Parenting Tips : ఈ మంచి అలవాట్లు మీ బిడ్డను స్మార్ట్‌గా చేస్తాయి-parenting tips good habits to make children smarter must follow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : ఈ మంచి అలవాట్లు మీ బిడ్డను స్మార్ట్‌గా చేస్తాయి

Parenting Tips : ఈ మంచి అలవాట్లు మీ బిడ్డను స్మార్ట్‌గా చేస్తాయి

Anand Sai HT Telugu
May 19, 2024 04:30 PM IST

Parenting Tips In Telugu : తల్లిదండ్రులు పిల్లలను సరిగా పెంచితే వారు భవిష్యుత్తులో బాగుపడుతారు. ఇందుకోసం వారికి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు నేర్పించాలి.

పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు
పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు (Unsplash)

తల్లితండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా, విజయం సాధించాలని కోరుకుంటారు. మన పిల్లలు విజయం సాధించాలని మనమందరం అనుకుంటాం. ఇందుకోసం చాలా కష్టపడుతాం. కానీ మన మనస్సులో ఈ ఆలోచన ఉంటే సరిపోదు. దీనికి తగ్గట్టుగా శ్రమించాలి. అప్పుడే పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది.

పిల్లలను మేధావులుగా పెంచాలి. ఏ విధమైన కార్యకలాపాలు పిల్లలను ప్రతిభావంతులుగా మారుస్తాయో తెలుసుకొవాలి. ఆ తర్వాతే వారిని ప్రోత్సహించండి. అటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలి. అప్పుడే పిల్లలు జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా ఉంటారు. లేదంటే నలుగురిలో నారాయణ అన్నట్టుగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలకు ఉండే స్కిల్స్ మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

సంగీతం

సంగీతం గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. సంగీత పరికరాలను వాయించడం నేర్చుకోవాలి. ఇది మీ పిల్లల దృష్టిని మెరుగుపరుస్తుంది. వినూత్న ఆలోచనను కూడా ప్రోత్సహిస్తుంది. క్రియేటివిటీ పెరుగుతుంది.

ఉదయం లేవడం

పొద్దున్నే లేవడం కంటే మంచి అలవాటు లేదు. మీరు ఎంత ధ్యానం చేస్తున్నారో లేదా ఎంత వ్యాయామం చేస్తారో దాని కంటే ఉదయాన్నే నిద్రలేవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే లేచేవారి మైండ్ చురుకుగా ఉంటుంది. వారు అన్ని విషయాల్లో ముందు ఉంటారు. ప్రతీ విషయాన్ని చురుకుగా వింటారు.

ధ్యానం

తగినంత మనశ్శాంతిని ఇవ్వడం, ధ్యానం సాధన చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉండేందుకు శక్తి లభిస్తుంది. రోజూ 15 నిమిషాలు ధ్యానం చేస్తే జీవితంలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇలా చేస్తే పిల్లలకు ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది. ఒక లక్ష్యంపై ఫోకస్ చేస్తారు.

చర్చలు

వ్యక్తులతో సహజంగా మాట్లాడటం, వారితో విషయాలు చర్చించడం వంటి కార్యక్రమాలలో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించండి. ఇది వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. నలుగురిలో మాట్లాడే ధైర్యం వస్తుంది. ఏ విషయంలోనూ భయపడకుండా ఉంటారు. అన్ని విషయాలూ మీకు ధైర్యంగా చెబుతారు.

పుస్తక పఠనం

మీ బిడ్డను పుస్తకాలు చదివేలా చేయండి. మీరు ప్రతిరోజూ ఒక పేజీ చదివినా, మీ మెదడు శక్తి మెరుగుపడుతుంది. పుస్తకాలు చదివితే చాలా నాలెడ్జ్ వస్తుంది. ఏ సబ్జెక్ట్ పైన అయినా వారు అవగాహన కలిగి ఉంటారు.

గార్డెనింగ్

గార్డెనింగ్ అనేది శరీరం, మనస్సును చురుకుగా ఉంచడం చేస్తుంది. మీ పిల్లలు మొక్కలు ఎలా పెరుగుతాయో, వాటికి ఏమి అవసరమో గమనించడం ప్రారంభించాలి. కొత్త ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. ప్రకృతిపై ప్రేమ పెరుగుతుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది.

రాయడం

ప్రతిరోజూ ఒక పేజీలో ఏదైనా రాయమని పిల్లలను అడగండి. పిల్లలు రాసిన వాటిని ఇతరులకు చెప్పి సంతోషపెట్టండి. వారిని వ్యాసాలు రాసేలా ప్రోత్సహించండి. ఎందుకంటే ఇలా చేస్తే సృజనాత్మకత పెరుగుతుంది.

శారీరక శ్రమ

పుస్తకం చదవడం మాత్రమే మెదడు కార్యకలాపాలు పెంచదు. శారీరక శ్రమ కూడా అవసరం. రోజువారీ క్రీడలు, వ్యాయామంలో పిల్లలను చేర్చండి. ఇలా చేయడం వలన పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించేందుకు మానసికంగానూ శక్తి వస్తుంది.

WhatsApp channel