పారాచ్యూట్ అడ్వాన్స్‌డ్ జాస్మిన్, #BiggestSportingCarnivalలో జ్యోతి యర్రాజీ షైన్ కావడానికి మద్దతుగా నిలుస్తోంది
HT బ్రాండ్ స్టూడియో/స్పాన్సర్డ్ పోస్ట్: మనషిలోని సమర్ధత శక్తికి, క్రీడాకారిణి జ్యోతి యర్రాజి జీవితం ఒక నిజమైన రుజువు. నిరాడంబరమైన నేపధ్యాన్ని కలిగిన ఈ యువతి, ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా కార్యక్రమంలో అత్యుత్తమ క్రీడాకారిణిగాషైన్ అయింది.
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించిన 24 సంవత్సరాల జ్యోతి యర్రాజీ భారతదేశం ఇప్పటివరకు చూసిన హర్డ్‌లర్‌లలో ఉత్తమమైన హర్డ్‌లర్. ఆమె జీవన ప్రయాణం లక్షలాది మందికి ప్రేరణ కలిగిస్తుంది - తన చిన్నతనంలోనే ఆమె ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది, కానీ ఆమె చలించని పట్టుదల ఆమెను విజయవంతమైన క్రీడాకారిణినిగా చేసింది, జీవితంలో ఆమె మార్గంలో ఎదురైన ప్రతి ఇబ్బందిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. యర్రాజి తన జీవితంలో అన్నీ దశలలోషైన్అయింది, దీనినే ఒక బ్రాండ్‌గా పారాచ్యూట్ అడ్వాన్స్‌డ్ జాస్మిన్#ShineBejhijak (సంకోచం లేకుండాషైన్ అవడం) ద్వారా ప్రోత్సహిస్తుంది. అందుకే పారాచ్యూట్ అడ్వాన్సెడ్ జాస్మిన్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఆమెతో కలిసి పని చేయాలని నిర్ణయించుకుంది.
ప్రారంభ సవాళ్లను అధిగమించడం
యర్రాజి ఆగస్ట్ 28, 1999లో పరిమిత ఆదాయం కలిగిన ఒక కుటుంబంలో జన్మించింది. ఆమె మొదటి రోల్ మోడల్ - తన తల్లి కుమారి - ఆమె తన జీవితంపై చెరిగిపోని ముద్రను వేశారు, జీవనోపాధి కోసం ఆమె విశాఖపట్నంలోని ఒక హాస్పిటల్‌లో క్లీనర్‌గా మరియు ఇళ్ళలో పని మనిషిగా పని చేసేవారు. తన తండ్రి, సూర్యనారాయణ, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసేవారు.
ఆమె భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని, తన తల్లిదండ్రులు ఆమెను వైజాగ్‌లోని పోర్ట్ హైస్కూల్ కృష్ణలో చేర్పించారు. హర్డ్‌లర్‌గా తన నైపుణ్యం మరియు సామర్ధ్యాలను ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇక్కడే గుర్తించారు. మొదటి అంతర-జిల్లా మీట్‌లో గెలిచిన తరువాత, ఆమె జూనియర్ మరియు సీనియర్ జాతీయ పోటీలలో గెలుపొందడం కొనసాగించింది, చివరిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న మరియు ద్రోణాచార్య అవార్డును అందుకున్న కోచ్ ఎన్. రమేష్ వద్ద శిక్షణ పొందడానికి హైదరాబాద్ SAI సెంటర్‌కు వచ్చింది.
ప్రతికూలతల మధ్య ప్రకాశించడం
హైదరాబాద్ SAI సెంటర్‌లో రెండు సంవత్సరాల కఠిన శిక్షణ అనంతరం, గుంటూరులోని సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ నుండి గ్రాడ్యుయేట్ కావడం యర్రాజికి సంతోషాన్ని కలిగించింది. అయితే, ఈ కేంద్రాన్ని హఠాత్తుగా మూసివేయడం ఆమెకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. 2019లో ఆమె, బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ నుండి శిక్షణ పొందటానికి ఒరిస్సా రిలయెన్స్ అథ్లెటిక్స్ హై-పర్ఫార్మెన్స్ సెంటర్‌లో చేరింది. అతని మార్గదర్శకంలో, జనవరి 2020లో, 13.03 సెకన్‌ల టైమింగ్‌తో ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్‌లో ఆమె స్వర్ణం గెలిచింది.
