Parenting Tips: పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఉదయాన్నే పేరెంట్స్ చేయాల్సిన పనులేంటో తెలుసా!-parenting tips do you know what parents should do in the morning for a better future for their kids ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఉదయాన్నే పేరెంట్స్ చేయాల్సిన పనులేంటో తెలుసా!

Parenting Tips: పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఉదయాన్నే పేరెంట్స్ చేయాల్సిన పనులేంటో తెలుసా!

Ramya Sri Marka HT Telugu
Jan 06, 2025 10:30 AM IST

Parenting Tips: చిన్నారుల్లో చిన్న నాటి నుంచే సానుకూల ఆలోచనల నెలకొంటే వారి వైఖరి, వ్యక్తిత్వం స్పష్టంగా ఉంటాయి. తద్వారా వారి బంగారు భవిష్యత్‌కు చక్కని బాట వేయగలం. పిల్లల ఎదుగుదల కరెక్ట్‌గా ఉండాలంటే, ముందుగా పేరెంట్స్ చేయాల్సిన కొన్ని పనులున్నాయి.

పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఉదయాన్నే పేరెంట్స్
పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఉదయాన్నే పేరెంట్స్

చిన్నతనంలోనే పిల్లల మనస్సులో ఒక సానుకూల దృక్పథాన్ని కలుగజేయాలి. పిల్లలు స్కూల్‌కు వెళ్లి చదువుకునే దాని కంటే ఇంట్లోనే ఎక్కువగా నేర్చుకుంటారు. అలవాట్లు, పద్ధతులు అలవరచుకునేందుకు ఆ వయస్సే కరెక్ట్. ఉదాహరణకు మీకు పొద్దున్నే నిద్రలేచే అలవాటు లేకపోతే మీ పిల్లలు కూడా ఉదయాన్నే నిద్రలేవడానికి ఇష్టపడరు. ఉదయం లేవడం వల్ల మంచి రోజును నిర్మించుకోవడానికి పునాది వేస్తాం. మీ అలవాట్లే మీ పిల్లల భవిష్యత్ నిర్మించుకునే అంశాలు అనే సంగతి గుర్తుంచుకుంటే, మీ పిల్లలు మీ పట్ల ఆకర్షితులవుతారు.

yearly horoscope entry point

సాధారణంగా పిల్లలు ఎప్పుడూ ఒక సూపర్ హీరోను రోల్ మోడల్ ను ఆదర్శంగా తీసుకుంటారు. మరి ఆ సూపర్ హీరో మీరే ఎందుకు కాకూడదు. పొద్దున్నే ఈ అలవాట్లను పాటిస్తే మీ బిడ్డకు ఆదర్శంగా నిలుస్తారు. తల్లిదండ్రులు ఉదయం పూట పాటించాల్సిన అలవాట్లు ఏమిటి? ఈ అలవాట్లను ఇక్కడ అనుసరించండి.

పిల్లల కంటే ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి:

ఉదయాన్నే నిద్ర లేచి ఉదయాన్ని త్వరగా ప్రారంభిస్తే, ఇంట్లో గందరగోళ పరిస్థితులు కనపడవు. పైగా ఇది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా మీ పనులు చేసుకుంటూ పోగలిగితే మీ ఇంటిలో సానుకూల భావనలు కలుగుతాయి. ఇది రోజంతా మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఇది పిల్లలకు ప్రణాళిక ప్రకారం, సమయపాలనతో పని చేసుకోవడాన్ని నేర్పిస్తుంది.

కృతజ్ఞతను వ్యక్తపరచడం నేర్పండి

మీరు పొందిన వనరులు, అందుకుంటున్న సౌకర్యాలకు కృతజ్ఞతాపూర్వకంగా మెలగండి. మిమ్మల్ని చూసి నేర్చుకునే పిల్లలు ఆ గుణాలను అలవాటు చేసుకుని సానుకూల ఆలోచనలతో ఉంటారు. దక్కిన సదుపాయాలతో సంతృప్తి పడటం నేర్పితే పిల్లల్లో ఆందోళన కనిపించద జీవిత ఆశీర్వాదాలను అభినందించడానికి సహాయపడుతుంది.

