Paneer Kalakand: పనీర్‌తో కలాకండ్ స్వీట్ ఇలా సింపుల్‌గా చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది-paneer kalakand recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Kalakand: పనీర్‌తో కలాకండ్ స్వీట్ ఇలా సింపుల్‌గా చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది

Paneer Kalakand: పనీర్‌తో కలాకండ్ స్వీట్ ఇలా సింపుల్‌గా చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Published Mar 01, 2024 03:30 PM IST

Paneer Kalakand: పనీర్‌తో టేస్టీ కూరలే కాదు, తీయని స్వీట్లు కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా ఇంట్లోనే పనీర్ కలాకండ్ చేసి చూడండి. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.

పనీర్ కలాకండ్ రెసిపీ
పనీర్ కలాకండ్ రెసిపీ (Nestlé Milkmaid/Youtube)

Paneer Kalakand: శాకాహారులకు పనీర్ తినడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. పనీర్‌తో ఎప్పుడూ పనీర్ బిర్యాని, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ వంటి కూరలే కాదు, పనీర్ కలాకండ్ వంటి స్వీట్లు కూడా చేసుకోవచ్చు. వీటిని చాలా సింపుల్‌గా తక్కువ సమయంలోనే చేయొచ్చు. సాయంత్రం పూట పిల్లలకు పెట్టే స్నాక్‌గా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పనీర్ తినడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పనీర్ కలాకండ్ చేయడం చాలా సింపుల్. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

పనీర్ కలాకండ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పనీర్ - 300 గ్రాములు

పంచదార - రెండు కప్పులు

పాలపొడి - మూడు కప్పులు

యాలకుల పొడి - ఒక స్పూను

తాజా క్రీము - మూడు కప్పులు

బాదం, పిస్తాలు - గుప్పెడు

పనీర్ కలాకండ్ రెసిపీ

1. లోతుగా ఉండే కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. చిన్న మంట మీద పెట్టాలి.

2. తురిమిన పనీర్, పంచదార, ఫ్రెష్ క్రీము, పాల పొడి వేసి కలపాలి.

3. పెద్ద మంట పెడితే ఇది మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్న మంట మీదే ఉంచి గరిటతో కలుపుతూ ఉండాలి.

4. తరువాత స్టవ్ కట్టేయాలి. పైన యాలకుల పొడిని చల్లుకోవాలి.

5. ఇప్పుడు పెద్ద ప్లేటును తీసుకొని అడుగున నెయ్యి రాయాలి.

6. ఈ మొత్తం పనీర్ మిశ్రమాన్ని అందులో వేయాలి.

7. పైన తురిమిన బాదం, పిస్తాలను చల్లుకోవాలి. కాసేపు చల్లారనివ్వాలి.

8. తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే పనీర్ కలాకండ్ రెడీ అయినట్టే.

9. దీన్ని చేయడం చాలా సులువు. కలాకండ్ మంచి వాసన రావాలంటే రోజ్ ఎసెన్స్‌ను కూడా కలపండి.

10. మీకు తినాలనిపిస్తే కేవలం బాదం పిస్తాలే కాదు జీడిపప్పు, కిస్ మిస్‌లు, ఇతర పండ్ల తరుగులను పైన చల్లుకోవచ్చు.

11. ఈ కలాకండ్ చాలా టేస్టీగా ఉంటుంది. 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎవరైనా అతిథులు ఇంటికి వస్తున్నప్పుడు దీన్ని చేసి పెడితే టేస్టీగా ఉంటుంది.

మాంసాహారులు చికెన్ తినడం ఎంత ముఖ్యమో, శాఖాహారులు పనీరు తినడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటిలోనూ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పనీర్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ డి ఎంతో కొంత అందుతుంది. కాబట్టి ఎముకలు దృఢంగా ఉంటాయి. మహిళలు కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పనీర్ ఒకటి. దీన్ని తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పనీర్ తినడం వల్ల చర్మం యవ్వనంతో మెరిసిపోతుంది. జీర్ణ క్రియ మెరుగ్గా ఉండాలంటే పనీర్‌తో చేసిన వంటకాలు తినడం చాలా ముఖ్యం. పిల్లలకు వారానికి ఒక్కసారైనా పనీర్ వంటకాలను తినిపించండి. పనీర్ వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. వీటిని తింటే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇతర ఆహారాలు తినాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి పనీర్ వంటకాలు తిన్నాక చాలాసేపు పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఈ రెసిపీ చాలా సులువు. పాలతో చేసిన కలాకండ్‌లాగే... పనీర్ కలాకండ్ నోరూరించేలా ఉంటుంది.

Whats_app_banner