Parenting Tips | పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నప్పుడు, పేరెంట్స్ ఏం చేయాలి?
Parenting Tips- Rude Child: మొండిగా ప్రవర్తించే పిల్లల వైఖరిని ఎలా మార్చాలో.. థెరపిస్టులు కొన్ని మార్గాలను సూచించారు. అవి ఇక్కడ తెలుసుకోండి.
Parenting Tips- Rude Child: కొంతమంది పిల్లలు చాలా మొండిగా వ్యవహరిస్తారు, ఏ విషయంలోనైనా తమకు నచ్చినట్లుగా జరగకపోతే పేరేంట్స్ తో అయినా, ఇంకెవరితో అయినా మొరటుగా ప్రవర్తిస్తారు, కఠినమైన పదజాలంతో దూషించడం లేదా వస్తువులను విసిరేయడం, ఎదుటివారిపై దాడి చేయటం వంటివి చేస్తారు. వీరి ప్రవర్తనతో ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా సహనం కోల్పోయి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు, వారిని దండిచడం చేస్తారు. అయితే ఇలా చేయడం వలన పిల్లల ప్రవర్తన మరింత దిగజారుతుంది తప్ప, వారి వైఖరిలో మార్పు రాదని మనస్తత్వవేత్తలు అంటున్నారు.
పిల్లలు దయలేకుండా ప్రవర్తిస్తే వారికి దయ, సానుభూతి అంటే ఏమిటో నేర్పించాలి. వారు ఎవరితో స్నేహంగా మెలగలేకపోతే వారికి స్నేహపూర్వక వాతావరణం సృష్టించాలి. మొండిగా ప్రవర్తించే పిల్లల వైఖరిని ఎలా మార్చాలో, వారిని దారిలోకి తెచ్చుకొని, సరైన దారిలో ఎలా నడిపించాలో సహాయపడటానికి థెరపిస్టులు కొన్ని మార్గాలను సూచించారు. అవి ఇక్కడ తెలుసుకోండి.
అంతర్లీన కారణాన్ని గుర్తించండి
చాలా సందర్భాల్లో పిల్లలు మొండిగా ప్రవర్తించడానికి కారణం వారు తమలోని కొన్ని భావోద్వేగాలను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడమే. వారికి తమ బాధ ఎలా వ్యక్తపరచాలో తెలియక అలా మొండిగా ప్రవర్తిస్తారు. అటువంటి సందర్భాలలో తల్లిదండ్రులు వారిని లోతుగా పరిశోధించాలి మరియు, వారు ఏమి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
సభ్యమైన పదజాలం బోధించండి
పిల్లలు వారి తోబుట్టువులతో లేదా వారి తల్లిదండ్రులతో మొరటుగా మాట్లాడుతూ ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు వారు ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పదజాలం ఉపయోగించాలి అనేది వారికి నేర్పించాలి. ఏ రకంగా మాట్లాడితే వారు అనుకున్నది నెరవేరుతుందో వారికి తెలియజెప్పాలి. ఇది వారి భావోద్వేగాలను మెరుగ్గా వ్యక్తీకరించడానికి, తమను తాము మార్చుకోడానికి సహాయపడుతుంది. జాలి, దయ కూడా నేర్పుతుంది.
మాట్లాడే భాషను ప్రాక్టీస్ చేయించండి
మీరు వారికి నేర్పించిన పదాలను వాడుతూ ఎలా తమ భావాన్ని వ్యక్తీకరించాలో ప్రాక్టీస్ చేయించండి. అంతకుముందు ప్రవర్తన కాకుండా అదే అవసరానికి ఇంకోలా అడిగితే ఎలా ఉంటుందో చూడమని వారికి తెలియజెప్పాలి. ఈ ప్రాక్టీస్ వారికి వారు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, వారు ఎవరితో అయినా మరింత మెరుగైన మార్గంలో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది, వారిలో మరింత నమ్మకం కలిగిస్తుంది.
ప్రోత్సహించండి, ప్రశంసించండి
పిల్లలు తమ ప్రవర్తన మార్చుకుంటున్న దశలో వారిని ప్రశంసించండి. తమ భావోద్వేగాలను మెరుగ్గా ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకోవడం కోసం మరింత ప్రోత్సహించండి, ఇందుకోసం వారు తీసుకుంటున్న చర్యలను, ప్రయత్నాలను అభినందించండి. ఇది వారిలో మార్పు తేవడానికి చాలా ముఖ్యమైన దశలలో ఒకటి. ఇలా అభినందిస్తూపోతే, వారు కోపంగా లేదా చిరాకుగా ఉన్నప్పుడు కూడా, ప్రేమగా మాట్లాడతారు, దయతో ఉంటారు.
సంబంధిత కథనం