Pancharatna Dosa: అద్భుతమైన అల్పాహారం అంటే ఇదే, పంచరత్న దోసను మీరెప్పుడైనా ట్రై చేశారా?-pancharatna dosa this is what an amazing breakfast is all about have you ever tried pancharatna dosa ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pancharatna Dosa: అద్భుతమైన అల్పాహారం అంటే ఇదే, పంచరత్న దోసను మీరెప్పుడైనా ట్రై చేశారా?

Pancharatna Dosa: అద్భుతమైన అల్పాహారం అంటే ఇదే, పంచరత్న దోసను మీరెప్పుడైనా ట్రై చేశారా?

Ramya Sri Marka HT Telugu

Pancharatna Dosa: టిఫిన్ చేసేందుకు చాలా ఆలోచిస్తుంటాం. ఎందుకంటే, ఉదయం తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండాలనే కదా ఎవరైనా కోరుకునేది. మరి ఈ పంచరత్న దోసలో ఉండే ఐదు రకాల పప్పులు ఎన్ని పోషకాలు అందిస్తాయో అంచనా వేశారా.. అంతేకాదు టేస్ట్ లో కూడా ఇది సూపర్ అంతే.

అద్భుతమైన అల్పాహారం అంటే ఇదే, పంచరత్న దోసను మీరెప్పుడైనా ట్రై చేశారా

ఐదు రకాలైన పప్పులు, బియ్యంతో కలిపి తయారు చేసుకునే ఈ టిఫిన్ చాలా రుచికరమే కాదు పోషకాహారం కూడా. బ్రేక్ ఫాస్ట్ లోనూ, స్నాక్స్ లోనూ తినడానికి ఇది చాలా మంచి ఆప్షన్ కూడా. నానబెట్టుకున్న పప్పులను పిండిగా చేసుకుని రాత్రంతా ఉంచిన తర్వాత ఉదయాన్నే దోస వేసుకుని తింటుంటే, సూపర్బ్ అనిపిస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

  • మినపప్పు - 1/2 కప్పు
  • శెనగపప్పు - 1/4 కప్పు
  • కందిపప్పు - 1/4 కప్పు
  • పెసరపప్పు - 1/4 కప్పు
  • ఎర్ర కందిపప్పు - 1/4 కప్పు
  • బియ్యం - 1 కప్పు
  • బియ్యపు పిండి - ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె

తయారీ విధానం:

  1. పప్పులను, బియ్యాన్ని కడిగి కనీసం 4 గంటల సేపు నాననివ్వాలి. కుదిరితే రాత్రంతా నానబెట్టుకోవచ్చు.
  2. ఆ తర్వాత అందులోని నీరంతా తీసేసి, మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి.
  3. ఆ పిండి మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని 8 నుంచి 10 గంటల వరకూ పులియనివ్వాలి.
  4. అన్ని గంటల తర్వాత పిండిని తీసుకుని మరోసారి కలుపుకోవాలి.
  5. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని మీడియం మంట మీద ఉంచాలి. అందులో పిండిని మధ్యలో వేసి సర్క్యూలర్ షేప్ లో తిప్పుతూ పల్చటి దోసెను వేసుకోవాలి.
  6. తినేందుకు కరకరలాడుతూ క్రిస్పీగా కావాలనిపిస్తే, దోసె అంచుల్లో నూనె వేయడం మర్చిపోకండి. దోసె అడుగు భాగం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ అలాగే ఉంచండి.
  7. దోసె మరోవైపు కూడా అదేలా వేయించండి.
  8. ఇప్పుడు దోసెను తీసుకుని, ఒక ప్లేట్ లో కొబ్బరి చట్నీతో పాటు లేదా సాంబార్ తో పాటు సర్వ్ చేసుకోండి.

గమనించాల్సిన విషయాలు:

  • పిండిని కనీసం 4గంటల సేపు నానబెట్టడం మర్చిపోకండి.
  • రాత్రంతా నానబెట్టిన పిండితో దోసె వేస్తే క్రిస్పీగా వస్తుంది.
  • బాగా పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఉండేలా నీరు కలపాలని మర్చిపోకండి.
  • దోసె వేడిగా తింటేనే బాగుంటుంది.
  • ఈ దోసె పిండి 2 - 3 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం