నోరు దుర్వాసన వంటి సమస్యలు చాలా మందిలో ఉంటుంది. నోరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోపోతే ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్ కణజాలాలలో ప్రారంభమవుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తించడం కష్టం. ఇది తీవ్రంగా మారాక దీని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వారికి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. చర్మం పసుపు రంగులోకి మారడం, ఎగువ పొట్టపై కడుపు నొప్పి రావడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, చర్మం దురద పెట్టడం, వికారం, అలసట వంటి లక్షణాలను ఇది చూపిస్తుంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదంతో పోరాడటానికి దోహదపడే కారకాలను గుర్తించడం చాలా ముఖ్యం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నోటి బ్యాక్టీరియాలు కూడా పెంచుతాయి. నోటిలో చేరిన బ్యాక్టీరియా తీవ్రంగా ఇన్ ఫ్లమ్మేషన్‌ను ప్రేరేపిస్తుంది, ఇది వివిధ క్యాన్సర్లకు కారణం అవుతుంది.
కొన్ని పరిశోధనల్లో నోటి బ్యాక్టీరియా శరీరంలో చేరి ప్యాంక్రియాటిక్ కణాలకు నేరుగా హాని కలిగిస్తుందని సూచిస్తున్నాయి. ఇది క్యాన్సర్ అభివృద్ధిని మరింత ప్రేరేపిస్తుంది. కాబట్టి నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్యాంక్రియాస్లో నోటి బ్యాక్టీరియా ఉండటం క్యాన్సర్ కణాల పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వివిధ జన్యు, పర్యావరణ, జీవనశైలి కారకాలచే ప్రభావితమయ్యే ఒక సంక్లిష్ట వ్యాధి. ధూమపానం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, డయాబెటిస్, ఊబకాయం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర కూడా ఈ క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
బీటా నాఫ్థైలమైన్, బెంజిడిన్, పురుగుమందులు, ఆస్బెస్టాస్, బెంజీన్ వంటి రసాయనాలు, భారీ లోహాలకు గురికావడం వల్ల కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదానికి దోహదం చేస్తుంది. కాబట్టి వీలైనంతగా నోటి పరిశుభ్రతను పాటించాలి.
శారీరక శ్రమలో పాల్గొనని వ్యక్తుల కంటే శారీరక కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ.
టాపిక్