100మీ ట్రాక్ పై మెరుగైన ప్రదర్శన
క్రీడాకారిణిగానే కాకుండా, యర్రాజి, తన తీరిక లేని శిక్షణ షెడ్యూళ్ళ మధ్య ప్రశాంతతను మరియు సమతుల్యతను అందించే పెయింటింగ్ హాబీని ఆస్వాదిస్తుంది. ఆమె బహుముఖ వ్యక్తిత్వం ఆమెను భారతదేశంలోని యువతులకు ప్రేరణనందించే వ్యక్తిగా చేస్తుంది. ఈ సృజనాత్మక ప్రయత్నం, తీవ్రమైన తయారీ మరియు పోటీ మధ్య కూడా ఆనందం మరియు ప్రశాంతతను పొందగలిగిన ఆమె సామర్ధ్యాన్ని హైలైట్ చేస్తుంది.
పారాచ్యూట్ అడ్వాన్స్‌డ్ జాస్మిన్ అనుబంధం
ప్రేరణ కలిగించే యర్రాజి ప్రయాణం, పారాచ్యూట్ అడ్వాన్సెడ్ జాస్మిన్ పాటించే ప్రధాన విలువలకు అనుగుణంగా ఉంటుంది, ఇది ఈ బ్రాండ్‌కు ఆమెను ఆకర్షణీయమైన ప్రతినిధిగా చేస్తుంది. పారాచ్యూట్ అడ్వాన్స్‌డ్ జాస్మిన్, యర్రాజిని ఎందుకు ఎంచుకుంది అనే విషయంపై మాట్లాడుతూ, Marico CMO, సోమశ్రీ బోస్ అవస్తి ఇలా అన్నారు: "అతి పెద్ద క్రీడా వేదిక పై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక క్రీడాకారిణి ప్రయాణాన్ని గుర్తించాలని పారాచ్యూట్ అడ్వాన్సెడ్ జాస్మిన్ భావిస్తోంది. ఆమె ప్రయాణాన్ని, ఆమె అనేక పాత్రలను మరియు రూపాలను, ఆ రూపాలలో ఆమె షైన్ అయినందుకు ఇప్పుడు అభినందిద్దాం. ఇప్పుడు ఆమె మరింత పెద్ద వేదికపై#ShineBejhijhak కోసం సిద్ధంగా ఉంది."
తన ఆత్మవిశ్వాసానికి తను కనిపించే తీరు దోహదపడేలా యర్రాజి వివిధ హెయిర్ స్టైల్‌లతో ప్రయోగం చేస్తుంది. "భారతీయ మహిళల అందం విషయంలో శిరోజాలు అందం ప్రాముఖ్యమైనది. వారి జుట్టు అందంగా ఉన్నప్పుడు, వారిలో ఆత్మవిశ్వాస భావన అధికంగా ఉంటుంది. ఇది#ShineBejhijhak ఫిలాసఫీ – ప్లాట్ؚఫార్మ్, బ్రాండ్ గురించి ఇలాగే ఆలోచించింది. మేము జ్యోతితో భాగస్వాములం కావాలని అనుకున్నాము, ఎందుకంటే తన ప్రయాణం బ్రాండ్ విలువను ప్రతిబింబిస్తుంది, ఆమె ప్రయాణం దేశంలోని వేల మంది యువతులకు ప్రేరణ కలిగిస్తుంది. మేము ఆమె కథను మరియు ఉన్నత ప్రదర్శనను అందించే క్రీడాకారిణిగా ఆమె తయారుకావడం వెనుక ఉన్న కథను తెలియచేయాలనుకున్నాము. ప్రతి అవరోధం వద్ద ఆత్మవిశ్వాసంతో ఉండాలని, షైన్ కావాలని ఆమె నిర్ణయించుకున్నందు వలన ఇది సాధ్యమైంది - ఇది #ShineBejhijhak వెనుక ఉన్న బ్రాండ్ ఫిలాసఫీ" అని అవస్తి అన్నారు.
అందుకే, #BiggestSportingCarnivalలో 100మీ హర్డిల్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే మొదటి భారతీయ మహిళ కావడానికి జ్యోతి సిద్ధమవుతుండగా, అందరం కలిసి ఆమెను ప్రోత్సహిద్దాము. వీడియోకు కామెంట్ చేయడం ద్వారా D-డే కంటే ముందు మీరు యర్రాజికి శుభాకాంక్షలు తెలుపవచ్చు. వీడియోని ఇక్కడ చూడండి.
(డిస్‌క్లెయిమర్: ఈ ఆర్టికల్, బ్రాండ్ తరఫున HT బ్రాండ్ స్టూడియో రూపొందించింది. దీనిలో హిందూస్తాన్ టైమ్స్ జర్నలిస్ట్‌లు లేదా ఎడిటోరియల్ వారిజోక్యం లేదు)