Paneer Bhurji: ఎగ్ బుర్జీలాగే పనీర్ బుర్జీ చేసి చూడండి, చపాతీ, రోటీతో అదిరిపోతుంది-paneer bhurji recipe in telugu know how to make this dish ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Bhurji: ఎగ్ బుర్జీలాగే పనీర్ బుర్జీ చేసి చూడండి, చపాతీ, రోటీతో అదిరిపోతుంది

Paneer Bhurji: ఎగ్ బుర్జీలాగే పనీర్ బుర్జీ చేసి చూడండి, చపాతీ, రోటీతో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 14, 2024 05:45 PM IST

Paneer Bhurji: ఇంట్లో రాత్రిపూట చపాతీ, రోటీలను తినేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ఎప్పుడూ ఒకేలాంటి కూరలు కాకుండా ఒకసారి పనీర్ బుర్జీని చేసి చూడండి. ఎగ్ బుర్జీలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

పనీర్ బుర్జీ రెసిపీ
పనీర్ బుర్జీ రెసిపీ

Paneer Bhurji: ఎంతోమంది శాకాహారులకు పనీర్ అంటే ప్రాణం. అయితే పనీరును ఎప్పుడూ ఒకేలా వండే కన్నా ఒకసారి డిఫరెంట్‌గా వండుకొని చూడండి. పనీర్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, చపాతీల్లోకి అదిరిపోతుంది. అలాగే అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది. నాన్ వెజ్ ప్రియులకు కూడా ఈ పనీరు బుర్జీ టేస్ట్ నచ్చుతుంది. ఎగ్ బుర్జీలాగే పనీర్ బుర్జీని రుచిగా చేసుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. పనీర్ బుర్జీ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

yearly horoscope entry point

పనీర్ బుర్జీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పనీర్ ముక్కలు - రెండు వందల గ్రాములు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

అల్లం తరుగు - ఒక స్పూను

టమోటోలు - రెండు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - సరిపోయినంత

నూనె - రెండు స్పూన్లు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - రెండు

బిర్యానీ ఆకు - ఒకటి

మిరియాల పొడి - ఒక స్పూను

పసుపు - చిటికెడు

గరం మసాలా - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

పనీర్ బుర్జీ రెసిపీ

1. పనీర్ ను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. నూనెలో బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేయించాలి.

4. ఆ తర్వాత తురిమిన అల్లాన్ని, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.

5. అవి బాగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారేవరకు వేయించాలి.

6. తర్వాత సన్నగా తరిగిన టమోటాలను వేసి వేయించుకోవాలి.

7. టమోటాలు మూత పెడితే మెత్తగా ఉడుకుతాయి.

8. అలా ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

9. అవన్నీ బాగా ఉడికాక పనీర్ తురుమును వేసి రెండు నిమిషాలు చిన్న మంట మీద వేయించాలి.

10. తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి.

11. పనీర్ బుర్జిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

12. ఇది చాలా త్వరగానే ఉడుకుతుంది.

13. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేస్తే పన్నీర్ బుర్జీ రెడీ అయినట్టే.

14. దీన్ని చపాతీతో తిన్నా, రోటితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.

15. ఎంతోమంది దీన్ని అన్నంతో తినడాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు.

శాకాహారులు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పనీర్ ఒకటి. దీనిలో నిండుగా కాల్షియం, ప్రోటీన్ ఉంటుంది. మీరు వారానికి కనీసం రెండు మూడు సార్లు పనీర్ తినడం వల్ల ప్రోటీన్ లోపం, కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. మాంసాహారులకు చికెన్, గుడ్లలో ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి శాఖాహారులు ప్రోటీన్ కోసం పనీర్ తింటే మంచిది.

బరువు తగ్గడానికి కూడా పనీర్ వంటకాలు సహాయపడతాయి పనీర్‌ను మితంగా తింటే బరువు తగ్గడం సులువు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు పనీర్ సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు దీంతో వండిన వంటలను తరచూ తినాలి. అలాగే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది.

ఎముకలు, దంతాలు బలంగా మారేందుకు సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యానికి, మెదడు చక్కగా పనిచేసేందుకు పనీర్ చాలా అవసరం. ఒత్తిడి ఆందోళనతో బాధపడేవారు పనీర్‌ను ఆహారంలో చేర్చుకుంటే మేలు జరుగుతుంది. పనీర్ బిర్యాని, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ వంటివే కాదు, అప్పుడప్పుడు పనీర్ బుర్జీ లాంటివి చేసుకుంటే కొత్తగా, రుచిగా ఉంటుంది.

Whats_app_banner