Parenting Tips: మీ పిల్లలు ఈ పనులు చేస్తుంటే.. పొరపాటున వారిని కూడా ఆపకండి! తప్పు చేసిన వారు అవుతారు !-parenting tips if your kids are doing these things dont stop them even by mistake they will be wrong ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: మీ పిల్లలు ఈ పనులు చేస్తుంటే.. పొరపాటున వారిని కూడా ఆపకండి! తప్పు చేసిన వారు అవుతారు !

Parenting Tips: మీ పిల్లలు ఈ పనులు చేస్తుంటే.. పొరపాటున వారిని కూడా ఆపకండి! తప్పు చేసిన వారు అవుతారు !

Ramya Sri Marka HT Telugu
Jan 28, 2025 08:30 PM IST

Parenting Tips: తల్లిదండ్రులుగా పిల్లలకు తప్పు ఒప్పుల గురించి చెప్పడం చాలా అవసరం. అయితే ప్రతిదానికి అది అలా చేయద్దు, ఇలా చేయద్దు అనడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు వారిని ఆపడం వల్ల పొరపాటు చేసిన వారు అవుతారు. కొన్ని విషయాల్లో వారిని ఆపకపోవడమే మంచిదని తెలుసుకోండి.

మీ పిల్లలు ఈ పనులు చేస్తుంటే..  పొరపాటున వారిని కూడా ఆపకండి!
మీ పిల్లలు ఈ పనులు చేస్తుంటే.. పొరపాటున వారిని కూడా ఆపకండి!

తల్లిదండ్రులుగా పిల్లలకు మంచేది, చెడు ఏది అని చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. కాకపోతే దానికి కూడా కొన్ని షరతులు, హద్దులు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి వారిపై అరుస్తూ వారిని అది చేయద్దు, ఇది చేయద్దు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటుంటే అది వారికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. వారి ఎదుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా కొన్ని పనులు చేసేటప్పుడు పిల్లలకు ఆపడం వల్ల మీరు చాలా పెద్ద పొరపాటు చేసిన వారు అవుతారు. అవేంటో తెలుసుకుని మీ పిల్లల దృష్టిలో మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మారండి.

yearly horoscope entry point

కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు:

మీ బిడ్డ కొన్ని విషయాలను నేర్చుకోవడానికి, చూడటానికి ఇష్టపడతాడు. అలాంటప్పుడు వారిని ఆపకండి. ఇలా చేస్తేనే వారి అభిరుచులు ఏంటో వారికి తెలుస్తాయి. ఆత్మవిశ్వాసం, స్థితిస్థాపకత, జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడతాయి. కనుక కొత్త విషయాలను నేర్చుకునేపట్పుడు వారిని ఆపకండి. లక్ష్యాల వైపు వెళ్ళడానికి వారికి సహాయపడండి.

ప్రశ్నలు అడగినప్పడు:

మీ పిల్లలు తరచూ అడిగే ప్రశ్నలకు మీకు విసుగు రావచ్చు. కానీ ఓపిగ్గా ఆలోచిస్తే మీరు ఈ విషయంలో గర్వ పడచ్చు. ఎందుకంటే ఆసక్తి లోతైన అభ్యాసం, అవగాహనకు దారితీస్తుంది. కాబట్టి ప్రశ్నలు అడగడానికి మీ పిల్లలను ప్రోత్సహించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడానికి సహాపడతాయి. వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో అర్ధవంతమైన రీతిలో సంభాషించడానికి సహాయపడుతుంది.

పెద్ద కలల గురించి మాట్లాడినప్పుడు:

పిల్లలు పెద్ద పెద్ద కలలు కంటుంటారు. అలాంటప్పుడు వారిని మీరు ఎగతాళి చేయకండి. మీరు మీ పిల్లల లక్ష్యాలకు మీరు మద్దతు ఇవ్వాలి. ఇలా చేస్తేనే వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, పట్టుదల పెరుగుతాయి. అంతేకాదు మీ పిల్లలను పెద్ద కలలు కనేలా మీరే ప్రోత్సహించండి. అర్థవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించడానికి, వారి పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయడానికి తల్లిదండ్రులుగా మీరు సహాయపడండి.

