కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సంకేతం కావొచ్చు!-pancreatic cancer sensations in the legs that could hint at a fatal tumour
Telugu News  /  Lifestyle  /  Pancreatic Cancer: Sensations In The Legs That Could Hint At A Fatal Tumour
pancreatic cancer
pancreatic cancer

కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సంకేతం కావొచ్చు!

19 May 2022, 23:38 ISTHT Telugu Desk
19 May 2022, 23:38 IST

ప్యాంక్రియాస్ శరీర భాగాలలో అతి ముఖ్యమైన భాగం. ఇది బాడీలో పొడవైన గ్రంథి. రక్తంలో చక్కెర నియంత్రణలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది ప్యాంక్రియాస్ క్యాన్సర్‌తో బాధపడుతన్నారు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది శాశ్వత నివారణ లేని వ్యాధి. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా, శరీరంలోని కణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్రమంగా అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా కొంత వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లు ఉన్నప్పటీకి, వీటిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా చాలా ప్రమాదకరమైనది. ప్యాంక్రియాస్ క్యాన్సర్‌ను అరంభంలో గుర్తించడం చాలా కష్టమని నిపుణులు చెబు తున్నారు. కొన్ని లక్షణాల ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చని అంటున్నారు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు

క్యాన్సర్ సొసైటీ ప్రకారం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల రక్తం హైపర్ కోగ్యులేటివ్ దశకు చేరుకుంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో ప్రారంభమయ్యే ప్రాథమిక దశ .  ఈ క్యాన్సర్‌ అరంభంలో కాలు భాగంలోని రక్తం గడ్డకడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్  మొదటి లక్షణం ఇదే. సిరల్లో రక్తం గడ్డకట్టే దశను డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. 

ఒళ్ళు నొప్పులు, వాపు, పాదాల ఎరుపు, వెచ్చగా ఉండడం ఈ క్యాన్సర్ లక్షణాలు. కొన్ని సందర్భాల్లో, రక్తం గడ్డకట్టడం వల్ల అవి ఊపిరితిత్తులకు  చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండవచ్చు. ఈ పరిస్థితిని పల్మనరీ ఎంబోలిజం (PE) అని పిలుస్తారు. ఇది మరణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

శరీరంలో రక్తం గడ్డలు కనిపించినంత మాత్రన, వారికి క్యాన్సర్ ఉందని అర్థం కాదు. అనేక సందర్భాల్లో, ఇతర కారణాల వల్ల రక్తం గడ్డకడుతుంది. ఇటీవలి పరిశోధన ప్రకారం, ఈ క్యాన్సర్‌ ఉన్నవారిలో దాదాపు 70 శాతం మందికి తమ రక్తం గడ్డకట్టినట్లు తెలియదు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలలో బరువు తగ్గడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పటీకి వీటి కారణంగా గుర్తించడం కష్టం. అలాగే ప్యాంక్రియాస్ బయాప్సీ ద్వారా కూడా దీన్ని చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. అజీర్ణం, అసిడిటీ వంటి సాధారణ లక్షణాలు కూడా క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తుంది.

సంబంధిత కథనం