Optical Illusion: మీ కంటి చూపు పదునైనదైతే ఈ చిత్రంలో W ఎక్కడుందో అయిదు సెకండ్లలో కనిపెట్టండి-optical illusion if your eyesight is sharp find where w is in this picture in five seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: మీ కంటి చూపు పదునైనదైతే ఈ చిత్రంలో W ఎక్కడుందో అయిదు సెకండ్లలో కనిపెట్టండి

Optical Illusion: మీ కంటి చూపు పదునైనదైతే ఈ చిత్రంలో W ఎక్కడుందో అయిదు సెకండ్లలో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu
Dec 30, 2023 07:00 AM IST

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో ఆంగ్ల అక్షరం M మధ్య మరో ఆంగ్ల అక్షరం W ఇరుక్కొని ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టండి.

W ఎక్కడుందో కనిపెట్టండి
W ఎక్కడుందో కనిపెట్టండి (instagram)

Optical Illution: ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించడమే ఆప్టికల్ ఇల్యూషన్. దీన్ని దృశ్య భ్రమ అంటారు. ఆప్టికల్ ఇల్యుషన్లో అక్షర భ్రమలు, బొమ్మల భ్రమలు అని రెండు రకాలు ఉంటాయి. అక్షర భ్రమలు అంటే ఒకే రకమైన అక్షరాలలో వేరే అక్షరం ఇరుక్కుని ఉంటుంది. అలాగే బొమ్మల భ్రమలు అంటే ఒకే రకమైన బొమ్మల మధ్యలో వేరే రకం బొమ్మ ఇరుక్కుని ఉంటే దాన్ని తక్కువ సమయంలోనే కనిపెట్టాలి. ఇక్కడ మేము ఒక అక్షరాల ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో ఆంగ్ల అక్షరం M ఉంది. వాటి మధ్యలో ఆంగ్ల అక్షరం W ఇరుక్కొని ఉంది. దాన్ని మీరు కేవలం ఐదు సెకండ్లలోనే కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెడతారు. ఐదు సెకండ్లలో కనిపెడితే మీ మెదడు, కళ్ళు చురుగ్గా పనిచేస్తున్నట్టే లెక్క ప్రయత్నించండి.

yearly horoscope entry point

జవాబు ఇదే

ఇక్కడ అన్ని లైన్లలో M అనే అక్షరం ఉంది. మూడో లైన్ లోని మధ్యలో W అనే అక్షరం ఉంది. జాగ్రత్తగా చూస్తే మీరు దాన్ని కనిపెట్టగలరు. దీన్ని ఐదు సెకండ్లలోనే కనిపెట్టి ఉంటే మీ తెలివితేటలు సూపర్, మీ మెదడు అద్భుతంగా పనిచేస్తున్నట్టే లెక్క.

ఆప్టికల్ ఇల్యూషన్ అంటే...

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది కళ్ళముందే నిజం కనిపిస్తున్నా దాన్ని కనిపెట్టడానికి కాస్త కష్టపడాలి. ఇదే ఆప్టికల్ ఇల్యూషన్. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడమే ఆప్టికల్ ఇల్ల్యూషన్ల ప్రత్యేకత. పురాతన కాలం నుంచి ఇవి వాడుకలో ఉన్నాయి. వీటి పుట్టుక గ్రీకు దేశంలో ఉన్నట్టు చెబుతారు. అక్కడి పురాతన కళల్లో ఆప్టికల్ ఇల్యూషన్లను ఒక భాగంగా గుర్తించారు. ఇప్పటికీ పురాణ గ్రీకు వాస్తు శిల్పాల్లో అక్కడ ఆప్టికల్ ఇల్యుషన్లు దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరించింది మొదట గ్రీకులే అని చెప్పవచ్చని అంటున్నారు చరిత్రకారులు. ఆప్టికల్ ఇల్యూషన్లు అనేవి కాంతి వక్రీభవనం వల్ల ఏర్పడే వింతలు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎంతోమంది ఆర్టికల్ ఇల్యుషన్లను చిత్రీకరించే చిత్రకారులు పుట్టుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వీటిని చిత్రించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాటిని చూసి టైం పాస్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. కంటికి, మెదడుకు మధ్య సమన్వయం కుదురుతుంది. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మానసికంగా మంచే జరుగుతుందని చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు.

Whats_app_banner