Homemade Hair Oil: పొడవాటి జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా? వారానికి రెండు సార్లు ఈ నూనె పెట్టుకోండి చాలు!
Homemade Hair Oil: పొడవాటి జుట్టు అంటే మీకు చాలా ఇష్టమా? ఇందుకోసం మార్కెట్లో దొరికిన నూనెలు అన్నీ వాడి విసిగిపోయారా? అయితే ఉసిరి, లవంగాలతో తయారు చేసిన ఈ నూనెను వాడి చూడండి. వారానికి రెండు సార్లు ఈ నూనెను అప్లై చేశారంటే జుట్టు ఎదుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంట్లోనే మీరే దీన్నితయారు చేసుకోవచ్చు.
జుట్టు సమస్యలు నేడు సర్వసాధారణంగా మారాయి. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. కొందరికి జుట్టు విపరీతంగా రాలిపోతుంది. మరి కొందరికి వెంట్రుకలు పొడిబారి చిట్లి పోతున్నాయి. పొడవాటి జుట్టు అయితే ఈ రోజుల్లో చాలా మందికి కలగానే మారిపోయింది. మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ జుట్టు పరిస్థితి మెరుగుపడటం లేదు. మీకూ ఇలాగే జుట్టు రాలిపోతుందా? ఎంత ప్రయత్నించినా వెంట్రుకలు పొడవు పెరగడం లేదా? అయితే ఒకసారి ఈ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి. ఉసిరి లవంగాలతో తయారు చేసే ఈ నూనె అన్ని రకాల వెంట్రుకల సమస్యలకు పరిష్కారం చూపించగలదు.
ప్రముఖ డైటీషియన్ శ్వేతా పంచాల్ చాలా అద్భుతమైన హెయిర్ ఆయిల్ రెసిపీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీన్ని మీరే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పొడవాటి జుట్టుతో పాటు దాదాపు ప్రతి జుట్టు సమస్యకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేయాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
హెయిర్ ఆయిల్ తయారీకి కావాల్సినవి:
- కొబ్బరి నూనె,
- ఉసిరికాయలు,
- లవంగాలు,
- బాదం
- మెంతి గింజలు
హెయిర్ ఆయిల్ తయారీ విధానం..
- దీన్ని తయారు చేయడానికి మొదట నూనెను ఇనుప పాన్లో పోసి తక్కువ మంటపై వేడి చేయాలి.
- నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఉసిరికాయలను, లవంగాలను వేసి కలపాలి.
- కొబ్బరినూనె మరిగి ఉసిరి రంగు మారుతున్నప్పుడు దాంట్లో పది నుంచి పదిహేను బాదం పప్పులు, మెంతులు వేయాలి.
- వీటన్నింటినీ తక్కువ మంట మీద బాగా మరిగించాలి.
- నూనె అంతా రంగు మారి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మంట ఆపేయాలి.
- కాస్త చల్లారిన తర్వాత వడగట్టి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
- అంతే ఉసిరి లవంగాలతో నూనె తయారయినట్టే.
ఈ హెయిర్ ఆయిల్‌తో ప్రయోజనాలు..
- ఉసిరిలో ఉండే విటమిన్ -సీ, ఫ్లవనాయిడ్స్, కాల్షియం వంటి పోషకాలు వెంట్రుకల రుగ్మతలకు చికిత్సగా ఉపయోగపడతాయి. అలాగే వేగంగా పరిగేందుకు సహాపడతాయి. తలలో రక్తప్రవాహాన్ని పెంచి జుట్టు కుదుళ్లకు పోషకాలను అందిస్తాయి. తద్వారా పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది.
- ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు వెంట్రుకల జిగటను తగ్గించి మృదువుగా ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తాయి.
- ఉసిరిలో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్స్ జుట్టు రంగు రంగును పటిష్టంగా ఉంచేందుకు, వాటి పిగ్మెంటేషన్ ను పునరుద్ధరించడానికి సహాయం చేస్తాయి.
- ఇక లవంగంలో ఉన్న శక్తివంతమైన పోషకాలు, రక్తప్రసరణను పెంచి, జుట్టు మూలాలకి పోషకాలను అందించి, జుట్టు పెరిగేందుకు సహాయపడతాయి. లవంగం జుట్టు పెరుగుదలకు సహాయపడే ఒక అద్భుతమైన ఆహారం.
- ఇది తలపై రక్తప్రసరణను పెంచి, జుట్టు మూలాలను బలపరుస్తుంది. తద్వారా జుట్టు రూకుటాన్ని తగ్గిస్తుంది.
- లవంగంలో ఉన్న యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు తలపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. ఇది చుండ్రు, దద్దుర్లు వంటి ఇతర తల సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- లవంగం జుట్టుకు సహజమైన ప్రకాశాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును మృదువుగా, గ్లోవింగ్ గా ఉంచి, దాని ఆరోగ్యాన్ని పెంచుతుంది.
- జుట్టును దృఢంగా ఉండటానికి తేమని నిలబెట్టడానికి సహాయం చేస్తుంది. ఫలితంగా జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
ఎలా ఉపయెగించాలి?
- వారానికి కనీసం రెండు సార్లు ఈ నూనెను తలకు పట్టించి గంటకు పైగా ఉంచిన తర్వాత తలస్నానం చేయాలి.
- ఇలా రెండు లేదా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా నూనెను వాడితే జుట్టు చక్కగా పెరగడంతో పాటు, వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి. జుట్టు కుదుళ్ల నుంచి బలపడి ఉడిపోకుండా ఉంటుంది.
- జుట్టుకు సరైన పోషణ అంది ఆరోగ్యంగా, మెరిసే కురులు మీ సొంతం అవుతాయి.