OnePlus TV: వాచ్‌తో ఈ టీవీని కంట్రోల్ చెయొచ్చు.. నిద్రపోగానే అదే ఆఫ్ అవుతుంది!-oneplus tv 50 y1s pro india launch set for 4 july with smart volume control and sleep detection feature ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oneplus Tv: వాచ్‌తో ఈ టీవీని కంట్రోల్ చెయొచ్చు.. నిద్రపోగానే అదే ఆఫ్ అవుతుంది!

OnePlus TV: వాచ్‌తో ఈ టీవీని కంట్రోల్ చెయొచ్చు.. నిద్రపోగానే అదే ఆఫ్ అవుతుంది!

HT Telugu Desk HT Telugu
Jul 02, 2022 12:47 PM IST

OnePlus TV 50 Y1S Pro: ప్రముఖ మెుబైల్ బ్రాండింగ్ సంస్థ వన్ ప్లస్ అత్యాధునికి ఫీచర్స్ కలిగిన OnePlus TV 50 Y1S Pro టీవీని భారత మార్కెట్లొకి విడుదల చేయబోతుంది.

OnePlus TV 50 Y1S Pro
OnePlus TV 50 Y1S Pro

కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జూలై 4న విడుదలకానున్న OnePlus TV 50 Y1S Proపై ఓ లుక్ వేయండి. ఈ టీవీ మోడల్ MEMC టెక్నాలజీతో 4K UHD డిస్ప్లేతో బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. ఇది HDR10కు సపోర్ట్ అందిస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్, AI- పవర్డ్ విజువల్స్‌తో 24W స్పీకర్లతో దీన్ని రూసొందించారు. ఈ న్యూ స్మార్ట్ టీవీలో 8GB ఇంటర్నల్ స్టోరేజీని కూడా అందించారు.

జూలై 4న లాంచ్ కానున్న వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో స్మార్ట్ టీవీని గత వారం వినియోగదారులకు పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్ టీవీని లాంచ్ జూలై 4, 2022న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని కంపెనీ తాజా అప్‌డేట్‌ ఇచ్చింది. మరోవైపు, అమెజాన్ ఇండియా, OnePlus TV 50 Y1S ప్రో స్పెసిఫికేషన్‌లను వివరించింది.

OnePlus TV 50 Y1S ప్రో స్పెసిఫికేషన్‌లు

OnePlus TV 50 Y1S Pro 10-బిట్ కలర్ డెప్త్‌తో 50-అంగుళాల పోడవుతో 4K UHD డిస్‌ప్లేను కలిగి ఉంది. మోషన్ కాంపెన్సేషన్ (MEMC) సపోర్ట్, HDR10 సపోర్ట్, డాల్బీ ఆడియోతో సహా అనేక ఫీచర్లతో ఇందులో అమర్చారు. మునుపటి వన్‌ప్లస్ వై-సిరీస్ స్మార్ట్ టీవీ మోడల్‌ల మాదిరిగానే, ఈ రాబోయే ఈ స్మార్ట్ టీవీలో కూడా మేనేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇది సిస్టమ్ స్పీడ్, స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయడం వంటి అనేక ఫంక్షన్‌లను నియంత్రించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

OnePlus TV 50 Y1S Pro డాల్బీ ఆడియో సపోర్ట్ చేసేలా 24W స్పీకర్లను కలిగి ఉంటుందనిటీవీ అమోజన్ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ ఇతర OnePlus డివైజ్‌లతో ఈజీగా కనెక్టివిటీ చేయవచ్చు. వినియోగదారులు స్మార్ట్ వాల్యూమ్ కంట్రోల్‌తో OnePlus వాచ్ ద్వారా ఈ టీవీ వాల్యూమ్‌ను సర్దుబాటు చేయవచ్చు. స్లీప్ డిటెక్షన్ ఫీచర్‌తో, ఇది ఆటోమేటిక్‌గా యూజర్‌లానే ఇది నిద్రలోకి జారుకుంటుంది. అంటే వినియోగదారుడు నిద్రపోగానే టీవీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఈ లిస్టింగ్ కొత్త స్మార్ట్ టీవీలో 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కూడా ఉంది

WhatsApp channel

టాపిక్