Paneer Paratha: సండే స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ పనీర్ పరాటా, రెసిపీ అదిరిపోతుంది
Paneer Paratha: పనీర్‌తో చేసిన వంటకాలు టేస్టీగా ఉంటాయి. పనీర్‌తో పరాటా చేస్తే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. పనీర్ పరాటా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం.

Paneer Paratha: పనీర్ తో చేసిన వంటకాలు పెద్దలకు, పిల్లలకు ఎంతో నచ్చుతాయి. పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్, పనీర్ పకోడి ఇలా అనేక రకాల వంటకాలు దీనితో వండుతారు. ఒకసారి పనీర్ పరాటా కూడా చేసుకుని తినండి. ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. అల్పాహారంలో పనీర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పనీర్ పరాటాను బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు, డిన్నర్లో కూడా ఇది మంచి రెసిపీ. దీన్ని సులువుగా ఎలా చేయాలో చూద్దాం.
పనీర్ పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పనీర్ ముక్కలు - వంద గ్రాములు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
గోధుమ పిండి - ఒక కప్పు
నీరు - సరిపడా
కొత్తమీర తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - అర స్పూను
పనీర్ పరాటా రెసిపీ
1. పనీర్ తో చేసే పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వండడం చాలా సులువు.
2. పనీర్‌ను సన్నగా తరిగి మిక్సీ జార్లో వేయాలి. ఆ మొత్తాన్ని తీసి ఒక గిన్నెల్లో వేయాలి.
3. ఆ గిన్నెలో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
4. ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత గోధుమపిండి వేసి బాగా కలపాలి.
5. గోధుమపిండి చపాతీ పిండిలా వేసి బాగా కలపాలి. మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టండి.
6. ఇప్పుడు చపాతీ పిండి నుంచి చిన్న బాల్ ను తీసుకుని ఒత్తాలి.
7. చపాతీ మధ్యలో పనీర్ మిశ్రమాన్ని ఉంచి చపాతీ పిండితో కప్పేయాలి.
8. ఇప్పుడు దీన్ని పరాటాలా ఒత్తుకుని పెనంపై నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
9. అంతే టేస్టీ పనీర్ పరాటా రెడీ అయినట్టే.
పనీర్ తో చేసిన వంటకాలు టేస్టీగా ఉంటాయి. పనీర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పనీర్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు పనీర్ ను తినవచ్చు. అల్పాహారంలో పనీర్ తింటే ఎక్కువ కాలం పాటూ ఆకలి వేయకుండా ఉంటుంది. పనీర్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మెదడు ఆరోగ్యానికి పనీర్ తినడం చాలా అవసరం.
ఒత్తిడి, మానసిక ఆందోళలను తగ్గించుకోవడానికి పనీర్ తరచూ తింటూ ఉండాలి. ఎముకలు, దంతాలు బలంగా ఉండాలన్నా వారానికి రెండు నుంచి మూడు సార్లు పనీర్ తింటూ ఉండాలి. శాఖాహారులకు పనీర్ తినడం చాలా అవసరం. వారికి పుష్కలంగా ప్రొటీన్ అందాలంటే పనీర్ తినాల్సిందే.
డయాబెటిస్ ఉన్న వారికి పనీర్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు మధుమేహులకు మేలే జరుగుతుంది. గుడ్డు తింటే ఎన్ని లాభాలో పనీర్ తినడం వల్ల కూడా అన్ని లాభాలు కలుగుతాయి.
టాపిక్