పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు? అని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను తరచూ అడుగుతుంటారు. దానికి పిల్లలు నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను అంటూ రకరకాల సమాధానాలు చెబుతుంటారు. నిజానికి తల్లిదండ్రులకు కూడా తెలుసు పిల్లలు వారు కంఠస్థం చేసిన సమాధానాలనే ఇస్తారు. కొన్నిసార్లు వారు ఈ పదాలను ఇతరుల నుండి వినడం ద్వారా తెలుసుకుని చెప్తారు. మరికొన్నిసార్లు తమ ప్రియమైనవారి మాటలను పునరావృతం చేస్తారు. కానీ మీ పిల్లల కెరీర్ గురించి వారిని అడగడానికి, వారికి సరైన మార్గనిర్దేశం చేయడానికి సరైన సమయం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మీ పిల్లలను సరైన సమయంలోనేఅడిగారా? ఇక్కడ తెలుసుకోండి.
ప్రముఖ కెరీర్ కోచ్ ప్రొఫెసర్ వివేక్ మిశ్రా ప్రకారం, మీ పిల్లవాడు 8వ తరగతికి వచ్చినప్పుడు అంటే వారి వయస్సు 12 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు మీరు ఈ ప్రశ్న అడగాలి. ఇది వారి ఆసక్తులు, బలాలు ఏమిటో వారు అర్థం చేసుకునే సమయం. ఇది వారి ఆసక్తులు లోతుగా పెరిగే సమయం. కాబట్టి, వారి ఆసక్తులను సకాలంలో అర్థం చేసుకోవడం, వాటి గురించి చర్చించడం ముఖ్యం.
ఏదైనా చర్చించడానికి సరైన సమయంతో పాటు,సరైన సందర్భం కూడా ఉండాలి. కెరీర్ గురించి పిల్లలతో మాట్లాడనుకున్నప్పుడు మీరు ఇద్దరూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. పిల్లవాడు మాట్లాడటానికి ఆసక్తి చూపకపోతే లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉద్రిక్తత ఉంటే కొంతకాలం ఆ చర్చను ఆపివేయండి. మంచి సమయం కోసం చూడండి.
ఉదాహరణకు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు. కలిసి ఆడుకుంటున్నప్పుడు. ప్రత్యేకంగా దీని గురించి అడలేకపోతే పరోక్షంగా కూడా అడగవచ్చు. అంటే
పిల్లల కెరీర్ ఎంపిక విషయంలో ‘త్రిభుజం’ ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. డాక్టర్ స్మితా శ్రీవాస్తవ సూచించినట్లుగా కెరీర్‌ను ఎన్నుకునే ముందు పిల్లలను మూడు ముఖ్యమైన విషయాలపై ఆలోచించమని చెప్పాలి:
1. వారు ఎంచుకునే పనితో సంతృప్తి చెందుతారా?
2. వారు ఎలాంటి జీవనశైలిని కోరుకుంటున్నారు?
3. వారు ఎంత డబ్బు సంపాదిస్తారు?
ఈ మూడు ప్రశ్నలకు వచ్చే సమాధానాలు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయి. తల్లిదండ్రులుగా మీ పిల్లల భవిష్యత్తును సులభతరం చేయడానికి ఈ ‘త్రిభుజం’ ప్రాముఖ్యతను సరైన సమయంలో, సరైన పద్ధతిలో వారికి వివరించడం చాలా అవసరం.
మీ పిల్లలకు కళలు లేదా క్రీడలు వంటి రంగాలలో కెరీర్ ఎంపికలపై ఆసక్తి ఉంటే వారి అభిరుచిని గుర్తించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరు ముందుగానే చర్యలు ప్రారంభించాలి. ఈ విషయంలో వివేక్ చెప్పినట్లుగా కళాత్మక రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవడానికి 8వ లేదా 10వ తరగతి వరకు వేచి చూడకుండా చిన్న వయస్సు నుండే ఆ కళను నేర్చుకోవడం ప్రారంభించడం మంచిది. తద్వారా వారు కెరీర్‌ను ఎంచుకునే సమయానికి మంచి నైపుణ్యం కలిగి ఉంటారు.
ఒకవేళ ఆ రంగంలో విజయావకాశాల గురించి మీకు ఆందోళన ఉంటే మీ పిల్లలను ఇతర కెరీర్ ఎంపికలకు కూడా సిద్ధం చేయడం వివేకమైన పని. వివేక్ అభిప్రాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విజయం సాధించాలనే నియమం లేదు. అయితే కళాత్మక కెరీర్ ఎంపికలలో ఈ ఆలోచన లేదా భయం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పిల్లల చదువుతో పాటు వారి కెరీర్ ఎంపికల గురించి కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
ఉదాహరణకు, క్రికెటర్ అనిల్ కుంబ్లే, నటుడు ఆర్. మాధవన్, తాప్సీ పన్ను వంటి ప్రముఖులు కూడా ఇంజనీరింగ్ చదివినవారే. దీని అర్థం ఏమిటంటే పిల్లలు తమ ఆసక్తుల వెంట వెళ్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. తద్వారా వారికి ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయ మార్గం కావాలి.
పిల్లలతో కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. "ఈ కెరీర్ నీకు సెట్ అవదు, ఇందులో నువ్వు ఎదగలేవు" వంటి మాటలు పొరపాటున కూడా అనకండి. ఒకవేళ మీ పిల్లల్లో ఒక నిర్దిష్ట కెరీర్‌కు అవసరమైన లక్షణాలు లేవని మీరు భావిస్తే, నేరుగా చెప్పే బదులు, ఆ కెరీర్లో ఉండే కష్టాలు, సవాళ్ళను వారికి అర్థమయ్యేలా వివరించండి. అదే సమయంలో, వారి ఆసక్తులను పరిగణనలోకి తీసుకుని ఇతర కెరీర్ ఎంపికలను సూచించండి.