Paneer Pakora: పనీర్ పకోడీ ఇలా చేశారంటే నోరూరిపోతుంది, ఇదిగో సింపుల్ రెసిపీ-paneer pakora recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Pakora: పనీర్ పకోడీ ఇలా చేశారంటే నోరూరిపోతుంది, ఇదిగో సింపుల్ రెసిపీ

Paneer Pakora: పనీర్ పకోడీ ఇలా చేశారంటే నోరూరిపోతుంది, ఇదిగో సింపుల్ రెసిపీ

Haritha Chappa HT Telugu
Feb 22, 2024 03:32 PM IST

Paneer Pakora: ఎప్పుడూ ఒకేలా పకోడీని చేస్తే కొత్త ఏముంటుంది? ఒకసారి పనీర్ పకోడీ చేసి చూడండి. దీన్ని చూస్తేనే నోరూరి పోతుంది. ఈ రెసిపీ కూడా చాలా సులువు.

పనీర్ పకోడి రెసిపీ
పనీర్ పకోడి రెసిపీ (youtube)

Paneer Pakora: పనీర్ తో చేసిన వంటకాలు టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా శాఖాహారులకు ప్రోటీన్ పుష్కలంగా అందాలంటే పనీర్ వంటకాలనే తినాలి. పనీర్ బిర్యానీ, చిల్లీ పనీర్, పనీర్ 65 లాంటివే కాదు... ఇంట్లోనే తయారు చేసుకునే పనీర్ పకోడీని ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. పనీర్ త్వరగా ఉడికిపోతుంది, కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు. పనీర్ పకోడీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

పనీర్ పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ ముక్కలు - ఒక కప్పు

నూనె - వేయించడానికి సరిపడా

శెనగ పప్పు - రెండు కప్పులు

కారం - ఒక స్పూను

వెల్లుల్లి పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పనీర్ పకోడీ రెసిపీ

1. పనీర్‌ను పెద్ద ముక్కలుగా కాకుండా, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.

2. వాటిని ఒక పెద్ద గిన్నెలో వేయండి. ఆ గిన్నెలో శెనగపిండి, ఉప్పు, కారం, వెల్లుల్లి పొడి వేసి బాగా కలుపుకోండి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.

4. నూనె వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న పనీర్ ముక్కలను వేసి వేయించాలి.

5. అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.

6. ఈ పనీర్ పకోడీలు పుదీనా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి ప్రయత్నించండి. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు.

పనీర్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పనీరు తినాల్సిన అవసరం ఉంది. మాంసాహారులకు చికెన్, గుడ్లు ద్వారా ప్రోటీన్ అందుతుంది. కానీ శాకాహారులకు పనీర్ ద్వారానే ఎక్కువగా ప్రోటీన్ అందుతుంది. పనీర్ తినడం ద్వారా బరువు కూడా తగ్గవచ్చు. పనీర్ వంటకాలు కొంచెం తిన్నా కూడా త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలు ఏవి తినకుండా ఉంటారు.

పనీర్ తినడం వల్ల ఇది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో పనీర్ ముందు ఉంటుంది. పిల్లలకు పనీరు తినిపించడం చాలా అవసరం. ఎదుగుతున్న పిల్లల్లో ఎముకలు బలంగా మారేందుకు ఇది సహకరిస్తుంది. ఒక్కసారి పనీర్ తో పకోడీ చేసుకుని తినండి ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. వారానికి పనీర్ వంటకాలను కనీసం రెండుసార్లు తినాల్సిన అవసరం ఉంది.

పనీర్ తో వండిన వంటకాలు తరచూ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు పనీర్ తినడం అలవాటు చేసుకోండి. థైరాయిడ్ తో బాధపడేవారు తరచూ పనీర్ తినడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. పనీర్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కాబట్టి అంత త్వరగా వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి.

WhatsApp channel

టాపిక్