Palak Pulao: పోషకాల పాలక్ పులావ్, పాలకూరతో ఇలా వండితే ఎవరైనా ఇష్టంగా తింటారు-palak pulao recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Pulao: పోషకాల పాలక్ పులావ్, పాలకూరతో ఇలా వండితే ఎవరైనా ఇష్టంగా తింటారు

Palak Pulao: పోషకాల పాలక్ పులావ్, పాలకూరతో ఇలా వండితే ఎవరైనా ఇష్టంగా తింటారు

Haritha Chappa HT Telugu
Aug 26, 2024 05:30 PM IST

Palak Pulao: పాలకూరను ఎక్కువ మంది ఇష్టపడరు. దాన్ని తినేవారి సంఖ్య తక్కువ. కానీ పాలకూరను పులావ్ రూపంలో వండితే అందరూ తింటారు. పాలక్ పులావ్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

పాలక్ పులావ్
పాలక్ పులావ్ (Hebbars kitchen)

Palak Pulao: పాలకూర పోషకాల గని. ప్రతిరోజూ తిన్నా ఆరోగ్యమే. కానీ పిల్లలు, కొంతమంది పెద్దలు దీన్ని ఇష్టంగా తినరు. దీని నుండి వచ్చే పచ్చివాసన వారికి నచ్చదు. అలా అని ఎక్కువ నూనె వేసి వేయించినా కూడా దీనిలోని పోషకాలు అన్ని మాయమైపోతాయి. కాబట్టి పాలకూరలో పోషకాలు పోకుండా టేస్టీగా వండుకోవడం ఎలాగో తెలుసుకోండి. ఇక్కడ మేము పాలక్ పులావ్ రెసిపీ ఇచ్చాము. ఇది పచ్చి వాసన వెయ్యదు. టేస్టీగా కూడా ఉంటుంది. పాలకూరను ఇలా పులావ్ రూపంలో వండి పిల్లలకు, పెద్దలకూ పెట్టండి. ఇష్టంగా తింటారు. దీన్ని వండడం కూడా చాలా సులువు.

పాలక్ పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం - రెండు కప్పులు

పాలకూర - రెండు కట్టలు

కొత్తిమీర - ఒక కట్ట

అల్లం - చిన్న ముక్క

పచ్చిమిర్చి - నాలుగు

నూనె - మూడు స్పూన్లు

క్యారెట్ - ఒకటి

ఫ్రెంచ్ బీన్స్ - నాలుగు

కాలీఫ్లవర్ ముక్కలు - పావు కప్పు

బఠానీలు - గుప్పెడు

పసుపు - అరస్పూను

ఉప్పు - రుచికి సరిపడా

గరం మసాలా - అర స్పూను

పాలక్ పులావ్ రెసిపీ

1. పాలకూరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో పాలకూర వేసి వేయించాలి.

4. పసుపు, ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి.

5. ఆ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చాలి. మిక్సీ జార్లో వేయించిన పాలకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

7. ఆ నూనెలో సన్నగా తరిగిన క్యారెట్లు, ఫ్రెంచ్ బీన్స్, కాలీఫ్లవర్ ముక్కలు, బఠానీలు వేసి వేయించుకోవాలి.

8. అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా వేయాలి.

9. అర స్పూన్ గరం మసాలా కలపాలి.

10. ఈ మొత్తం మిశ్రమాన్ని కాసేపు ఉడికించాలి.

11. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

12. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ కుక్కర్ లో వేసి బాగా కలుపుకోవాలి.

13. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి.

14. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి.

15. తర్వాత ఆవిరి పోయాక కుక్కర్ మూత తీయాలి.

16. ఒకసారి ఆ మిశ్రమాన్ని పొడిపొడిగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

17. పాలక్ పులావ్ తింటుంటే మరింతగా తినాలనిపిస్తుంది. దీనికి పక్కన రైతా ఉంటే టెస్ట్ అదిరిపోతుంది. రైతా లేకుండా కూడా పాలక్ పులావ్ తినవచ్చు.

పాలకూర ఉపయోగాలు

పాలకూరను పిల్లలు, పెద్దలు కచ్చితంగా తినాలి. పాలకూరను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా పాలకూర ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. రక్తాన్ని శుద్ధి చేసే గుణం పాలకూరకు ఉంది. అలాగే చర్మాన్ని, జుట్టును మెరూపించడంలో పాలకూర ముందుంటుంది. వీలైనంతవరకూ వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోండి. ఇలా పాలకూర పులావును చేసుకొని తింటే రుచిగా ఉంటుంది. పాలకూర పోషకాలను శరీరంలో చేరుతుంది.

టాపిక్