బ్రేక్ ఫాస్ట్ లో కొందరు పాలలో నానబెట్టిన ఓట్స్ తింటారు. మరికొందరు మసాలా ఓట్స్ వండుకుని తింటారు. కొందరు ఓట్స్ ను పండ్లు, పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే వీటన్నింటికన్నా ఓట్స్ ఊతప్పం రుచిగా ఉంటుంది. ఈ ఉతప్పం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే రకమైన ఆహారం తినడానికి బోర్ కొడితే తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయవచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఓట్స్ ఊతప్పం రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
ఓట్స్ - అర కప్పు
ఇడ్లీ రవ్వ - అర కప్పు
నిమ్మరసం - అర స్పూను
బేకింగ్ సోడా - చిటికెడు
ఉల్లిపాయ - ఒకటి
టమోటా - ఒకటి
క్యాప్సికమ్ - ఒకటి
ధనియాల పొడి - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - అర స్పూను
నెయ్యి లేదా నూనె - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
జొన్న పిండి లేదా శెనగ పిండి - ఒక స్పూను
3. ఆ ఓట్స్ పిండిలోనే ఇడ్లీ రవ్వ, గుప్పెడు జొన్న పిండి లేదా శనగ పిండి వేసి కలపాలి.
4. ఆ తర్వాత ఉప్పు, నీళ్లు బాగా కలపాలి. దీన్ని పావుగంట సేపు పక్కన పెట్టాలి. తరువాత బాగా కలపాలి. ఎలాంటి ముద్దలు లేకుండా బాగా కలపాలి.
5. పిండి నీటిని పీల్చుకుని కొద్దిగా చిక్కగా అవుతుంది. అందులో ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ తరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి.
6. పిండి మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు, సోడా వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం కలపాలి.
7. స్టవ్ మీద పెనం పెట్టి నూనె లేదా నెయ్యి వేయాలి. పిండిని ఊతప్పంలా మందంగా వేసుకోవాలి.
8. రెండు వైపులా కాల్చుకుని తీపి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఇక్కడ చెప్పిన ఓట్స్ ఊతప్పం చేస్తే బ్రేక్ ఫాస్ట్ అదిరిపోతుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఇది మంచి రెసిపీ అని చెప్పుకోవాలి. దీన్ని వండడం కూడా చాలా సులువు.