన్నారని అనుకుంటారు.

పిల్లల ప్రవర్తన మారిపోతుంది

తల్లిదండ్రుల విడాకులు పిల్లల్లో అభద్రతను పెంచేస్తాయి. ఇంట్లో వాతావరణం కూడా మారిపోతుంది. భార్య భర్తలు విడాకులకు ముందు తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అవి చూసిన పిల్లలు మనసులోనే తీవ్ర భయాందోళనకు గురవుతారు. కానీ ఆ విషయాలను వారు చెప్పలేరు.

తల్లిదండ్రుల విడాకులు పిల్లల చదువుపై కూడా ప్రభావం చూపుతాయి. వారు చదువు పైన ఏకాగ్రత పెట్టలేరు. వారి పనితీరు ప్రవర్తనా కూడా మారిపోతుంది. పాఠశాలలో ఉన్న ఇతర పిల్లలతో కూడా వారు సరిగా కలవలేరు.

విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒకరు కూడా ఉద్యోగాలు పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైనే ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు. వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖం సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి. మీ బిడ్డ కోసం ఆలోచించండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం