Paneer Bhurji: టేస్టీ పన్నీర్ బుర్జీ ఇలా చేశారంటే అద్భుతంగా ఉంటుంది ప్రయత్నించండి-paneer bhurji recipe in telugu know how to make this paneer curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Bhurji: టేస్టీ పన్నీర్ బుర్జీ ఇలా చేశారంటే అద్భుతంగా ఉంటుంది ప్రయత్నించండి

Paneer Bhurji: టేస్టీ పన్నీర్ బుర్జీ ఇలా చేశారంటే అద్భుతంగా ఉంటుంది ప్రయత్నించండి

Haritha Chappa HT Telugu

Paneer Bhurji: చికెన్ కీమా, మటన్ కీమా, ఎగ్ బుర్జీలాగే పనీర్ బుర్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. శాఖాహారులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.

పనీర్ బుర్జీ రెసిపీ

పనీర్ తో చేసే వంటకాలు ఏవైనా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఎప్పుడూ పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ వంటివే కాదు ఒకసారి పనీర్ బుర్జీ కూడా ట్రై చేయండి. దీన్ని రోటి, చపాతీలతో తింటే అద్భుతంగా ఉంటుంది. దీన్ని రుచిగా సులువుగా ఎలా చేయాలో చెప్పాము. ప్రయత్నించి చూడండి. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

పనీర్ బుర్జీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ తురుము - ఒక కప్పు

నూనె - మూడు కప్పులు

బటర్ - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

శెనగపిండి - ఒక స్పూను

టమోటో - ఒకటి

పసుపు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

కసూరి మేతి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - అర గ్లాసు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - ఒక స్పూను

పనీర్ బుర్జీ రెసిపీ

1. పనీర్ బుర్టీ చేసేందుకు పనీర్ మొదట సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. అలాగే బటర్ ను కూడా వేయాలి. అందులో జీలకర్రను వేసి వేయించాలి.

4. తర్వాత ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

5. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి బాగా కలుపుకోవాలి.

6. శెనగపిండి, కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇందులోనే టమోటో తరుగును వేసి బాగా మగ్గనివ్వాలి.

8. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

9. టమోటాలు మెత్తగా ఉడికాక అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

10. గరం మసాలా కూడా వేసి బాగా కలపాలి.

11. అర గ్లాసు నీటిని వేసి పైన మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి.

12. తర్వాత మూత తీసి పనీర్ తురుమును అందులో వేసి బాగా కలుపుకోవాలి.

13. పది నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి.

14. ఆ తర్వాత మూత తీసి ఇది చిక్కగా అవుతున్నప్పుడు కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి.

15. అంతే పనీర్ బుర్జీ రెడీ అయినట్టే. దీన్ని చపాతీ, రోటీల్లోకి తింటే అద్భుతంగా ఉంటుంది.

పనీర్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా వండడం వల్ల మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చపాతీ, రోటిల్లోకి ఇది అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్ తిని చూడండి. మీకు నచ్చడం ఖాయం.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం