Egg curry: పచ్చికారం ఎగ్ కర్రీ ఇలా చేస్తే వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదిగో-pachi karam egg curry recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Curry: పచ్చికారం ఎగ్ కర్రీ ఇలా చేస్తే వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదిగో

Egg curry: పచ్చికారం ఎగ్ కర్రీ ఇలా చేస్తే వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Jan 30, 2025 05:30 PM IST

Egg curry: ఎగ్ కర్రీని కాస్త డిఫరెంట్‌గా చేయాలనుకుంటే పచ్చికారంతో వండి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.

పచ్చికారం కోడిగుడ్డు కూర రెసిపీ
పచ్చికారం కోడిగుడ్డు కూర రెసిపీ

కోడిగుడ్డు ఎంతోమందికి ఫేవరెట్. కోడిగుడ్డుతో ఉండే వంటకాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ మేము కోడిగుడ్డు కర్రీని కాస్త డిఫరెంట్గా పచ్చికారంతో ఎలా వండాలో ఇచ్చాము. దీన్ని ఒకసారి వండి చూడండి. మీ ఇంటిలోపాదికి నచ్చడం ఖాయం. పచ్చికారంతో ఎగ్ కర్రీ రెసిపి ఇదిగో.

yearly horoscope entry point

పచ్చికారం ఎగ్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు - నాలుగు

పసుపు - అర స్పూను

ఉల్లిపాయలు - మూడు

పచ్చిమిర్చి - ఆరు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి - పది

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

నూనె - మూడు స్పూన్లు

బిర్యానీ ఆకు - ఒకటి

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - మూడు

మిరియాలు - నాలుగు

యాలకులు - రెండు

జీలకర్ర - అర స్పూను

పసుపు - పావు స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

పెరుగు - అరకప్పు

గరం మసాలా - అర స్పూను

కసూరి మేతి - ఒక స్పూను

పచ్చికారంతో ఎగ్ కర్రీ రెసిపీ

1. కోడిగుడ్లను ఉడకబెట్టి పైన పొట్టు తీయాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో అర స్పూను పసుపు వేసి కోడిగుడ్లను వేయించాలి. కోడిగుడ్లకు గాటులు పెట్టుకోవాలి.

4. ఇప్పుడు వేగిన కోడిగుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. వాటిని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

5. ఆ మిగిలిన నూనెలో ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.

6. ఉల్లిపాయలు కాస్త రంగు మారేవరకు వేయించాలి.

7. వాటిని మిక్సీలో వేసి కొత్తిమీర తరుగును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

9. ఆ నూనెలో బిర్యాని ఆకును ముక్కలు చేసి వేసుకోవాలి.

10. అందులోనే లవంగాలు, దాల్చిన చెక్క, రెండు యాలకులు, మిరియాలు వేసి వేయించుకోవాలి.

11. అలాగే జీలకర్రని కూడా వేసి వేయించాలి.

12. ఇప్పుడు ఆ నూనెలో ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చికారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

13. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.

14. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను అందులో వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు చిన్న మంట మీద అలా ఉడికించాలి.

15. నూనె పైకి తేలేక పైన కసూరి మేతిని చల్లుకోవాలి.

16. ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

17. అంతే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అందరికీ నచ్చుతుంది.

కోడిగుడ్డు కూరలో పచ్చికారం వేసి వండాము. మన ఆరోగ్యానికి మేలు చేసే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వంటివి వాడాము. కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా మేము చెప్పిన విధంగా ఒకసారి కోడిగుడ్డ కూర వండుకొని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner