Olive Leaves: గుండె జబ్బుల్లాంటి సమస్యలను తరిమికొట్టడంలో ఆలివ్ ఆకులు.. ఆలివ్ ఆయిల్ కంటే బెటర్ అని తెలుసా?
Olive Leaves: ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే వారికి ఆలివ్ గొప్పదనం ప్రత్యేకతంగా చెప్పనవసరం లేదు. దాని వల్ల కలిగే బెనిఫిట్ తెలిసి ప్రతిపూట తాము తినే ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాల్సిందే ఎవరైనా.. ప్రాణాంతక సమస్యల నుంచి బయటపడేయగల ఆలివ్ ఆకుల గురించి తెలుసుకుందాం.
ఆలివ్ నూనెకు మార్కెట్లో ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఆలివ్ కాయల నుంచి తయారుచేసే ఈ నూనె వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రీయంగా నిరూపణ అయింది కూడా. కానీ, కేవలం కాయల ద్వారానే కాదు. వాటి ఆలివ్ ఆకుల ద్వారా కూడా ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా. ఆలివ్ కాయలు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఆకులు కూడా కలుగజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటి? వాటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందామా?
ఆలివ్ ఆకులతో అద్భుతాలు:
ఆలివ్ కాయలే కాదు ఆకులు కూడా హెల్త్ బెనిఫిట్స్ కలుగజేస్తాయట. ఇన్ని రోజులుగా ఆలివ్ కాయలతో చేసే నూనెతోనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంతా అనుకుంటాం కదా. గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గించడంలో ఆలివ్ నూనె సహాయపడుతుందని తెలుసు కదా. ఇప్పుడు, ఆలివ్ ఆకులతో కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఆలివ్ ఆకుల్లో ఏముంది?
ఆలివ్ ఆకుల్లో ఒలేయురోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కణాలను నష్టం నుండి కాపాడుతుంది. అంతేకాదు, ఆకుల్లో హైడ్రాక్సీటైరోసోల్, లుటియోలిన్, అపిజెనిన్ వంటి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఆలివ్ ఆకులపై జరిపిన అధ్యయనాల్లో వీటిల్లో ఉండే ఆకుసారం రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడతాయట. దాంతో పాటు రక్తలిపిడ్లను మెరుగుపరిచి, శరీరంలో గ్లూకోజ్ ను క్రమబద్దీకరిస్తాయట.
ఆరోగ్య ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం: ఆలివ్ ఆకులు రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
రోగ నిరోధక శక్తి: ఆలివ్ ఆకులు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి.
అల్జీమర్స్ వ్యాధి నిరోధకం: కొన్ని అధ్యయనాలు, ఆలివ్ ఆకులు మెదడు ఆరోగ్యాన్ని కాపాడి, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచిస్తున్నాయి.
క్యాన్సర్ నిరోధకం: ఆలివ్ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయి.
చాలా వరకూ ఆలివ్ ఆకులను సాధారణ జ్వరం, మలేరియా లాంటి వైరల్ ఫీవర్లకు చికిత్స కోసం వాడతారు.
ఆలివ్ ఆకులను పలు రకాలుగా ఉపయోగించవచ్చు:
ఆలివ్ ఆకులతో టీ చేసుకుని తాగడం: ఆలివ్ ఆకులను నీటిలో వేడి చేసి టీలా తాగవచ్చు.
క్యాప్సూల్స్ మాదిరిగా ఆలివ్ ఆకులు: ఆలివ్ ఆకుల సారాన్ని క్యాప్సూల్స్ రూపంలో మార్చుకుని నిల్వ చేసుకుని కూడా తీసుకోవచ్చు.
ఆహారంలో తినేందుకు ఆలివ్ ఆకులను ఎలా వినియోగించాలంటే: ఆలివ్ ఆకులను ఆహారంలో కూడా చేర్చుకుని నేరుగా తినేయవచ్చు.
ఆలివ్ ఆకులు మంచివే కానీ, ఇందులో ఉండే హైడ్రాక్సీటైరోసోల్, లుటియోలిన్, అపిజెనిన్ లతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లను తీసుకునే ముందు వైద్యుడి సలహా తప్పక తీసుకోవాలి. ఈ ఆకులను తినాలని అనుకుంటే, ఇతర మందులతో పాటు కలిపి తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవాలి. గర్భిణీ మహిళలు ఈ ఆకులను తినకపోవడమే మంచిది. వీటిని పరిమిత మొత్తంలో మాత్రమే తీసుకోవాలి.
సంబంధిత కథనం