Orange Peel Benefits : తొక్కే కదా అని పారేస్తే ఈ 5 ప్రయోజనాలు మిస్ అవుతారు
Orange Peel : నారింజ లోపలి భాగం తినేసి.. తొక్క విసిరేస్తారు. కానీ నారింజ తొక్కతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి తెలిస్తే.. మీరు ఇకపై తొక్కను కూడా ఉపయోగించుకుంటారు.
నారింజ కాస్త తియ్యగా, కాస్త పులుపుగా ఉన్నప్పటికీ నోరూరించే పండు. ఇందులో ఉండే విటమిన్ సి, కాల్షియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాధారణంగా పండు లోపల తింటాం. తొక్కను చెత్తలో వేస్తాం. అయితే ఇలా చేయకండి. తొక్క వల్ల కలిగే లాభాలు తెలిస్తే పారేయరు.
ట్రెండింగ్ వార్తలు
ఆరెంజ్ తొక్క(Orange Peel) చర్మానికి చాలా మంచిది. మీ చర్మం జిడ్డుగా ఉంటే అది ఔషధంలా పనిచేస్తుంది. దాని పొడిని తేనెతో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. మీ ముఖం మెరిసిపోతుంది మరియు మచ్చలు కూడా పోతాయి.
చాలా మందికి సరిగా నిద్రపట్టదు. మీకు ప్రశాంతమైన నిద్ర రాకపోతే, ఒక నారింజ తొక్కను నీటిలో వేసి మరిగించాలి. ఆపై తాగండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది.
ఆరెంజ్ తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. ఈ నారింజ తొక్కను వేడి నీటిలో కడిగిన తర్వాత తినవచ్చు. కొందరు దీనిని చక్కెర, నిమ్మకాయతో తినడానికి ఇష్టపడతారు.
సాధారణంగా మార్కెట్ నుండి ఖరీదైన, కెమికల్ హెయిర్ కండీషనర్లను కొనుక్కుంటాం. అయితే వాటికి బదులుగా నారింజ తొక్క చాలా ప్రభావవంతంగా ఉంటుందని మీకు తెలుసా. ఈ తొక్క జుట్టుకు ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. దీని కోసం నారింజ తొక్కతో తయారు చేసిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. కాసేపటికి కడిగితే జుట్టు నిగనిగలాడుతుంది.
జుట్టు(Hair)లో చుండ్రు కనిపించడం మెుదలైనప్పుడు.., మీరు ఎండిన నారింజ తొక్కను పొడిగా చేసి, ఆపై కొబ్బరి నూనెలో కలుపుకొవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోతుంది.