Stroke: తలనొప్పి ఎక్కువగా వస్తుందా? అయితే స్ట్రోక్​ వచ్చే ప్రమాదం ఎక్కువే-pain hints at a 30 percent increased risk of stroke ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Pain Hints At A 30 Percent Increased Risk Of Stroke

Stroke: తలనొప్పి ఎక్కువగా వస్తుందా? అయితే స్ట్రోక్​ వచ్చే ప్రమాదం ఎక్కువే

Maragani Govardhan HT Telugu
Feb 28, 2022 06:03 PM IST

సాధారణంగా మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించాలంటే సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సంతృప్త కొవ్వులు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ధూమపానం, మద్యపానం, ధమనులు సంకోచం లాంటి కారణాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

స్ట్రోక్
స్ట్రోక్ (Hindustan Times)

Stroke.. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో స్ట్రోక్స్​కు గురవుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఫలితంగా అర్ధాంతరంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. సాధారణంగా మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించాలంటే సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సంతృప్త కొవ్వులు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ధూమపానం, మద్యపానం, ధమనుల సంకోచం లాంటి కారణాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. తాజాగా జరిగిన నూతన అధ్యయనం ప్రకారం నిర్దిష్ట రకమైన నొప్పిని అనుభవించడం వల్ల కూడా స్ట్రోక్​ వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది.

దీర్ఘకాల నొప్పులతో గుండెపోటు..

ప్రపంచ వ్యాప్తంగా మరణాలు, వైకల్యాలు సంభవించడానికి స్ట్రోక్ కూడా ప్రధాన కారణం. ఆహారపు అలవాట్లు, ధూమపానం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం లాంటివి స్ట్రోక్​కు ప్రధాన కారణాలు. 2020లో పెయిన్ మెడిసన్ జర్నల్​లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం దీర్ఘకాలంగా ఏదైనా నొప్పితో బాధపడుతున్నవారిలో మిగిలినవారితో పోలిస్తే స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా వైద్యులు సూచించిన మందులు లేదా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ వల్ల కూడా శరీర భాగాల్లో నొప్పి రావచ్చని తెలిపారు. సాధారణంగా ఈ కింద పేర్కొన్న శరీర భాగాల్లో నొప్పి వచ్చే అవకాశముంది.

- తలనొప్పి

- ఆర్థరైటిస్

- వెన్నెముక రుగ్మతలు

ఇవి కాకుండా నిరాశ, ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం లేదా సరిగ్గా వ్యాయామం చేయలేకపోవడం లాంటి కారణాల వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.

స్ట్రోక్ లక్షణాలు..

ఎవరికైనా గుండెపోటు ఎప్పుడు వస్తుందంటే మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కలుగుతుంది. ఫలితంగా మెదడు కణాలు నిర్జీవమవుతాయి. దీంతో వైకల్యం, బ్రెయిన్ ఇంజురీ లేదా కొన్నిసార్లు మరణానికి దారితీసే అవకాశముంటుంది. స్ట్రోక్ రెండు రకాలుగా ఉంటుంది. ఇస్కీమిక్, హమరెజిక్. ఇందులో మొదటిది 85 శాతం స్ట్రోక్ కేసుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా ఇస్కీమిక్ రకం స్ట్రోక్ వస్తుంది. అంతర్గత పేలుడు(Internal Burst) కారణంగా రక్తనాళాలు బలహీనపడి రెండో రకం స్ట్రోక్ సంభవిస్తుంది.

- గుండెపోటు వచ్చినప్పుడు నోరు, కన్ను పడిపోతుంది. అంతేకాకుండా వ్యక్తులను నవ్వకుండా అదుపుచేస్తుంది.

- బలహీనత లేదా తిమ్మిరి కారణంగా రెండు చేతులను పైకెత్తలేకపోవడం జరుగుతుంది

- స్పష్టంగా మాట్లాడలేకపోవడం

- మెలకువగా ఉన్నప్పటికీ ఇంద్రియాలను అదుపులోకి ఉంచలేకపోవడం జరుగుతుంది.

 

WhatsApp channel

సంబంధిత కథనం