భావాలను వ్యక్తీకరించినప్పడు:

.పిల్లల ఎమోషన్స్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకండి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. పిల్లలు భావోద్వేగంగా వ్యక్తీకరించినప్పుడే స్వీయ-అవగాహన, భావోద్వేగ అవగాహనను పెంపొందించుకోవడం నేర్చుకుంటారు. ఇది మీ పిల్లలు వారి భావాలను సానుకూలంగా కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది. వారిలో కరుణను అభివృద్ధి చేయడానికి, మంచి సంబంధాలను ఏర్పరచడానికి ఇవే సహాయపడుతుంది.

కొత్త అభిరుచులు

మీ పిల్లలకు కొత్త కొత్త అభిరుచులు ఏర్పడుతుంటే అది మీరు సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే అది వారి సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడుతుంది. కొత్త ఆసక్తులను కలిగిస్తుంది. నైపుణ్యాలను, ఫ్యాషన్లను అభివృద్ధి చేయడానికి వారిని ప్రేరేపిస్తుంది. దీని ద్వారా వారు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని కూడా మెరుగుపరుచుకుంటారు.

తప్పులు చేయడం

నేర్చుకునే దశలో తప్పులు చేయడం అనేది పిల్లలకు పెద్దలకూ జరిగేదే. వీటిని వారిని తిట్టకుండా మెట్లుగా గుర్తించమని చెప్పండి. వారు చేసే తప్పులే వారికి తిరిగి పుంజుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి. విమర్శనాత్మకంగా ఆలోచనను, పరిష్కార సామర్థ్యాన్నిపెంపొందిస్తాయి. ఇది భవిష్యత్తులో సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడానికి, అన్నింటా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

సమస్యలను పరిష్కరించుకున్నప్పుడు:

కొన్ని సార్లు మీకు తెలియకుండానే పిల్లలు వారి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎక్కడ హాని కలుగుతుందో అనే భయంతో మీరు వారిని కోప్పడతారు. కానీ ఇది పొరపాటు. ఎందుకంటే.. పరిష్కరించడం అనేది స్వతంత్రతను పెంపొందిస్తుంది. విమర్శనాత్మకంగా ఆలోచించడానికి వారికి సహాయపడుతుంది. స్వతంత్రులు, పరిజ్ఞాన వంతులుగా వారిని మారుస్తుంది. జీవితంలో గెలవడానికి సహాయపడుతుంది.

ప్రకృతిలో గడుపుతున్నప్పుడు

పిల్లలు ప్రకృతితో గడపాలి అనుకుంటన్నప్పుడు, నేచర్ తో సామరస్యంగా జీవించాలి అనుకుంటున్నప్పుడు వారి మీరు ఆపకండి. ఇది మనస్సు, శరీరం రెండింటినీ ప్రేరేపిస్తుంది. వారిలో తెలియని కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. పర్యావరణ హితులుగా మారుస్తుంది. మీరు ప్రకృతి ప్రపంచ వింతలను చూసి ఆశ్చర్యపోతారు, ఆనందంగా ఉంటారు.

సంగీతం

మీ పిల్లల సృజనాత్మకత, మెదడు అభివృద్ధి, క్రమశిక్షణకు సంగీతం ఒక ఉత్ప్రేరకం. ఇది వారు తమను తాము వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది. వారి నైపుణ్యాలు బలోపేతం అయిన తర్వాత, అది వారికి సహనాన్ని నేర్పుతుంది. కనుక మీ పిల్లవాడికి సంగీతం అంటే ఇష్టం ఉంటే తప్పకుండా నేర్పించండి. ఇది వారి దృష్టిని, ఏకాగ్రతను పెంచుతుంది. జీవితకాల వ్యక్తిగత ఎదుగుదలను సాధించడంలో వారికి సహాయపడుతుంది.

ఆడటం

డ్యాన్స్ లేదా గేమ్స్ అనేవి పిల్లల్లో ఐక్యతను పెంపొందిస్తాయి. పట్టుదల, శారీరక దృఢత్వం రెండూ వీటి ద్వారా వస్తాయి. క్రీడల ద్వారా విజయాన్ని జరుపుకోవడం, వైఫల్యాన్ని హుందాగా ఎదుర్కోవడం నేర్చుకుంటారు. డ్యాన్స్ క్రమశిక్షణను పెంపొందిస్తుంది, పోటీని సానుకూల దిశలో తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.

Whats_app_banner