Holi: హోలీ రోజున ఆడవాళ్లు… మగవారి వెంటబడి చితక్కొడతారు, దుస్తులు చించేస్తారు, ఎక్కడంటే…-on the day of holi some parts of india follow strange traditions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  On The Day Of Holi, Some Parts Of India Follow Strange Traditions

Holi: హోలీ రోజున ఆడవాళ్లు… మగవారి వెంటబడి చితక్కొడతారు, దుస్తులు చించేస్తారు, ఎక్కడంటే…

Haritha Chappa HT Telugu
Mar 22, 2024 02:30 PM IST

Holi: హోలీ పండుగ వచ్చేస్తుంది. పిల్లా పెద్దా కలిసి రంగుల చల్లుకునేందుకు సిద్ధమవుతున్నారు. మనదేశంలో హోలీని కొన్నిచోట్ల విచిత్రంగా నిర్వహించుకుంటారు.

హోలీ
హోలీ (Pixabay)

Holi: మనల్ని రంగుల్లో తడిపే ప్రకాశవంతమైన పండుగ హోలీ. మన దేశం అంతటా కూడా ఈ హోలీని చాలా వేడుకగా నిర్వహించుకుంటారు. వసంత రుతువు రాకను ఈ హోలీ సూచిస్తుంది. అలాగే చెడుపై మంచి విజయానికి కూడా హోలీ సూచిక. ఒకరికొకరు రంగులు పూసుకోవడం నీళ్లు చల్లుకోవడం అనేది హోలీ వేడుకలో ప్రధాన భాగం. అయితే హోలీ రోజున భారతదేశమంతటా విభిన్న సాంస్కృతిక పద్ధతులు ఉన్నాయి. కొంతమంది చాలా విచిత్రంగా హోలీని నిర్వహించుకుంటారు. అలాంటి విచిత్రమైన హోలీ సాంప్రదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి.

లాత్ మార్

ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు మహిళలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. స్త్రీలంతా కర్రలనే తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వారిని వెంబడిస్తూ ఉంటారు. ఇది సరదాగా ఆడే సంప్రదాయమే. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు అనుసంధానంగా చెప్పుకుంటారు. ఆ రోజున బర్సానాలో చిన్న చిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటారు.

చితా భస్మ హోలీ

వారణాసిలో చితా భస్మా హోలీని నిర్వహిస్తారు. అక్కడ సాధువులు, అఘోరాలు... తమ భక్తులతో మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి చితి నుండి బూడిదను తీసి హోలీగా ఆడతారు. వారణాసిని ముక్తి నగరంగా భావిస్తారు. తమ శరీరాలపై ఈ చిత భస్మాన్ని పూసుకుంటారు. తద్వారా శివునికి తమ భక్తిని తెలియజేస్తారు. వీరంతా వీధుల్లో తిరుగుతూ శివనామస్మరణ చేస్తారు.

భాంగ్ హోలీ

భాంగ్ అంటే గంజాయితో చేసిన పేస్టు. దీన్ని హోలీ వేడుకల్లో భాగంగా తయారు చేస్తారు. ఆ రోజున తయారుచేసిన పానీయాలు, ఆహారాలలో ఈ పేస్టును వినియోగిస్తారు. గంజాయి పై నిషేధం ఉన్నప్పటికీ హోలీ సమయంలో మాత్రం దీన్ని చట్టబద్ధంగా వినియోగిస్తారు. భాంగ్ తయారీ అనేది అక్కడ ఒక కళగా చెప్పుకుంటారు. కుటుంబ వంటకాలలో దీన్ని భాగం చేసుకుంటారు. ఉత్తర ప్రదేశ్ లోని చాలా చోట్ల హోలీ రోజున భాంగ్ ను ఆహారంగా వాడతారు.

తేళ్లతో ఆట

ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో సంతన అనే గ్రామం ఉంది. అక్కడ స్థానికులు హోలీ వచ్చిందంటే సాహసోపేతమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున బైసన్ దేవి ఆలయ కింద ఉన్న రాతి భూభాగంలో ఉన్న తేళ్ళను సేకరించి తమ శరీరాలపై పెట్టుకుంటారు. ఆ తేళ్లు తమని కుట్టమని ఆ గ్రామస్తుల నమ్మకం.

మధుర సమీపంలో దౌజీ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. పురుషులు, స్త్రీలు రంగులు జల్లు కావడం... స్త్రీలు, పురుషుల దుస్తులను చింపివేయడం వంటివి చేస్తారు. ఇది చాలా కోలాహలంగా జరుగుతుంది.

టాపిక్