ఉదయం లేవగానే చిరాకు:

నిద్రలేచిన వెంటనే చిరాకు పడటం, ఆలస్యమైపోతుందని కంగారుపడటం వంటివి చేయకండి. పిల్లలకు కూడా అవే అలవాటుగా మారిపోతుంది. వాటికి బదులుగా ఉదయాన్నే వ్యాయామాలు చేయండి.పొద్దున్నే కొన్ని వ్యాయామాలు చేస్తే చికాకు, కోపం తొలగిపోతాయి.శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం వల్ల పిల్లలు చురుకుగా ఉండాలని కోరుకుంటారు.దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు.

పొద్దున్నే చదివే అలవాటు నేర్పండి:

పుస్తకాలు చదవడానికి సమయం కేటాయించండి. లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ పిల్లలతో ఉదయం పూట పుస్తకాలు, వార్తాపత్రికలు చదివే అలవాటును పెంపొందించండి. ఈ అలవాటు వారిని తెలివైనవారిగా చేస్తుంది. ఇది వారి వ్యక్తిత్వం పెంపొందడానికి సహాయపడుతుంది. ఇది వారికి విలువలను నేర్పుతుంది.

ఉదయాన్నే ఉత్సాహంగా ఉండండి:

ప్రతిరోజూ ఉదయం సానుకూల ఆలోచనలు, ఉత్సాహభరితమైన మానసిక స్థితిని కలిగి ఉండండి. మీ సానుకూలతతో కూడిన వైఖరి ఉదయం ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. ఇది మీ పిల్లలకు సవాళ్లను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తుంది.

ఆ రోజు చేయబోయే ప్రణాళిక:

మీ పిల్లలతో మీరు ఆ రోజు చేయబోయే ప్రణాళిక గురించి చర్చించండి. ఇది వారి పనిని సమన్వయం చేసుకోవడానికి, వారితో బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి కారణమవుతుంది. ఇది వారికి సమయ నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది.

పొద్దున్నే మీ ఫోన్:

మీరు అస్సలు చేయకూడని పనేదైనా ఉందంటే అది మీ ఫోన్ తో గానీ, టీవీలో గానీ కాలక్షేపం చేయడమే. దానికి బదులుగా మీరు కాస్త ప్రయోజనకరమైన పనులు చేయడం నేర్చుకోండి. ఇదే అలవాటు వారిలోనూ కాలంతో పాటు క్రమంగా పెరిగితే చాలా ప్రయోజనాలు అందుకోగలరు. ఇలా చేయడం వల్ల వారిని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తుంది.

సమయం ఉంటే ధ్యానం చేయండి:

ఉదయాన్నే కొన్ని వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం సాధన చేయండి. ఈ అలవాట్లు వాళ్లలో ఒత్తిడిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీకు కూడా శాంతిని ఇస్తుంది. ఇది తల్లిదండ్రులకు, పిల్లలకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

ఉదయాన్నే ఆరోగ్యమైనవి తినండి:

మీ పిల్లలకు కొన్ని ఇంటి పనులు చేయమని సూచించండి. మీ పిల్లలకు ఉదయాన్నే సమతులాహారం ఇవ్వండి. పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం అంటే మీ పిల్లలకు పోషకాహారం ఇవ్వడం మంచిది. పిల్లల్లో శారీరక బలాన్ని కలిగించి, రోజును సంతోషంగా ఉంచుతుంది.

పొద్దున్నే ఓపికగా ఉండండి:

మీకు ఎంత పని ఉన్నప్పటికీ ఓపికగా ఉండండి. కుటుంబ సభ్యులతో బాగా మాట్లాడండి. వారితో ఓపికగా ఉండండి. ప్రతిరోజూ ప్రేమతో వ్యవహరించడం నేర్పించండి. మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మంచి నడవడికను నేర్పించడం వల్ల వారు బలమైన, గౌరవప్రదమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి, సహానుభూతికి విలువ ఇవ్వడానికి సహాయపడుతుంది.

Whats_app_banner