Low Quality Parenting: డియర్ పేరెంట్స్! మీది లో-క్వాలిటీ పేరెంటింగా లేక గుడ్ పేరెంటింగా? ఓ సారి చెక్ చేసుకోండి
Low Quality Parenting: పేరెంట్స్ చేసే చిన్నచిన్నపొరబాట్లు కాలంతో పాటు ఎదిగి పిల్లల మనసులపై, వ్యక్తిత్వంపై గాఢమైన ప్రభావాన్ని చూపిస్తాయి. దీన్నే సైన్స్ భాషలో “లో-క్వాలిటీ పేరెంటింగ్” అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? గుడ్ పేరెంట్‌గా ఉండేందుకు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి!
చిన్నారులు మానసికంగా, ఎమోషనల్‌గా బలంగా పెరగాలంటే పేరెంటింగ్ విషయంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో మానసికంగా బలహీన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.ఎల్లప్పుడూ అభద్రతా భావంతో, ఏదో భ్రమలో బతికేస్తుంటారు.ఇలాంటి వ్యక్తిత్వంతో వారు చేసే పనులు పిల్లలపై, వారి భవిష్యత్తుపై పరోక్షంగా చాలా ప్రభావం చూపిస్తాయని గ్రహించేలేరు. ఇలా చిన్నారులపై ఎమోషనల్‌గానూ, మెంటల్‌గానూ దుష్ప్రభావం చూపించే పేరెంట్స్‌ను "లో-క్వాలిటీ పేరెంట్స్" అంటారు.
మరి మీరు మీ పిల్లల పట్ల ఎలా ఉంటున్నారు? మీది "లో- క్లాస్ పేరెంటింగ్" ఆ లేకపోతే గుడ్ పేరెంటింగ్‌గా తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి. మీరు కూడా ఒక గుడ్ పేరెంట్ కావాలనుకుంటే, ఇక్కడ వివరించిన కొన్ని పనులు చేయకుండా ఉండేందుకు ట్రై చేయండి.
లో క్వాలిటీ పెరెంటింగ్ లక్షణాలు ఎలా ఉంటాయి?
భావోద్వేగాల మధ్య ఇరుక్కుపోయి:
పేరెంట్స్ ఎమోషనల్‌గా ఎదుర్కొనే సమస్యలతో ఎప్పుడూ నలిగపోతూ పిల్లలను పట్టించుకోరు. ఎప్పుడ ఏదో ఒక బాధలో కనిపిస్తూ ఉంటే, పిల్లలు కూడా దగ్గరకు రారు. ఇదిలాగే కొనసాగితే, పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సిన సమయంలో మీరు చెప్పే మాటలకు విలువ ఇవ్వరు.
చర్చలు లేదా వాదనలకు దూరం:
పిల్లల భావాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఒక విషయం నచ్చడం లేదని పిల్లలు చెబితే దాని గురించి వాదనకు లేదా చర్చకు దిగరు. తమ పెద్దరికాన్ని ప్రదర్శించి నచ్చకపోయినా ఆ పని చేయాల్సిందేనని పట్టుబడతారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఫ్రస్ట్రేషన్‌కు గురి కావడంతో పాటు మీకు మరింత దూరం అయిపోయేలా చేస్తుంది.
క్రమశిక్షణా లోపం:
పేరెంటింగ్ బాధ్యతలను పక్కకుపెడుతూ క్రమశిక్షణను పట్టించుకోరు. అడపాదడపా అది చేయొద్దు, ఇది చేయొద్దని మాత్రమే గుర్తు చేస్తారు. ఫలితంగా చిన్నారులు వారి హద్దులను, బాధ్యతలను తెలుసుకోలేరు. ఈ క్రమశిక్షణా లోపం వల్ల అభద్రతా భావం పెరిగిపోవడంతో పాటు నిర్ణయం తీసుకోవడంలోనూ ఇబ్బందికి గురవుతారు చిన్నారులు.
మౌనం వహించడం:
పిల్లలను మానిప్యులేట్ చేయడానికి చాలా మంది వాడే పద్ధతి ఈ మౌనం వహించడం. ఇదే పద్ధతి కొనసాగిస్తూ పోతే పిల్లలపై మీకున్న ఎఫెక్షన్, మీరు ఏర్పరచుకోవాలనుకున్న కమ్యూనికేషన్ రెండూ దెబ్బతింటాయి.ఇది వారు పెద్దయ్యాక వారి ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుంది. వాళ్లపై అపనమ్మకంతో వ్యవహరిస్తూ ఇతరులపై ఆధారపడుతుంటారు.
పబ్లిక్‌గా తిట్టిపోయడం:
పబ్లిక్‌గా అందరిముందూ తిట్టిపోయడం వల్ల వారిపై వారికున్న నమ్మకం తగ్గిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ, వారు చేసే పని తప్పా కాదా అనే భయంతోనే గడిపేస్తుంటారు. ఇంకా ఈ కారణంగా సామాజికంగా ఇతరులతో కలవాలంటే కూడా భయపడిపోతారు.
అధికారం చూపించడం:
పేరెంట్స్ తాము పనిచేసే ప్రదేశంలో అధికారులను తిట్టిపోయడం, అవమానించడం వంటివి పిల్లల ముందు చేస్తే అపనమ్మకానికి బీజం పడుతుంది. వారు ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఇతరులపై ఎప్పటికీ నమ్మకం పెట్టుకోలేరు
ఎమోషనల్ డిపెండెన్సీ:
పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఆశిస్తుంటే, అది వారి ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తుంది. ఆందోళనతో కూడిన వ్యక్తిత్వానికి దారి తీసి ఎల్లప్పుడూ ఇతరుల సాయం అడిగేవారిగా తయారవుతారు.
ఎమోషన్స్‌పై సెన్సిటివిటీ:
యుక్త వయస్సుకు వచ్చిన పిల్లలు ఎమోషనల్ గా కాస్త తటపటాయిస్తుంటారు. ఆ సమయంలో వారికి ధైర్యంగా నిలబడాల్సిందిపోయి, అభద్రతా భావంతో కనిపిస్తే వారు ఏ బంధంలోనూ ఎక్కువకాలం నిలవలేరు.
పిల్లల కుతూహలాన్ని పట్టించుకోకపోవడం:
పిల్లలు అడిగే ప్రశ్నలకు, వారిలోని కుతూహలాన్ని పట్టించుకోకుండా పక్కకుపెడితే అది తీవ్రమైన మార్పులకు దారితీస్తుంది. మానసిక ఎదుగుదలను అడ్డుకోవడమే కాక లోపలి ఫీలింగ్స్ కూడా బయటపెట్టలేరు. ఇది కాలక్రమేణా వారిపై నమ్మకాన్ని తగ్గించేయడంతో పాటు ఓడిపోతామేమోననే భయాన్ని పెంచుతాయి.
గుడ్డి ప్రేమ:
పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారు? అనేవి తెలుసుకోకుండానే వారిపై ప్రేమ కురిపిస్తూ పోతే లాంగ్ టైంలో చిన్నారులకు సమస్యాత్మకంగా మారొచ్చు. ఎమోషనల్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హెల్తీ పేరెంటింగ్‌లో ఓపెన్ డిస్కషన్స్‌తో పాటు పరస్పర గౌరవం కూడా ఉండాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.