Palakura Puri: పాలకూర పూరి ఇలా చేసేయండి, ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది రెసిపీ ఇదిగో
Palakura Puri: పూరీలను ఆరోగ్యకరమైన పదార్థాలు కలిపి చేస్తే ఎంతో మంచిది. ఇక్కడ మేము పాలకూర పూరి రెసిపీ ఇచ్చాము. ఇది రుచిగా ఉంటుంది.
పూరి అనగానే మైదాతో చేసేదే అనుకుంటారు. నిజానికి ఈ పూరీని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. దీన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవాలి అనుకుంటే పాలకూర వంటివి కలిపి చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక్కడ మేము పాలకూర పూరి రెసిపీ ఇచ్చాము. అప్పుడప్పుడు దీన్ని చేసుకొని తినండి. మీకు ఎంతో నచ్చుతుంది. ఈ పాలకూర పూరి తో పాటు చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, చనా మసాలా, పన్నీర్ కర్రీ వంటివి పక్కన ఉంటే రుచి అదిరిపోతుంది. బంగాళదుంప కూరతో కూడా రుచిగానే ఉంటుంది. ఇక పాలకూర పూరి ఎలా చేసేయాలో చూసేయండి.
పాలకూర పూరి రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర తరుగు - ఒక కప్పు
గోధుమ పిండి - ఒక కప్పు
ఉప్మా రవ్వ - ఒకటిన్నర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
పచ్చిమిర్చి పేస్ట్ - ఒక స్పూను
నువ్వులు - ఒక స్పూను
ధనియాల పొడి - పావు స్పూను
జీలకర్ర పొడి - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పాలకూర పూరి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి అందులో పాలకూరను వేసి వేయించాలి.
2. అది పచ్చివాసన పోయేదాకా వేయించి చల్లార్చి ఆ తరువాత దాన్ని మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి.
3. చపాతీలకు గోధుమ పిండిని ఎలా కలుపుతారో అలాగే కలుపుకోవాలి.
4. ఆ మిశ్రమంలోనే పాలకూర ప్యూరీ, రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, ధనియాలపొడి, నువ్వులు, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
5. ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి.
6. మెల్లగా నీటిని వేస్తూ ఆ మిశ్రమాన్ని పూరీ పిండిలా గట్టిగా వచ్చేలా చేసుకోవాలి. ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి.
7. ఇప్పుడు అందులోంచి చిన్న ముద్దను తీసి పూరీ లాగా వత్తి వేడివేడి నూనెలో రెండువైపులా వేయించుకోవాలి.
8. అంతే టేస్టీ పాలకూర పూరి రెడీ అయినట్టే.
9. దీనిలో ఇది ఎక్కువగా నూనెను పీల్చినట్టు అనిపిస్తే ఒకసారి టిష్యూ పేపర్ మీద ఉంచి నొక్కండి సరిపోతుంది.
10. దీన్ని చికెన్ గ్రేవీతో, ఎగ్ గ్రేవీతో తింటే రుచి అదిరిపోతుంది.
11. రొయ్యలతో తిన్నా కూడా బాగుంటుంది.
ఇక శాఖాహారులైతే చనా మసాలా, పచ్చి బఠానీల కూర, బంగాళదుంప కూరలతో అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. అయితే దీన్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి తరచూ తినకుండా అప్పుడప్పుడు తింటే మంచిది. డీప్ ఫ్రై చేసే ఆహారాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
టాపిక్