పిల్లలు తిండి అంటేనే మారం చేస్తున్నారా? ఇదిగోండి వాళ్ల ఆకలిని పెంచే 5 అదిరిపోయే ఐడియాలు!-parenting tips 5 engaging strategies to boost your childs appetite ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పిల్లలు తిండి అంటేనే మారం చేస్తున్నారా? ఇదిగోండి వాళ్ల ఆకలిని పెంచే 5 అదిరిపోయే ఐడియాలు!

పిల్లలు తిండి అంటేనే మారం చేస్తున్నారా? ఇదిగోండి వాళ్ల ఆకలిని పెంచే 5 అదిరిపోయే ఐడియాలు!

Ramya Sri Marka HT Telugu

మీ పిల్లలు తిండి అంటేనే వద్దని మారం చేస్తున్నారా? పూట పూటకీ వారికి తినిపించడం పెద్ద సమస్యగా మారిందా? అయితే ఈ 5 చిట్కాలు మీ కోసమే. వీటిని పాటించారంటే మీ పిల్లలు బాగా తింటారు. వారి ఆరోగ్యం, ఎదుగుదల రెండూ బాగుంటాయి.

పిల్లల్లో ఆకలిని పెంచే 5 ఐడియాలు (Shutterstock)

ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య పిల్లలకు తినిపించడం. పిల్లలు సరిగ్గా తినడం లేదిని, వారి ఆరోగ్యం ఎదుగుదల విషయంలో కంగారుగా ఉందని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సరైన పోషణ చాలా అవసరం. దీని కోసం వారు బాగా తినడం కూడా అవసరం. కాబట్టి పిల్లలకు తినిపించేందుకు తల్లిదండ్రులకు కుస్తీలు పడుతుంటారు.

మీరు కూడా అలాంటి తల్లిదండ్రులే అయితే ఈ చిట్కాలు మీ కోసమే. వీటిని ఉపయోగించడం ద్వారా మీ పిల్లల సులభతరం చేయవచ్చు. కాబట్టి పిల్లల ఆకలిని పెంచడానికి సహాయపడే కొన్ని ప్రభావవంతమైన మార్గాలను తెలుసుకుందాం రండి.

1. తినేటప్పుడు ఫోన్-టీవీలకు దూరంగా ఉంచండి

పిల్లలు తరచుగా తిననని మారాం చేస్తారు. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు వారి చేతిలో ఫోన్ లేదా టీవీ రిమోట్ పెట్టి తినిపస్తారు. ఈ ట్రిక్ ద్వారా పిల్లలు రెండు మూడు ముద్దలు తింటారు నిజమే. కానీ ఇది సరైన పద్దతి కాదు. ఈ సమయంలో వారి దృష్టి ఆహారంపై ఉండదు. ఇలాంటప్పుడు పిల్లలు కొన్నిసార్లు అతిగా తినేస్తారు. లేదంటే కడుపు నిండకుండానే అన్నం వదిలేస్తారు. కాబట్టి ఇలా కాకుండా చిన్నప్పటి నుండే కుటుంబంతో కలిసి కూర్చొని తినే అలవాటును వారిలో పెంపొందించండి. తద్వారా పిల్లలు శ్రద్ధగా తింటాడు ఆహారాన్ని ఆస్వాదిస్తాడు.

2. తినే సమయాన్ని నిర్ణయించండి

ఉదయం అయినా సాయంత్రం అయినా పిల్లలకు తినడానికి ఒక సమయాన్ని కేటాయించండి. ప్రతిరోజూ అదే సమయంలో వారికి ఆహారం ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారికి రోజూ అదే సమయంలో ఆకలిగా అనిపిస్తుంది. సమయానికి వారే మీ దగ్గరకు వచ్చి ఆహారం గురించి అడుగుతారు. నిజానికి పిల్లలకు ఒక దినచర్య ఉంటే వారి శరీర గడియారం కూడా అదే విధంగా సెట్ అవుతుంది.

3. ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకొండి, పిల్లల ఇష్టాన్ని కూడా పరిగణించండి

ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తినడం వల్ల కూడా పిల్లలు విసుగు చెందుతారు. అలాంటి సందర్భాలలో మీరు ఆహారంలో కొంత వైవిధ్యం తీసుకురండి. ఉదాహరణకు వారికి అప్పుడప్పుడూ వెరైటీలను చేసి పెట్టండి. బయట వారు ఇష్టంగా తినే ఆహారాన్ని ఇంట్లోనే మీరే చేసి పెట్టండి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆహారాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. ఇంటి ఆహారానికి అలవాటు పడతారు. వారి ప్లేటుతో పాటు ఆరోగ్యం కూడా కూడా శుభ్రంగా అవుతుంది.

4. పిల్లవాడిని చురుగ్గా ఉంచండి

పిల్లవాడు రోజంతా ఇంట్లోనే టీవీ లేదా ఫోన్ చూస్తూ కూర్చుంటే వారికి ఆకలిగా అనిపించదు. వారి ఎదుగుదలకు కూడా ఇది మంచిది కాదు. కాబట్టి చిన్నప్పటి నుండే పిల్లలను శారీరకంగా చురుగ్గా ఉంచే అలవాటును పెంపొందించండి. సాయంత్రం వేళల్లో కొన్ని గంటలు వారిని బయట ఆడుకోవడానికి పంపండి. వారి ఇంట్లోనే ఉండే మీరు వారితో చిన్న చిన్న వ్యాయామాలు లేదా డాన్స్ వంటి శారీరక శ్రమ చేయించవచ్చు. దీనివల్ల పిల్లల జీవక్రియ మెరుగుపడుతుంది, వారికి బాగా ఆకలిగా అనిపిస్తుంది.

5. మీ క్రియేటివిటీని ప్రదర్శించండి

ఇంటి ఆహారం విషయంలో పిల్లలు ముఖం చాటేయడం సహజమే. కానీ వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇందుకోసం చిన్న చిన్న ఐడయాలు మీకు చాలా సహాయపడతాయి. వారి ఆహారపు పళ్ళెంను అందంగా తయారు చేయాలి. వారికి ఇష్టమైన బయటి ఆహారంతో కొంచెం పోలి ఉండేలా చేయాలి. ఉదాహరణకు రోటీలో చీజ్ వేసి రోల్ చేయడం, పప్పులో వెన్న, చాట్ మసాలా చల్లడం, పరాఠా లేదా చిల్లాకు ఆకర్షణీయమైన ఆకారం ఇవ్వడం, వివిధ రకాల సాస్‌లు, కెచప్‌లను ఉపయోగించడం వంటివి చేయాి. సలాడ్ చేస్తున్నట్లయితే కూరగాయలను అందమైన ఆకారంలో కట్ చేయడం. ఇలాంటి కొన్ని సృజనాత్మక ఉపాయాలు ట్రై చేయండి. ఇవి పిల్లల్లో తినాలనే కోరిక, ఆకలిని కలిగిస్తాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.